టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్లలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయిక ఒకటి.
గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు దిగ్గజాలు సరికొత్త కథతో 'ఆర్సీ17' కోసం చేతులు కలపడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కథానాయికగా బాలీవుడ్ స్టార్ నటి కియారా అద్వానీని ఎంపిక చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది.* 'ఈసారి గ్యాప్ తీసుకుంటే ఫ్యాన్స్ ఇంటికొచ్చి కొట్టాలి'... అఖిల్ అక్కినేని షాకింగ్ కామెంట్స్ మెగా అభిమానుల్లో టెన్షన్ ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్ ప్రదర్శనకే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే ఒక బలమైన పాత్రగా సుకుమార్ డిజైన్ చేశారట. నటనకు ఎంతో స్కోప్ ఉన్న ఈ క్యారెక్టర్‌కు కియారా అయితే పర్ఫెక్ట్ గా న్యాయం చేయగలదని మేకర్స్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్త బయటకు రాగానే మెగా అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. దానికి ప్రధాన కారణం బ్యాడ్ సెంటిమెంట్. గతంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జోడీగా నటించిన ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన రీతిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో ఈ జోడీ మరోసారి రిపీట్ అయితే సెంటిమెంట్ పరంగా సినిమాకు మైనస్ అవుతుందేమోనని కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.* మొగుడు తప్ప జీవితంలో అన్నీ ఉన్నాయి.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే - నందిని రెడ్డి సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎంత బలంగా ఉన్నప్పటికీ, దర్శకుడు సుకుమార్ మాత్రం ఎప్పుడూ భిన్నంగానే ఆలోచిస్తారు. గతంలో ‘రంగస్థలం’ షూటింగ్ సమయంలో కూడా సమంతను పల్లెటూరి పడచు రామలక్ష్మి పాత్రకు ఎంపిక చేసినప్పుడు ఇలాంటి ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ తెరపై సమంత నటన చూసి విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అందువల్ల ఆర్సీ17 విషయంలో కూడా సుకుమార్ పాత సెంటిమెంట్లను పక్కన పెట్టి, కేవలం పాత్రకు సరిపోయే నటి వైపే మొగ్గు చూపుతారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ సినిమాతో థియేటర్లలో బాక్సాఫీస్ ఊచకోత కోసి, ఏకంగా రూ. 400 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త వసూళ్లతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నారు రామ్ చరణ్. ఈ ఫుల్ జోష్‌లో ఉన్న మెగా పవర్ స్టార్‌కు కియారాతో ఉన్న ఆ డిజాస్టర్ ట్రాక్ రికార్డు సెంటిమెంట్‌ను సుకుమార్ తన సరికొత్త కథనంతో బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి. ఏదేమైనా ఈ క్రేజీ ప్రాజెక్టు హీరోయిన్ ఎంపికపై ఫుల్ క్లారిటీ రావాలంటే మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.