
ఇండిపెండెంట్ జడ్పీటీసీ To సీఎం.. ఇదీ రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కెరీర్ గ్రాఫ్. మంత్రిగా పనిచేయకుండానే ముఖ్యమంత్రి కావడం ఓ ప్రత్యేకత.
విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఏబీవీపీ కార్యకర్తగా చురుకుగా పనిచేశారు. 2006లో తొలిసారి మిడ్జిల్ జడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి తొలిసారి ప్రజాప్రతినిధిగా విజయం సాధించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, కొడంగల్ ఎమ్మెల్యేగా, మల్కాజిగిరి ఎంపీగా, ముఖ్యమంత్రిగా అంచెలంచెలుగా ఎదిగారు. రేవంత్‌రెడ్డి తొలిసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికై ఇవాళ్టికి 20 ఏళ్లు. ఈ సందర్భంగా ఆయన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో టాప్ 10 మూమెంట్స్ ఈ వీడియోలో చూసేయండి. ఈ వార్త చదివారా: నేడు మిడ్జిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి