
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
2 Litre Whisky Bottle Price In Goa Telugu: భారత్‌లోని అత్యంత అద్భుతమైన పర్యాటక ప్రదేశం, సుందర తీరప్రాంతాల నిలయమైన గోవా అంటే కేవలం బీచ్‌లు, ప్రకృతి అందాలు మాత్రమే కాదు.. మద్యం ప్రియులకు ఇది ఒక స్వర్గం. సాధారణంగా దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. గోవాలో మద్యం ధరలు చాలా తక్కువగా ఉంటాయి. చాలా మంది మద్యం ప్రియులు సంవత్సరంలో ఒక్కసారైనా గోవాకు వెళ్లాలనుకుంటూ ఉంటారు. అయితే, ప్రస్తుతం అక్కడ లభిస్తున్న 2 లీటర్ల విస్కీ బాటిళ్ల ధరలు మద్యం ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అందరూ ఎంతగానో ఇష్టపడే బ్రాండ్ల 2 లీటర్ల బాటిళ్లు ఊహించని రీతిలో అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. దీంతో పర్యాటకులు ఎగబడి మరి కొనుగోలు చేస్తున్నారు.
ఏ బ్రాండ్ ఎంత? గోవా లిక్కర్ మార్కెట్లో లభిస్తున్న కొన్ని ప్రముఖ బ్రాండ్ల 2 లీటర్ల బాటిళ్ల తాజా ధరల వివరాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. బడ్జెట్ బ్రాండ్ల నుంచి ప్రీమియం స్కాచ్ విస్కీల వరకు భారీ ఎక్కువ మోతాదులో లభించే ఈ బాటిళ్ల ధరల వివరాల్లోకి వెళితే.. మెక్‌డొవెల్స్ (McDowell's 2L) ఇక్కడ కేవలం రూ. 880లోపే అందుబాటులో ఉంది. అంతేకాకుండా గోవా స్పెషల్ ఫెని (Goa Special Feni 2L) రూ. 1,000 ధరలో మాత్రమే లభించడం విశేషం. ఇక సిగ్నేచర్ (Signature 2L) రూ. 1,850కే లభిస్తోంది. దీంతో పాటు బ్లెండర్స్ ప్రైడ్ (Blenders Pride 2L) రూ. 1,850 ధరలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక బ్లెండర్స్ రిజర్వ్ (Blenders Reserve 2L) రూ. 2,100 ధరతో లభిస్తోంది. బ్లాక్ డాగ్ గోల్డ్ స్కాచ్ విస్కీ (Black Dog Gold 2L) రూ.4,900 ధరలో మాత్రమే లభించడం విశేషం..
అరుదైన కలెక్షన్లు.. సాధారణ మార్కెట్లో చాలా అరుదుగా లభించే బ్లెండర్స్ రిజర్వ్ (Blenders Reserve) వంటి ప్రీమియం వేరియంట్ 2 లీటర్ల బాటిల్ కూడా గోవాలో కేవలం రూ.2,100లకే అందుబాటులో ఉండడం విశేషం.. అంతేకాకుండా రాయల్ లుక్‌తో పాటు అద్భుతమైన రుచి కలిగిన స్కాచ్ విస్కీ బ్లాక్ డాగ్ గోల్డ్ (Black Dog Gold) 2 లీటర్ల ప్రీమియం గ్లాస్ బాటిల్ కేవలం రూ. 4,900 లకే లభిస్తోంది. ఈ భారీ గ్లాస్ బాటిల్స్ కేవలం తాగడానికే కాకుండా.. కలెక్షన్లుగా దాచుకోవడానికి కూడా చాలా మంది ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు గోవా సాంప్రదాయ డ్రింక్‌గా భావించే.. స్పెషల్ ఫెని 2 లీటర్ల బాటిల్ వెయ్యి రూపాయలకే లభించడం విశేషం..
ఈ 2 లీటర్ల బాటిళ్ల ధరలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా గోవా వెళ్లాలనుకుంటున్న మందుబాబులు ఈ ధరలను చూసి పండగ చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. దాదాపు సగానికి పైగా ధరలు తక్కువగా ఉండడంతో పాటు మంది ఉద్యోగాలు చేసేవారు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి గోవా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.