
సాయి అభ్యంకర్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సంగీత దర్శకుడు. ‘కచ్చి సెరా’ ఇండిపెండెంట్ వీడియోతో మోస్ట్ పాపులర్‌గా మారిన సాయి అభ్యంకర్ కీ బోర్డ్ ప్లేమర్గా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా మంచి పేరు...
సాయి అభ్యంకర్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సంగీత దర్శకుడు. ‘కచ్చి సెరా’ ఇండిపెండెంట్ వీడియోతో మోస్ట్ పాపులర్‌గా మారిన సాయి అభ్యంకర్ కీ బోర్డ్ ప్లేమర్గా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
సాయి అభ్యంకర్ (Sai Abhyankkar) ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సంగీత దర్శకుడు. ‘కచ్చి సెరా’ ఇండిపెండెంట్ వీడియోతో మోస్ట్ పాపులర్‌గా మారిన సాయి అభ్యంకర్ కీ బోర్డ్ ప్లేమర్గా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం జెన్‌జీ బ్యాచ్ సాయి అభ్యంకర్ సంగీతం అంటే పడి చచ్చిపోతున్నారు.
డ్యూడ్, కరుప్పు వంటి చిత్రాలతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు సాయి అభ్యంకర్. కెరీర్ మొదలుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ సినిమాకు పని చేసే అవకాశం అందుకున్నారు. అట్లీ కాంబినేషన్లో అల్లు అర్జున్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రాకా’కు సాయి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు వస్తున్న క్రేజ్‌కు జెన్ జీ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ కూడా ఓ కారణం. ఎందుకంటే యూత్‌లో ఆయనకున్న ఫాలోయింగ్ అలాంటిది. ఈ మధ్యనే ఆయన ‘రాకా’ చిత్రం టైటిల్ రివీల్ థీమ్ ట్రాక్ విడుదల చేయగా అది పెద్ద హిట్ అయ్యింది. ఈ విషయంలో అల్లు అర్జున్‌పై ఈ యువ సంగీత దర్శకుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
‘నేను అల్లు అర్జున్‌ని కలవడానికి వెళ్లినప్పుడు చాలా కంగారు పడ్డాను. ఆయనకు నా వర్క్ నచ్చుతుందో లేదో అని భయం. ఎందుకంటే బన్నీకి మ్యూజిక్‌పై మంచి టేస్ట్ ఉంది. ఏది బాగుంటుంది.. ఏది బాగోదు అనేది బాగా తెలుసు. ఇప్పుడు జెన్-జెడ్‌కి ఏమి ఇష్టమో కూడా చర్చించి ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం’ అని అన్నారు. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
2024లో ‘కచ్చి సెరా’ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోలో సంచలనం సృష్టించిన సాయి అభ్యంకర్ సంగీత నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చినవారే. ఆయన తండ్రి ప్రముఖ సింగర్ టిప్పు. తల్లి గాయని హరిణి. వీరిద్దరూ దక్షిణాదిలో వందల పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. వారి మార్గంలోనే సాయి కూడా ప్రయాణిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందించిన డ్యూడ్ సినిమాలో తన తండ్రి టిప్పుతో ఓ పాట పాడించారు. ఏడాది కాలంలోనే ఆయన ఫుల్ బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘రాకా’తోపాటు మరో అరడజను చిత్రాలున్నాయి.
సత్యదేవ్.. ‘రావు బహదూర్’ మొదటి రోజు కలెక్షన్లు ఎంతంటే..
భార్యకు రూ. 400 కోట్లు భరణం ఇచ్చిన స్టార్ హీరో..