
విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన.. ఇప్పుడు సహయ నటుడిగా రాణిస్తున్నారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలను చూశారు.
అయితే, ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక తీరని విషాదం సందర్భంగా తెలుగు సినిమా పరిశ్రమ ఆయనకు చూపిన అపూర్వ ప్రేమ, మద్దతు గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన కుమార్తె మరణం తర్వాత సినీ రంగం మొత్తం తన పట్ల చూపిన అభిమానం తనకెప్పటికీ గుర్తుండిపోతుందని రాజేంద్ర ప్రసాద్ భావోద్వేగంగా పంచుకున్నారు. తన కుమార్తె మరణించినప్పుడు ప్రభాస్ లాంటి స్టార్ హీరో స్వయంగా తన ఇంటికి వచ్చి ఓదార్చడం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని అన్నారు. సాధారణంగా ప్రభాస్ బహిరంగ కార్యక్రమాలకు, ఇండస్ట్రీలో చాలా తక్కువగా బయటికి వస్తారని, అలాంటిది తన ఇంటికి వచ్చి పర్సనల్‌గా కలవడం ఆయన గొప్పదనానికి నిదర్శనం అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రభాస్ కేవలం పరామర్శించడమే కాదు, రాజేంద్ర ప్రసాద్‌కి ధైర్యాన్నిస్తూ “మీరు మాకు కావాలి. మీరు మాత్రం తగ్గద్దు, డల్ అవ్వద్దు. మీతో మాకు చాలా పని ఉంది. మీరు హుషారుగా ఉండండి ప్లీజ్” అని అన్నారని, ఆ మాటలు తనకెంతో ఆసరాగా నిలిచాయని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మాటలను తానెప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..
ప్రభాస్ ఒక్కరే కాదు, తెలుగు సినిమా పరిశ్రమలోని పలువురు అగ్ర తారలు రాజేంద్ర ప్రసాద్‌కు అండగా నిలిచారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబంతో సహా వచ్చి పరామర్శించారు. యువ సామ్రాట్ నాగార్జున కూడా వచ్చి రాజేంద్ర ప్రసాద్‌ను ఓదార్చారు. మెగాస్టార్ చిరంజీవి తన భార్య సుస్మితతో కలిసి వచ్చి దాదాపు గంట పాటు అక్కడే ఉండి ధైర్యం చెప్పారని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. అల్లు అర్జున్, వెంకటేష్ వంటి ప్రముఖ నటులు కూడా ఆయనకు మద్దతుగా నిలిచారని తెలిపారు. ఇండస్ట్రీలో చాలా మంది తారలు వచ్చారని, తన పట్ల చూపిన ప్రేమను చూసి తాను ఆశ్చర్యపోయానని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..
ముఖ్యంగా ప్రభాస్‌తో తాను పెద్ద సినిమాలు ఏవీ చేయకపోయినా, ఆయన చూపిన అభిమానం తనను కదిలించిందని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇటీవల కల్కి సినిమాలో కలిసి నటించినా, వారిద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ లేవన్నారు. అయినప్పటికీ, ప్రభాస్ ఒక అద్భుతమైన వ్యక్తి అని, అందమైన మనసున్న వ్యక్తి అని అన్నారు. తన కుమార్తె మరణించినప్పుడు, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక కుటుంబంలా తన పక్కన నిలబడటం చూసి, తనపై ఉన్న నిజమైన ప్రేమను తాను అప్పుడు అర్థం చేసుకున్నానని రాజేంద్ర ప్రసాద్ భావోద్వేగంగా వివరించారు. ఈ సంఘటన తెలుగు సినిమా పరిశ్రమలో తారల మధ్య ఉన్న బలమైన అనుబంధాలను, ఒకరి పట్ల ఒకరికి ఉన్న గౌరవాన్ని, కష్ట సమయంలో అండగా నిలిచే గొప్ప సంస్కృతిని మరోసారి తెలియజేస్తుందని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..