
తెలంగాణలో వైద్య ఆరోగ్య రంగంలో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మూడు టిమ్స్ హాస్పిటల్స్తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో క్లినికల్, నాన్క్లినికల్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో వేల సంఖ్యలో...
తెలంగాణలో వైద్య ఆరోగ్య రంగంలో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మూడు టిమ్స్ హాస్పిటల్స్‌తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో క్లినికల్, నాన్‌క్లినికల్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం లభించింది. ఈ నిర్ణయం వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల జాతరకు సంకేతంగా మారింది. లక్షలాది యువతీయువకులు ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన వారికి ముఖ్యమైన శుభవార్తగా మారింది.సుమారు 6278 పోస్టులు వివిధ విభాగాల్లో భర్తీవివరాల్లోకి వెళ్తే... సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌కు 2360 పోస్టులు, అల్వాల్ టిమ్స్‌కు 1565 పోస్టులు, ఎల్‌బీ నగర్ టిమ్స్‌కు 1565 పోస్టులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు 788 పోస్టులు మంజూరు చేశారు. మొత్తం సుమారు 6278 పోస్టులు వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఇందులో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, సపోర్ట్ స్టాఫ్ అన్ని స్థాయిల్లోనూ ఖాళీలు ఉన్నాయి.సూపర్ స్పెషాలిటీ సేవలను బలోపేతం చేసే నిర్ణయం సనత్‌నగర్ టిమ్స్ మరియు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లలో 37 డిపార్ట్‌మెంట్లు చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. అల్వాల్ మరియు ఎల్‌బీ నగర్ టిమ్స్ హాస్పిటల్స్‌లో 35 డిపార్ట్‌మెంట్లు చొప్పున ఏర్పాటవుతాయి. ఈ విస్తృత డిపార్ట్‌మెంట్లు సూపర్ స్పెషాలిటీ సేవలను మరింత బలోపేతం చేస్తాయి. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్ వంటి అన్ని ప్రధాన వైద్య శాఖలు ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించి పని చేయనున్నాయి.స్థానికంగా అత్యాధునిక వైద్య సేవలు ఈ భారీ ఉద్యోగ భర్తీ ప్రక్రియ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం ప్రజలు మెరుగైన, అత్యవసర చికిత్సల కోసం హైదరాబాద్‌పై ఆధారపడుతున్న నేపథ్యంలో, ఈ హాస్పిటల్స్ స్థానిక స్థాయిలోనే అత్యాధునిక వైద్య సేవలు అందించడం ద్వారా ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు, ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లోని యువతకు ఇది బంగారు అవకాశం.పత్తి రైతులకు శుభవార్త.. ఈ జిల్లాలలో ఉచిత పత్తి విత్తనాలు పంపిణీ ఉద్యోగాల భర్తీకి కేబినేట్ గ్రీన్ సిగ్నల్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఇప్పుడు భర్తీ ప్రక్రియ వేగవంతం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగాలను పారదర్శకంగా, భర్తీ చేయాలని ఆశిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే అప్లై చేసుకోండి.. ఈ నిర్ణయం తెలంగాణలో వైద్య రంగాన్ని మరింత బలపరిచి, యువతకు ఉపాధి మార్గాలు కల్పిస్తుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.