
స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నక్కపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద అల్లూరి విగ్రహానికి హోం మంత్రి అనిత పూలమాల వేసి నివాళులర్పించారు.
అనకాపల్లి జిల్లా, జులై 4: స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నక్కపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద అల్లూరి విగ్రహానికి హోంమంత్రి అనిత పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి అని అన్నారు.
అల్లూరి దేశభక్తి, ధైర్యం యువతరానికి ఆదర్శమని హోం మంత్రి అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అల్లూరి జయంతి వేడుకలను రాష్ట్ర పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు. తెలుగు జాతి ఉన్నంతవరకూ అల్లూరి త్యాగం ప్రజలు గుండెల్లో ఉంటుందన్నారు. అల్లూరి సీతారామరాజు ధైర్యానికి, సాహసానికి ప్రతీక అని హోం మంత్రి అనిత కొనియాడారు.
యూట్యూబర్ జోసెఫ్ రావణ్ మరోసారి అరెస్టు.. పాయకరావుపేటకు తరలింపు..