
Ira Aery Australia Team: 17 ఏళ్ల భారత సంతతికి చెందిన ఇరా ఏరీ.. తాజాగా ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో చోటు దక్కించుకుంది.
అసాధారణమైన నైపుణ్యంతో ఆస్ట్రేలియా అండర్-19 జట్టులో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు భారత యువతకు సోషల్ మీడియాలో కొత్త క్రష్‌గా మారింది.
17 ఏళ్ల భారత సంతతికి చెందిన ఆల్‌రౌండర్ ఇరా ఐరీ.. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్లో స్టార్ ప్లేయర్‌గా మారనుంది. ఆమె ఆస్ట్రేలియా అండర్-19 మహిళల జట్టులో రాణిస్తూనే.. తన అద్భుతమైన ఆట, వ్యక్తిత్వంతో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం హైడెల్బర్గ్లో 2009 ఫిబ్రవరి 25న జన్మించిన ఇరా ఐరీ భారత సంతతికి చెందిన కుటుంబానికి చెందినది. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఎంతో ఆసక్తి ఉన్న ఆమె, స్థానిక క్లబ్‌లు, పాఠశాల టోర్నమెంట్లలో చక్కగా రాణించి తన ప్రతిభను నిరూపించుకుంది.
విక్టోరియా వెస్ట్రన్ రీజియన్ జూనియర్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించి.. కఠోర శ్రమ, క్రమశిక్షణతో రాష్ట్ర స్థాయి జట్లకు ఇరా ఐరీ ఎంపికైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా అండర్-19 మహిళల జట్టులో స్థానం సంపాదించడం ద్వారా ఆమె తన కల దిశగా మొదటి పెద్ద అడుగు వేసింది.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంకల మధ్య జరిగిన మహిళల అండర్-19 ట్రై-సిరీస్‌లో ఇరా ఐరీ తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్రశంసలు అందుకుంది. ఈ టోర్నమెంట్లో ఆమె మొత్తం 13 వికెట్లు పడగొట్టి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచింది.
ఆస్ట్రేలియా అండర్-19 జట్టులో నిలకడగా రాణిస్తున్న ఇరా ఐరీపై క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు ప్రత్యేక దృష్టిని సారించాయి. ఇదే ప్రదర్శన కొనసాగితే త్వరలోనే ఆమెను ఆస్ట్రేలియా మహిళల జాతీయ జట్టుకు ఎంపికయ్యే ఛాన్స్ పక్కాగా ఉంది.
అద్భుతమైన క్రికెట్ నైపుణ్యాలతో పాటు తన ఫిట్నెస్, అందంతో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తోంది క్రికెటర్ ఇరా ఐరీ. అందులోనూ ఈమె భారత సంతతికి చెందడం వల్ల భారత్‌లో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది.