
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
VFX Supervisor Ramji Dott: తెలుగు సినిమా సాంకేతిక విభాగం రోజురోజుకూ కొత్త ప్రమాణాలను నెలకొల్పతుంది. ఆ మార్పులో వీఎఫ్ఎక్స్తో తనదైన ముద్ర వేస్తుంది. దీని వెనక ఎంతో కృషి ఉంది. వారందరి కృషి ప్రతిభావంతంగా తెరపై ఆవిష్కరించే గ్రాఫిక్స్ సూపర్ వైజర్స్లలో రాంజీ డాట్ ఒకరు. విజువల్ ఎఫెక్ట్స్‌ను కేవలం సాంకేతికంగా అవసరంగా కాకుండా.. కథను మరింత ప్రభావవంతంగా చెప్పే సాధనంగా మలుస్తున్నారు ఇలాంటి గ్రాఫిక్స్ సూపర్ వైజర్స్. రీసెంట్గా తన చిత్రాలతో గ్రాఫిక్స్ సూపర్ వైజర్‌గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ దూసుకుపోతున్న రాంజీ డాట్.
అత్యాధునిక టెక్నాలజీపై అవగాహన, సృజనాత్మక ఆలోచన, కథపై పట్టు.. ఈ మూడు అంశాల సమన్వయమే రాంజీ డాట్ పనితీరుకు ప్రధాన బలంగా నిలుస్తుంది. అందుకే ఆయన రూపొందించే ప్రతి విజువల్ ఆడియన్స్‌ను కథలో మరింతగా లీనమయ్యేలా చేయడంతో పాటు సినిమా సక్సెస్‌లో కీ రోల్ పోషిస్తుంది.
రాంజీ డాట్ ఇప్పటివరకు మహానటి, 118, మసూద, మిరాయ్ వంటి చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించారు. ఒక్కో సినిమా ఒక్కో ప్రపంచాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చింది.
మహానటి సినిమాలో అప్పటి సహజ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈయన చూపించిన విజువల్ ఎఫెక్ట్స్‌కు అందరు ఫిదా అయ్యారు. ముఖ్యంగా అప్పటి సినిమా వాతావరణాన్ని సహజంగా పునఃసృష్టించడం,118లో థ్రిల్లర్‌కు అవసరమైన విజువల్ టోన్ నిర్మించడంలో ఈయన కృషి ఎనలేనది. ముఖ్యంగా దర్శకుడి విజన్‌ను తెరపై ఆవిష్కరించడం వెనక ఇలాంటి గ్రాఫిక్స్ సూపర్ వైజర్ల పాత్ర కాదనలేనిది. అందులో రామ్‌జీ ముందు వరుసలో ఉంటారు.
మసూదలో భయానక అనుభూతిని మరింత బలంగా తెరపై చూపించడం. మిరాయ్ లో ఫాంటసీ ప్రపంచాన్ని కళ్ల ముందు ఆవిష్కరించారు. ప్రతి ప్రాజెక్టులో కథకు తగ్గట్టుగా తన శైలిని మార్చుకుంటూ పనిచేయడం రాంజీ ప్రత్యేకత.ఆయా సినిమాల సక్సెస్‌లో ఈయన పాత్ర కాదనలేనిది.
రాంజీ డాట్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిన ప్రాజెక్ట్ ‘రావు బహదూర్’. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన ఈ సినిమా నిన్న విడుదలై మంచి సైకాలాజికల్ థ్రిల్లర్‌గా పేరు తెచ్చుకుంది. నిన్న విడుదలైన ఈ సినిమాలో దాదాపు రెండు గంటల నిడివి గల ఈ చిత్రంలో సుమారు అరగంటపాటు పూర్తిగా క్రియేటివ్ 3D VFX సీన్స్ ఉన్నాయి. ఇవి మాములు VFX షాట్లు కావు. కాన్సెప్ట్ రూపకల్పన నుంచి ఫలితం వచ్చే వరకు పూర్తిగా సృజనాత్మక దృష్టితో రూపొందించిన విజువల్ సీక్వెన్స్‌లు.
సినిమా ప్రపంచాన్ని విస్తరించేలా, ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగించేలా రూపొందిన ఈ విజువల్స్, తెలుగు సినిమాలో క్రియేటివ్ VFXకు కొత్త ప్రమాణంగా నిలిచే అవకాశాలున్నాయి.
సాంకేతికంగా ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషించడం రాంజీ డాట్ ప్రత్యేకత. హైబ్రిడ్ లైవ్ యాక్షన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ‘మహావీర్ కర్ణ’ టీజర్ ఇందుకు మంచి ఉదాహరణ. రియల్ పెర్ఫార్మెన్స్ క్యాప్చర్, CGI, డిజిటల్ ఎన్విరాన్‌మెంట్స్‌ను సమర్థవంతంగా మిక్స్ చేస్తూ ఆయన రూపొందించిన విజువల్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పెద్ద బడ్జెట్ లేకుండానే ప్రపంచ స్థాయి విజువల్ క్వాలిటీని సాధించవచ్చని ఈ ప్రాజెక్ట్ నిరూపించింది.
VFX సూపర్వైజర్ మాత్రమే కాదు... విజువల్ స్టోరీ టెల్లర్
రాంజీ డాట్ పనిలో ప్రత్యేకంగా కనిపించే అంశం ఆయన ఆలోచనా విధానం.ఒక షాట్‌ను కేవలం టెక్నికల్‌గా ఎలా రూపొందించాలి అనే దానికంటే, అది కథలో ఎలాంటి భావోద్వేగాన్ని కలిగించాలే ఉండాలనే కోణంలో ఆయన ఆలోచిస్తారనడానికి ఈ సినిమాలే ఉదాహరణ. అందుకే ఆయన రూపొందించే ప్రతి విజువల్ కథలో సహజంగా కలిసిపోతుంది.
ప్యాన్ ఇండియా సినిమాల రూపకల్పనలో ప్రత్యేక పాత్ర..
పాన్-ఇండియా స్థాయిలో తెలుగు సినిమా తన పరిధిని విస్తరిస్తున్న ఈ సమయంలో, ప్రపంచ స్థాయి విజువల్ నాణ్యతను అందించగల ప్రతిభావంతుల అవసరం తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో అవసరం ఉంది. అలాంటి టెక్నీషియన్లలో రాంజీ డాట్ పేరు ముందువరుసలో నిలుస్తారు. సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మక దృష్టి, కథపై అవగాహనతో ఈ మూడు లక్షణాల కలయికతో ఆయన రూపొందించే ప్రతి ప్రాజెక్ట్ మరింత ఉన్నత స్థాయిని అందుకుంటోందనడంలో ఎలాంటి సందేహం లేదు.