
ఓ వైపు మ్యూజిక్ ఆల్బమ్స్.. మరో వైపు సినిమాలతో నిత్యం ప్రేక్షకుల్ని అలరిస్తోన్న నటి.. షెహనాజ్ గిల్. అందుకే, ఆమెకు ఐకానిక్ గోల్డ్ ‘ఇంటర్టైన్మెంట్ సెన్సేషన్’ అవార్డు దక్కింది
తాజాగా ముంబయిలో నిర్వహించిన ఈ ఐకానిక్ గోల్డ్ అవార్డు వేడుకకు ఆమె బంగారు రంగు గౌనులో వచ్చి అవార్డును అందుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి.
పంజాబ్‌లో పుట్టి పెరిగిన హెష్నాజ్.. చదువుకుంటూ మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. 2015లో ‘శివ్ ది కితాబ్’ అనే పంజాబీ మ్యూజిక్ వీడియోతో నటిగా మారింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
పంజాబీలోనే 150కిపైగా మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించింది. దీంతో ఈ తారకు కుర్రకారులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇన్‌స్టాలో 1.89 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే తన క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
2017లో‘సత్ శ్రీ అకాల్ ఇంగ్లాండ్’ అనే పంజాబీ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లోనూ నటించింది. షెహ్నాజ్ను ఆమె అభిమానులు ‘పంజాబీ కత్రినా కైఫ్’ అని పిలుస్తుంటారు.
‘బిగ్‌బాస్ 13’లో పాల్గొన్న షెహ్నాజ్.. తోటి కంటెస్టెంట్ సిద్ధార్థ్ శుక్లా ప్రేమలో పడిందని వార్తలొచ్చాయి. ఆ సీజన్లో సిద్ధార్థ్ విజేతగా నిలవగా.. ఈమె రెండో రన్నరప్‌గా నిలిచింది.
సల్మాన్‌ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్’ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ‘థాంక్యూ ఫర్ కమింగ్’,‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’చిత్రాలతో అలరించింది.
ఈమె నటి మాత్రమే కాదు.. ప్రొఫెషనల్ సింగర్ కూడా. తన మ్యూజిక్ వీడియోల్లోని కొన్నింట్లో పాటలు పాడింది. తను పాడిన ‘వెహమ్’ ‘సదా రబ్ నే’, ‘ఆంటీ ఆంటీ’ పాటలు బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాయి.
సల్మాన్ ఖాన్, ఆర్యన్ కార్తిక్ తన ఫేవరెట్ నటులని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. సింగర్‌గా హీరోయిన్ సారా అలీ ఖాన్‌కు స్వరం అందించాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టింది.
‘ఎక్ కుడి’ చిత్రంతో నిర్మాతగానూ మారింది షెహ్నాజ్. బాలీవుడ్ చిత్రాల్లో తనకు ఒకే రకమైన పాత్రలు వస్తున్నాయని, మంచి కథలు రావట్లేదని వాపోయింది. అందుకే, తనే మంచి చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపింది.
తనకి తొందరగా కోపం వచ్చేస్తుందట. దాని నుంచి బయటపడటానికి థెరపీ సెషన్స్ తీసుకున్నట్లు బహిరంగానే చెప్పుకొచ్చింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నానని చెప్పింది.
‘ఎవరు ఏం అనుకున్నా నేను పట్టించుకోను. వారి ఆలోచనలను నేను మార్చలేను. నా పని నేను చేసుకుంటా. అయితే, నా అభిమానులను ఏమైనా అంటే తట్టుకోలేను’అని తెలిపింది షెహ్నాజ్.