
తమిళ సినిమా పరిశ్రమలో వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్న నటుడు శ్రీమాన్. ఇప్పుడు తన మాతృభాష అయిన తెలుగులో ఆయన నేరుగా సినిమా చేస్తున్నారు.
విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న కామెడీ చిత్రంలో ఒక వారం షూటింగ్ పూర్తి చేశారు.ఈ సందర్భంగా శ్రీమాన్ తన ఎక్స్ ఖాతాలో భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. “భగవంతుడికి ధన్యవాదాలు. అనిల్ గారికి థ్యాంక్స్. ఒక వారం షూటింగ్ పూర్తయింది. నా మాతృభాషలో నటిస్తున్నాననే విషయం నమ్మలేకపోతున్నా. సెట్ మీద పాజిటివ్ ఎనర్జీ, కామెడీ రోలర్ కోస్టర్.. అద్భుతమైన టీమ్‌తో పని చేయడం ఆశీర్వాదం” అని రాశారు.తాను తూర్పు గోదావరి జిల్లా గొల్లల మామిడాడకు చెందిన తెలుగు అబ్బాయినని... కానీ, తెలుగు సినిమాల్లో తన పేరు సరిగ్గా గుర్తింపుకు రాలేదని శ్రీమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. “ఎయిర్‌పోర్టులో, రైల్వే స్టేషన్లలో తెలుగు ప్రేక్షకులు నన్ను గుర్తుపడతారు, పొగిడేస్తారు. కానీ చివరికి ‘మీ పేరేమిటి సార్?’ అని అడుగుతారు. ఇన్ని సినిమాలు చేసినా నా పేరు ఇక్కడ రిజిస్టర్ కాలేదు” అని భావోద్వేగం వ్యక్తం చేశారు.అనిల్ రావిపూడి సినిమాలంటే తనకు ఎప్పటినుంచో ఇష్టమని, ఈ అవకాశం కోసం కొన్ని తమిళ సినిమాలను కూడా పక్కన పెట్టి వచ్చానని శ్రీమాన్ తెలిపారు. వెంకటేశ్, కల్యాణ్ రామ్, కీర్తి సురేశ్‌లతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు 'శ్రీమాన్ ఒక తెలుగు వ్యక్తి' అని పూర్తిగా తెలిసిపోతుందని