
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Venus-Ketu Samasaptaka Yoga 2026 Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారాలకు, వాటి కలయికలు మానవ జీవితాలపై, ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇదిలా ఉంటే జూలై 4వ తేదీన శుక్రుడు, కేతువుల కలయిక కారణంగా అత్యంత అరుదైన, శక్తివంతమైన సమసప్తక యోగం ఏర్పడబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రుడిని రాక్షస గురువు అని పిలుస్తారు.. అలాగే రాహు, కేతువులను కూడా కీడు గ్రహాలుగా పరిగణిస్తారు. అందుకే ఈ అద్భుతమైన యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం వరించడమే కాకుండా.. విపరీతమైన ధనలాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా 5 రాశుల వారు ఈ కాలంలో సువర్ణ కాలం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఆయా రాశులవారికి ఈ సమయంలో అద్బుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు: మేష రాశి (Aries) మేష రాశి వారికి శుక్ర, కేతువుల కలయిక ఐదవ స్థానంలో జరగడం కారణంగా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. దీని శుభ ప్రభావంతో వీరు తప్పకుండా ఉన్నత విద్యను అభ్యసించి.. విద్యార్థులు పోటీ పరీక్షలలో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం కలగడం కారణంగా కుటుంబంలో ఆనందం విపరీతంగా పెరుగుతుంది. తల్లిదండ్రులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి మానసిక బలం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. ఉద్యోగ రంగంలో మీ సృజనాత్మకతకు పైఅధికారుల నుంచి ప్రత్యేక ప్రశంసలు, పదోన్నతులు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
వృషభ రాశి (Taurus) వృషభ రాశి వారికి ఈ సమసప్తక యోగం నాల్గవ స్థానంలో ఏర్పడింది.. దీని వల్ల వీరి జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ లేదా భూములపై పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలంగా మారుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. చాలా కాలంగా నిలిచిపోయిన కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే కల నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శుక్రుడి అనుగ్రహంతో మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా.. తల్లితో ఉన్న బంధం మరింత మెరుగుపడుతుంది.
సింహ రాశి (Leo) సింహ రాశిలోనే ఈ ప్రత్యేక యోగం ఏర్పడుతుంది.. దీనివల్ల వీరికి సమాజంలో మరింత గుర్తింపు లభిస్తుంది.. వీరికి ఈ సమయంలో తప్పకుండా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు గణనీయంగా పెరుగుతాయి. తెలివితేటలు, నైపుణ్యంతో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీపై మీరు శ్రద్ధ వహించడానికి, కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడానికి ఇది అనుకూలమైన సమయంగా భావించవచ్చు.
తులా రాశి (Libra) తులా రాశి వారికి ఈ యోగం పదకొండవ స్థానంగా భావించే.. లాభ స్థానంలో ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో ఊహించని మార్గాల ద్వారా మీకు భారీగా ఆదాయం లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త భాగస్వాములు కూడా లభిస్తారు. అన్నదమ్ములు లేదా అక్కాచెల్లెళ్ల నుంచి ఆశించిన సపోర్ట్ కూడా లభిస్తుంది.. మీ మనస్సులో చాలా కాలంగా నెరవేరని కోరికలు ఈ సమయంలో పూర్తివుతాయి.
కుంభ రాశి (Aquarius) కుంభ రాశి వారికి ఏడవ స్థానంలో ఈ యోగం ఏర్పడుతుంది.. దీనివల్ల అవివాహితులకు అనుకూలమైన వివాహ సంబంధాలు కుదురుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వివాహితుల జీవితంలో ప్రేమ, పరస్పర అవగాహన, ఆనందం కూడా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు (Partnership Business) చేసే వారికి భారీ లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంతో లేదా ప్రియమైన వారితో కలిసి ఆహ్లాదకరమైన ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.