.webp&w=3840&q=75)
వైసీపీ వచ్చే ఎన్నికలలోనూ ఓటమి ఖరారని ఇప్పుడే మానసికంగా ఫిక్సైపోయిదా? వచ్చే ఎన్నికలలో కూడా పరాజయం తప్పదన్న నిర్ణయానికి వచ్చేసిందా?
అన్న ప్రశ్నలకు తాజాగాకేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్) విషయంలో ఆ పార్టీ లేవనెత్తుతున్న అభ్యంతరాలు, చేస్తున్న విమర్శలను ఎత్తి చూపుతూ పరిశీలకులు ఔననే అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు అధికార పక్షానికి కొమ్ముకాసేలా ఉన్నాయంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు (ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించే ప్రక్రియను గత నెల 15 నుండి ప్రారంభించారు. ఈ సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, ఓటర్ల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. దీని ఆధారంగా జూలై 21న ఓటర్ల ప్రాథమిక ముసాయిదా విడుదల కానుంది. ఆ తర్వాత అభ్యంతరాలు, చేర్పులు, మార్పుల ప్రక్రియ ముగిశాక, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అయితే ఈ 3 నెలల సుదీర్ఘ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని వైసీపీ విమర్శిస్తోంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
బూత్‌కు 50 చొప్పున తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను అధికార కూటమి ప్రభుత్వం తొలగిస్తోందనీ సర్ గడువు నెల రోజులు పెంచాలంటూ వైసీపీ వినతిపత్రాలు ఇస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీ మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికలలో ఓటమికి ఇప్పటి నుంచే రెడీ అయిపోతోందా? అన్న అనుమానాలు కలిగేలా చేస్తున్నదంటున్నారు పరిశీలకులు.
ఎందుకంటే.. ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియ ఎలా జరుగుతుందన్న విషయంలో రహస్యమేదీ ఉండదు.. రాజకీయ పార్టీలకే కాదు.. సామాన్య ప్రజలకు కూడా ఈ ప్రక్రియ పట్ల సంపూర్ణ అవగాహన ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి.. నివాసం ఉంటున్న వారినే ఓటర్లుగా గుర్తిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిశీలనలో అర్హులైన ఏ పౌరుడి ఓటు పోయే అవకాశమే ఉండదు.
పోతే గీతే.. ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో చేర్చిన దొంగ ఓట్లు.. చనిపోయిన వారి పేరుతో ఉన్న బోగస్ ఓట్లు, ఒకే వ్యక్తికి రెండు, మూడు నియోజకవర్గాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లను మాత్రమే తొలగిస్తారు. ఇదే వైసీపీని భయపెడుతోంది. అలా తొలగిపోయే ఓట్లన్నీ తమవేనని చెప్పుకుంటోంది. అలా చెప్పుకోవడం ద్వారా.. ప్రతి బూత్ కూ తమవి దాదాపు 50 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పకనే చెప్పుకుంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తమ విశ్లేషణకు రుజువుగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో.. వైసీపీ నేతలు ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి బూత్లోనూ భారీగా దొంగ ఓట్లను చేర్పించారన్న బలమైన ఆరోపణలను చూపిస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ, క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ద్వారా ఆ దొంగ ఓట్లు తొలగిపోతుండటంతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందంటున్నారు.
YSRCP Allegations on ECI, Voter Verification Process AP, Special Intensive Revision
విజయసాయి నోట వీజీటీఎమ్.. విసారెడ్డి అసలు వ్యూహం ఇదేనా?
.