
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌లో (FIFA World Cup 2026) అర్జెంటీనా రౌండ్ 16కి చేరుకుంది. ఆ జట్టుతోపాటు ఈజిప్ట్, కొలంబియా కూడా ప్రిక్వార్టర్స్‌లో అడుగు పెట్టాయి.
దీంతో 16 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమయ్యాయి. ఇవాళ్టి నుంచే రౌండ్-16 మ్యాచులు జరుగుతాయి.
ప్రపంచ కప్‌లో సంచలన ఆటతీరుతో ఆకట్టుకున్న జట్టు కాబో వెర్డ్ రౌండ్-32లోనూ గట్టిగానే పోరాడింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా(Argentina)కు చుక్కలు చూపించింది. అయితే కెప్టెన్ లియోనెల్ మెస్సితో పాటు అనుభవం కలిగిన అర్జెంటీనా చివరకు 3-2 తేడాతో కాబో వెర్డ్‌పై అతికష్టంగా విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. మెస్సి 29వ నిమిషంలో గోల్ చేసి అర్జెంటీనాకు 1-0 లీడ్ ఇచ్చాడు. అయితే, కాబో వెర్డ్ ప్లేయర్ డెరాయ్ డుర్తే 59వ నిమిషంలో గోల్‌తో స్కోరును సమం చేశాడు. లిసాండ్రో మార్టినెజ్ (92వ నిమిషం) గోల్‌తో అర్జెంటీనా 2-1కు వెళ్లింది. అదనపు ఆట సమయంలో సిడ్నీ లోపెస్ కాబ్రల్ 103వ నిమిషంలో గోల్ కొట్టి 2-2తో కాబో వెర్డ్ను కూడా రేసులో నిలిపాడు. అయితే, అర్జెంటీనా ఆటగాడు డినే 111వ నిమిషంలో గోల్ చేసి 3-2తో జట్టును గెలిపించాడు. మ్యాచ్ అనంతరం కాబో వెర్డ్ పోరాటానికి ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
ప్రపంచ కప్ ప్రిక్వార్టర్స్‌లోకి ఈజిప్ట్ అడుగు పెట్టింది. ఆస్ట్రేలియాపై పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించింది. ఆట ఆరంభంలోనే ఇమామ్ ఆషౌర్ (11వ నిమిషం) గోల్ చేసి ఈజిప్ట్‌కు లీడ్ ఇచ్చాడు. అయితే, రెండో అర్ధభాగం తర్వాత ఆస్ట్రేలియా తరఫున మహమ్మద్ హనీ (55వ నిమిషం) గోల్ చేసి స్కోర్లను సమం చేశాడు. అనంతరం నిర్ణీత సమయంలోగా ఇరు జట్లూ గోల్స్‌ను సాధించలేదు. దీంతో 1-1తో సమంగా నిలిచాయి. పెనాల్టీ షూటౌట్లో ఈజిప్ట్ 4-2 తేడాతో ఆసీస్‌ను ఓడించి తదుపరి రౌండ్‌కు చేరుకుంది. అర్జెంటీనాతో జులై 7న ఈజిప్ట్ రౌండ్-16లో తలపడనుంది. 92 ఏళ్ల తర్వాత ఈజిప్ట్ ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టింది.
రౌండ్ 16లో అడుగు పెట్టిన చివరి జట్టు కొలంబియా (Colombia). ఘనాతో జరిగిన పోరులో ఈ జట్టు 1-0 తేడాతో గెలిచింది. 14వ నిమిషంలోనే కొలంబియా ప్లేయర్ జాన్ అరియాస్ గోల్ కొట్టాడు. ఆ తర్వాత ఇరు జట్లూ గోల్ పోస్ట్‌ల వైపు గురిపెట్టినా ఫలితం రాలేదు. దీంతో కొలంబియానే విజయం వరించింది. జులై 8న స్విట్జర్లాండ్‌తో ఈ జట్టు ప్రిక్వార్టర్స్‌లో తలపడనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.