
ఇటీవల బంగారం తగ్గింది కదా అని కొనాలని అనుకున్నారా? అయితే ఈరోజు బిగ్ షాక్ తగిలింది. 10 గ్రాముల బంగారంపై రూ. 7వేలు పెరగడంతో కొనుగోలుదారులు, పసిడి ప్రియులు కంగారు పడుతున్నారు.
మోదీ ఏడాది వరకు కొనద్దని సూచించారు. అయినా కూడా కొనుగోళ్లు తగ్గిన దాఖలాలు కనిపించడం లేదు. బంగారం లేనిదే ఏ వేడుక జరగని పరిస్థితి. అలాంటిది బంగారం కొనకుండా ఉండటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
అయితే రెండ్రోజుల క్రితం గోల్డ్, సిల్వర్ భారీగా తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇరాన్ లో మరోసారి యుద్ధ మంటలు రాజుకోవడంతో...బంగారం ధర తగ్గింది. ఇంకా తగ్గుతుందని ఆశించారు. కానీ ఊహించని రీతిలో పెరిగి కొంపముంచింది. వెండి కూడా అదే మాటలో నడుస్తోంది. మొన్నటికి మొన్న దాదాపు రూ.30 వేలు తగ్గినట్లే తగ్గి ఎగబాకింది. కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా పైకి దూసుకెళ్లాయి. కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్న వారికి ఈ పెరుగుదల ఊహించని షాక్‌గా మారింది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు లేదా పెట్టుబడి కోసం బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నవారు ఇప్పుడు తాజా ధరలు తెలుసుకోవాల్సిందే.
హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ.1,47,000గా నమోదైంది. నిన్నటి ధరతో పోలిస్తే ఇది రూ.3,220 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,34,750గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.2,950 అధికమైంది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,10,250గా ఉంది. వెండి ధర కూడా ఈరోజు పెరిగింది. కిలో వెండిపై రూ.10,000 పెరగడంతో ప్రస్తుతం ధర రూ.2,60,000కు చేరుకుంది. సింగపూర్ మార్కెట్లో10 గ్రాముల బంగారం ధర రూ.1,36,466గా ఉంది. దుబాయ్ మార్కెట్లో రూ.1,28,266గా నమోదైంది.
కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొనుగోలుదారులు మళ్లీ ఆలోచనలో పడ్డారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు లేదా పెట్టుబడి కోసం బంగారం కొనాలని భావిస్తున్న వారు ప్రతిరోజూ ధరలను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ముందు రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ ఇండెక్స్, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, పెట్టుబడిదారుల కొనుగోలు ధోరణిని బట్టి బంగారం ధరల్లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.