
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘మాతృభూమి’. ప్రకటించిన నాటి నుంచే వార్తల్లో నిలిచిన ఈ సినిమా మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఆగస్టులో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావించగా.. ఇప్పుడు కొత్త సమస్య ఎదురైంది. ఈ చిత్రానికి (Maatrubhumi) సెన్సార్ బోర్డ్ (CBFC) క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టినట్లు సమాచారం.
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘మాతృభూమి’ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా సెన్సార్ బోర్డు నుంచి ఎదురైన ఈ అడ్డంకితో సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇందులో ‘చైనా’ అనే పదాన్ని ఉపయోగించవద్దని గతంలో బోర్డు సూచించడంతో కొన్ని సీన్లను రీషూట్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. రీషూట్ తర్వాత కూడా సర్టిఫికెట్‌ను హోల్డ్‌లో పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటి వరకూ చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలోనే మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారత్-చైనా మధ్య 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తొలుత దీనికి ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అని టైటిల్ ఖరారు చేశారు. ఆ తర్వాత దాన్ని ‘మాతృభూమి’గా మారుస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు, భారత రక్షణ మంత్రిత్వశాఖ సూచనల మేరకు దర్శకుడు అపూర్వ లఖియా ఈ ప్రాజెక్టులో భారీస్థాయిలో మార్పులు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే దాదాపు 40శాతం సినిమాను రీషూట్ చేశారు. సినిమా కథలో కొన్ని కల్పిత అంశాలను, రొమాంటిక్ సీన్లను, బ్యాగ్రౌండ్ స్టోరీని అదనంగా జోడించి కొత్త వెర్షన్‌ను సిద్ధం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.