
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Hyderabad IMD Alert: తెలంగాణ సహా రాజధాని హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. అటు కూకట్పల్లి, శేరి లింగం పల్లి, ఖైరతాబాద్, నాంపల్లి, ఎల్బీ నగర్, ఉప్పల్, చార్మినార్, రాజేంద్ర నగర్, చాంద్రాయణ గుట్ట, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్‌లో ముసురు.. చాలా ప్రాంతాల్లో కురిసి వర్షం ఈ రోజు ఉదయం పడుతూనే ఉంది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కురుస్తోన్న వర్షాలకు ప్రభుత్వం ఆయా శాఖలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా డ్రైనేజీ నాలాలు పొంగిపొర్లే ప్రాంతాల్లో ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన పూడిక తీయడం వంటి పనులు పూర్తి చేస్తున్నారు. పలు చోట్ల పూడిక తీసినా.. అక్కడే వదిలేసి వెళుతున్నారు. దీంతో వర్షం పడటంతో ఏ పూడికను తీసారే మళ్లీ డ్రైనేజీలో కలుస్తుంది. అధికారులు పూడికను కూడా అక్కడ వదిలి వెళ్లకుండా అప్పటికప్పుడు తరలించే ప్రయత్నం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మరోవైపు ఈ రోజు ఉదయం నుంచి ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి.రాబోయే మూడు రోజుల పాటు ఇదే రకమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు జరిగింది. నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం 7 గంటల వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో ఖైరతాబాద్ సర్కిల్ రహమత్ నగర్లో 4 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు అయినట్టు ఐఎండీ తెలిపింది. గండిమైసమ్మ, అల్వాల్, షేక్ ప్రాంతాల్లో 5 మిల్లీ మీటర్ల నుంచి 6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం నుంచి ముసురు కొడుతూనే ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌లో 6 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయింది. అటు ములుగు జల్లా మల్లంపల్లిలో 5.6 సెం.మీ, సిద్దిపేటలోని చీర్యాల, దువ్బాక ప్రాంతాల్లో 5 సెం.మీ నుంచి 5.4 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. కామారెడ్డి ముఖ్యపట్టణంతో పాటు తోగుట, హన్మకొండ, పెద్దపల్లి ఓదెల, మానకొండూరు తదితర ప్రాంతాల్లో 4 సెం.మీ వర్షం పాతం నుంచి 4.7 సెం.మీ వర్షపాతం నమోదు అయినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.