
పోల్కీ నగలలో సహజమైన అన్‌కట్ డైమండ్స్‌ను ఉపయోగిస్తారు. దీనివల్ల వాటి మెరుపు సాఫ్ట్‌గా, క్లాసీగా, రాయల్‌గా కనిపిస్తుంది. చేతితో తయారు చేసే పోల్కీ రింగ్స్‌లో కుందన్ వర్క్ ఎక్కువగా ఉంటుంది.
రౌండ్ షేప్‌లో ఉండి, చుట్టూ పచ్చ పూసలతో అందమైన డిటైలింగ్ ఉన్న ఈ పోల్కీ రింగ్ మీకు రాయల్ లుక్ ఇస్తుంది.
పెద్దగా, స్టేట్మెంట్గా కనిపించే ఉంగరాలు ఇష్టమైతే, సాలిటైర్ పోల్కీ రింగ్ తీసుకోవచ్చు. ఇందులో ఓవల్, డ్రాప్ లేదా రౌండ్ షేప్‌లో పెద్ద పోల్కీ రాయి ఉంటుంది.
మల్టీకలర్ పోల్కీ రింగ్స్ ఏ రంగు దుస్తులకైనా ఈజీగా మ్యాచ్ అవుతాయి. ఈ రింగు మధ్యలో కెంపులు, పచ్చలు ఉంటాయి. చుట్టూ రకరకాల రంగుల పోల్కీ రాళ్లతో డిటైలింగ్ చేస్తారు.
సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపించాలనుకునే వారికి బ్యాండ్ స్టైల్ పోల్కీ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. ఇందులో వెడల్పాటి బ్యాండ్‌పై అందమైన పోల్కీ రాళ్లను అమర్చుతారు.
కాస్త భిన్నంగా ప్రయత్నించాలనుకుంటే, స్క్వేర్ ఫ్లోరల్ పోల్కీ రింగ్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో పెద్ద పోల్కీ రాయి, దాని చుట్టూ చిన్న చిన్న పోల్కీ రాళ్లతో ఫ్లోరల్ డిటైలింగ్ ఉంటుంది.
Gold Necklace: తులం బంగారంలో హారంలా కనిపించే నక్లెస్ డిజైన్లు,చూసేయండి
Makhana Benefits: మఖానా ఇలా తినకపోతే ఉపయోగమే ఉండదు..రోజుకు ఎంత తినాలి?
Net Blouse: చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే నెట్ బ్లౌజు డిజైన్లు.. చూసేయండి
Aloe Vera: మొటిమలు, నల్లమచ్చలు పోవాలంటే.. కలబందను ఇలా వాడి చూడండి