
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Gold Rate Today: దేశంలో బంగారం డిమాండ్ తగ్గడంతో ధరలు కూడా భారీగానే పడిపోయాయి. అయితే గత రెండు రోజులుగా ఒక్కసారి పుంజుకున్నాయి. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. తులం 10 గ్రాముల బంగారం ధర రూ. 2లక్షలకు చేరువవుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 2000 పెరిగి రూ. 1,47,773కి చేరుకుంది. గత రెండు రోజుల్లోనే దాదాపురూ. 7000 పెరిగిందని చెప్పాలి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 40, 000వద్ద ట్రేడ్ అవుతుంటే.. గురువారం, శుక్రవారం ఈ రెండు రోజుల్లోనే 7000 పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఐదు వారాల్లోనే తొలిసారిగా భారీగా పెరిగాయి. బంగారం స్పాట్ ధర ఔన్సుకు 4,184.75డాలర్లుగా ఉంది. ఆగస్టు డెలివరీకి సంబంధించి గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 4,197.20వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రపంచ కమోడిటీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరగడంతో.. బులియన్ మార్కెట్లో వాటి ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. వారం రోజుల్లోనే సుమారు 7వేల మేర పుంజుకోగా.. వెండి ధర రూ. 16000 మేర పెరిగింది.
బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? అమెరికా ఉద్యోగాల గణాంకాలు అంచనాలు కంటే బలహీనంగా ఉండటంతో సమీప భవిష్యత్తులో ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచుతుందన్న ఆందోళనలు తగ్గాయి. ఇది బంగారం ధరలకు బలం ఇచ్చినట్లయ్యింది. జూన్ లో వ్యవసాయేతర రంగంలో 57,000 ఉద్యోగాలు పెరిగాయని.. అమెరికా కార్మిక శాఖకు చెందిన కార్మిక గణాంకాల బ్యూరో వెల్లడించింది.
చైనా ఎందుకు బంగారం కొంటోంది.. డిమాండ్ ఎందుకు పెరిగింది? ఈ వారం చైనాలో బంగారం అంతర్జాతీయ ధరతో సమానంగా ఉంది. కొన్ని సార్లు ఔన్సుకు 2డాలర్ల వరకు తక్కువకు అమ్ముడవుతోంది. గత వారం ఇది ఔన్సుకు 3 నుంచి 7డాలర్ల వరకు తగ్గింది. ఈ తగ్గింపు అనేది కొనుగోలుదారులు మునుపటి కంటే మరింత ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది. ఫలితంగా చైనాలో బంగారానికి డిమాండ్ పెరిగింది.
ఇప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి? మీరు బంగారం,వెండిలో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. వాటి ధర తగ్గినప్పుడు క్రమంగా కొనుగోలు చేయాలని కమోడిటీ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఆకస్మాత్తుగా ధరలు పెరిగినప్పుడు కొనుగోలు చేయకూడదు. దీర్ఘకాలిక ద్రుక్కోణంలో చిన్న పెట్టుబడిదారులకు బంగారం, వెండి ఈటీఎఫ్ లలో సిప్ లు బెస్ట్ ఛాయిస్ అని చెబుతున్నారు.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.