
ఈవీవీ సినిమా(Evv Cinema)ప్రతిష్ఠాత్మకంగా, వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ.వీ.వీ.సత్యనారాయణ స్థాపించిన ఈ బ్యానర్‌పై గతంలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి.
ఈవీవీ సినిమా(Evv Cinema)ప్రతిష్ఠాత్మకంగా, వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ.వీ.వీ.సత్యనారాయణ స్థాపించిన ఈ బ్యానర్‌పై గతంలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు ఈ బ్యానర్‌పై ఈవీవీ తనయుడు ఆర్యన్ రాజేష్(Aryan Rajesh), మరో నిర్మాత ఎన్.వి.కృష్ణారెడ్డితో కలిసి ఓ సినిమా నిర్మంచబోతున్నారు. నిజ జీవిత కథ ఆధారంగా ఓ ఇంటెన్స్ లవ్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది.
హర్ష్ రోషన్ (Harsh Roshan) హీరోగా, ప్రియాంక ఆచర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అరుణ్ బాలాజీ, శ్రీ రంజని సంయుక్తంగా దర్శకత్వం వహిస్తారు. నిజ జీవిత భావోద్వేగాలు, సంబంధాల నేపథ్యంలో ఈ ప్రేమ కథను రూపొందించనున్నారు. శనివారం ఈ సినిమా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి ఆర్యన్ రాజేష్ క్లాప్ ఇచ్చారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు.
సత్యదేవ్.. ‘రావు బహదూర్’ మొదటి రోజు కలెక్షన్లు ఎంతంటే..
భార్యకు రూ. 400 కోట్లు భరణం ఇచ్చిన స్టార్ హీరో..