
ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi Debut) అరంగేట్రంపై క్రికెట్ ప్రపంచం ఇప్పుడు రెండుగా చీలిపోయింది. కొందరేమో అతడిని వెంటనే తుది జట్టులోకి తీసుకోవాలని కోరుతుంటే..
మరికొందరేమో డ్రెస్సింగ్ రూమ్‌ను అలవాటు చేయాలని సూచిస్తున్నారు. సంజు శాంసన్ వరుసగా మూడు మ్యాచుల్లో విఫలం కావడంతో.. వైభవ్‌ను ఎంపిక చేసేందుకు ఇదే మంచి తరుణమని మరికొందరి వాదన. అంతర్జాతీయ క్రికెట్‌కు వైభవ్ సిద్ధమే కానీ.. అరంగేట్రం చేయడానికి అందరికీ ఒకటే ప్రాసెస్ ఉంటుందని భారత అసిస్టెట్ కోచ్ డస్కటే వెల్లడించాడు. ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ విభేదించాడు. వైభవ్‌కు మద్దతుగా నిలిచాడు.
‘‘వైభవ్‌ను ఎప్పుడు బరిలోకి దింపుతారు? ఐర్లాండ్‌తో (India vs Ireland) సిరీస్ అతడికి మంచి అవకాశం. కానీ, ఆడించలేదు. అది అత్యంత దురదృష్టకరం. సూర్యవంశీ కూడా ఇతర ఆటగాళ్ల మాదిరిగానే అరంగేట్ర ప్రక్రియను అనుసరించాల్సిందేనని చెప్పిన భారత కోచ్‌తో నేను విభేదిస్తున్నాను. ఐపీఎల్లో అతడి ఆటను చూశాక.. ఇంకా ఆగడం ఎందుకు? ఐర్లాండ్‌పై ఆడిస్తే బాగుండేది. కాస్త అనుభవం వచ్చేది కదా. ఆ సిరీస్‌ను భారత్ ఓడిపోయింది. ఇంగ్లాండ్‌తో (India vs England) తొలి టీ20 రద్దు అయింది. ఇలాంటప్పుడే టీమ్ఇండియా బలంగా పుంజుకోవాలి. యూకేలో దూకుడుగా ఆడేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను అమలు చేయాలి. అక్కడ కూడా 250 లేదా 260 పరగులు చేయలేరు. ఆ పిచ్‌లపై 160 రన్స్ కూడా మంచి స్కోరే అవుతుంది. అందుకు తగినట్టుగా వ్యూహాలను అమలు చేయాలి’’ అని డివిలియర్స్ సూచించాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.