
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ (పునరుద్ధరణ) పనులకు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)భూమి పూజ చేశారు.
ఈ పనులకు సంబంధించి శిలాఫలకాన్ని శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు. తొలుత అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాగశాల, ఆలయ ముఖమండపం, గంటా మండపం, వాహనశాలను దేవాదాయశాఖ నిధులు రూ.6.50 కోట్లతో నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఏర్పాటుచేసిన నమూనా చిత్రాలను మంత్రి పరిశీలించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.