
సత్యదేవ్ (Satya Dev) కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రావు బహదూర్’ (Rao Bahadur) వెంకటేశ్ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
సత్యదేవ్ (Satya Dev) కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రావు బహదూర్’ (Rao Bahadur) వెంకటేశ్ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూపర్‌స్టార్ మహేష్ బాబు సమర్పణలో చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. సత్యదేవ్ సరసన దీపాథామస్ నటించారు. వికాస్ ముప్పాల, ఆనంద్ భారతి, బాల పరాశర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. విడుదల రోజు సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కలెక్షన్ల పరంగా మేకర్స్ సంతృప్తికరంగా ఉన్నారని తెలుస్తోంది. ఫస్ట్ డే మంచి కలెక్షన్లు రాబట్టిందని మేకర్స్ చెబుతున్నారు. (Rao Bahadur Worldwide Collections)
ఇండియాతో పోలిస్తే ఓవర్సీస్లో మంచి కలెక్షన్లు రాబట్టింది. తొలి రోజు ఇండియాలో రూ. 1.40 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. కర్ణాటకలో 13 లక్షలు, తమిళనాడులో రెండు లక్షలు, దేశంలోని మిగతా ప్రాంతాల్లో మరో లక్ష రావడంతో గ్రాస్ వసూళ్లు రూ. 1.61 కోట్లకు చేరింది. ఓవర్సీస్ మార్కెట్ మొదటి రోజు రూ. 1.50 కోట్ల గ్రాస్ రాబట్టగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా టోటల్ గ్రాస్ రూ. 3.11 కోట్లు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన రూ. 1.40 నెట్ కలెక్షన్లలో సగం హైదరాబాద్ సిటీ నుంచే వచ్చాయి. భాగ్యనగరంలో ‘రావు బహదూర్’కు 70.82 లక్షల గ్రాస్ వచ్చింది. ఏవరేజ్ ఆక్యుపెన్సీ చూేస్త... 27.కాగా నైట్ షోలకు 38.08 శాతానికి ఆక్యుపెన్సీ పెరిగింది.