రోహిణికి అన్యాయం జరుగుతోంది.. మీ అన్నయ్య మనోజ్ పైకి కనిపించేంత అమాయకుడు అయితే కాదు.. చాటుగా పిల్లాడ్ని కని.. ప్రేయసిని విదేశాల్లో పెట్టి.. కొడుకుని అమ్మమ్మ దగ్గర పెట్టి చదివిస్తున్నాడు..
ఇదంతా రోహిణికి తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో.. మీ అన్నయ్యని మాత్రం వదిలి పెట్టకూడదు అని మీనా అమాయకంగా అంటుంది. వాడికి అంత సీన్ లేదు అని బాలు చెబుతున్నా వినదు. సరే సాక్ష్యాలు, ఆధారాలు దొరికే వరకు మనం దీన్ని సీక్రెట్‌గానే ఉంచుదాం అని మీనాతో బాలు అంటాడు. ఇక ఉదయాన్నే ప్రభావతి కోసం సున్నిత అనే డైటీషన్ను మనోజ్ తీసుకు వస్తాడు. ప్రభావతి తాగుతున్న కాఫీని లాగేస్తుంది సున్నిత. మీరు ఏం దాచకుండా అన్నీ చెప్పాలని సున్నిత అంటుంది. అన్నీ చెప్పాలా? ఎన్ని లక్షలు, ఎప్పుడెప్పుడు మింగారో అన్నీ చెప్పాలా? అని బాలు కౌంటర్లు వేస్తాడు. అడిగింది ఇంటి గురించి కాదండి.. ఒంటి గురించి అని బాలుని ఆపుతుంది మీనా. పావు కిలో కంటే ఎక్కువ అరకిలో కంటే తక్కువ చికెన్ తింటుందని బాలు అంటాడు. దీంతో ప్రభావతి ఆపరా అని అరిచేస్తుంది. సరే ఈ డైట్ ఫాలో అవ్వండి, లిస్ట్ ఇస్తుంది. వారానికి 8 వేలు అని చెప్పడంతో అంతా షాక్ అవుతారు.ఐదు వందలు ఇస్తేనే వంట వారానికి వెయ్యి అంటే రోజుకి 1100.. మా మనోజ్ గాడు ఇస్తాడు తీసుకోండి.. అని బాలు కౌంటర్లు వేస్తాడు. మీరే ప్రిపేర్ చేస్తే ఎంత తీసుకుంటారు అని మీనా అడుగుతుంది. మూడు వందలు అని చెబుతుంది. నువ్వు ఐదు వందలు తీసుకో మీనా అని బాలు అంటాడు. రవి.. నువ్వు అయితే ఎంత తీసుకుంటావ్ రా అని బాలు అడుతాడు. వెయ్యి అని రవి అంటాడు. నువ్వు 500 తీసుకోవడంలో తప్పు లేదు.. ఐదు వందలు ఇస్తేనే వంట చేస్తుంది అని బాలు అంటాడు.మాకు మాత్రం పని లేదా? అయితే పార్లరమ్మ చేసుకుంటుంది లే అని బాలు అంటాడు. నాకు పని లేదా? అని రోహిణి అంటుంది.. మాకు మాత్రం పని లేదా? అని బాలు, మీనా అంటారు. మీనా ఇంటి పని, బిజినెస్ అన్నీ చేసుకుంటోంది.. అని సత్యం అంటాడు. మీరు ఊరుకోండి.. ఇక నేను సన్నగా అవుతాను అని ప్రభావతి ఊహించుకుంటుంది. ముందు వెళ్లి మనం సరుకులు తెచ్చుకుందాం పదరా అని ప్రభావతి అంటుంది. సరే అమ్మ అని మనోజ్ అంటాడు. నేను తీసుకు వస్తాను లేండి అని మీనా అంటుంది.వాడ్ని మాత్రం వదిలి పెట్టను.. పూలు తీసుకుని అరుణ్ ఇంటికి వస్తుంది సుమతి. డబ్బులు తీసుకో.. మావాడికి ఇలా ఫ్రీగా తీసుకోవడం నచ్చదు అని రాజేశ్వరి అంటుంది. ఏ ఏ బట్టలు ఉతకాలి రా అని అరుణ్‌ను రాజేశ్వరి అడుగుతుంది. ఆ హ్యాంగర్‌కి ఉన్న షర్ట్ మాత్రం వద్దు అని అంటాడు. ఓ రౌడీతో మా అరుణ్‌కి రోజూ గొడవ అవుతోందని సుమతికి చెబుతుంది రాజేశ్వరి. పోలీసోడితోనే గొడవ పెట్టుకుంటున్నాడా? అని సుమతి అంటుంది. టైం వస్తుంది.. వాడి సంగతి చెప్తాను అని అరుణ్ అంటాడు. వాడ్ని మాత్రం వదిలి పెట్టను అని అరుణ్ అంటే.. వదిలేయండి.. మీ పని మీరు చూసుకోండి అని సుమతి అంటుంది.లక్షలు తెచ్చే కోడలంటేనే ఇష్టం.. చింతామణి స్టెప్పులు సరిగ్గా వేయదు. దీంతో కామాక్షి, ప్రభావతి తిడతారు. మీనా కోసం ఇక్కడ ఉంటున్నాను కానీ.. నాకు ఈ కర్మ ఎందుకు అని చింతామణి లోలోపల అనుకుంటుంది. మా వదినకు పెద్ద కోడలు అంటేనే ఇష్టం.. లక్షలు తీసుకు వస్తుందని అనుకుంటుంది.. లక్ష చేతిలో పెడితే మీనా కూడా నచ్చుతుందిలే అని ప్రభావతికి కౌంటర్లు వేస్తుంది కామాక్షి. పేదింటిది.. అదంటేనే నాకు నచ్చదు.. అని మీనా గురించి ప్రభావతి చెబుతుంది. అయితే నా పని నీ ద్వారానే సులువుగా అవుతుంది.. మీనా బతుకు మీద కూడా దెబ్బ కొడతా అని చింతామణి అనుకుంటుంది.ఇదా గురు శిష్యుల బంధం.. చింతామణిని, ప్రభావతిని ఒక్కటిగా చూసి మీనా షాక్ అవుతుంది. కామాక్షి ఒకరినొకరికి పరిచయం చేస్తుంది. మాకు తెలుసు అని ఇద్దరూ అంటారు. అవును కదా అని కామాక్షి అనుకుంటుంది. నా శిష్యురాల్ని పరిచయం చేయాల్సిన పని లేదు.. అని ప్రభావతి అంటుంది. ఎవరు ఎవరికి ఏం నేర్పిస్తున్నారు.. ఎవరు ఎవరికి గురువులు, శిష్యులు అని మీనా కౌంటర్లు వేస్తుంది. చీమలు పెట్టిన పుట్టలో పాములు వస్తాయన్నట్టుగా ఉంది.. జాగ్రత్తగా కామాక్షి పిన్ని గారు అని మీనా అంటుంది..అడ్డగాడిదలు వస్తున్నాయి.. ఏంటి మమ్మల్ని పాములు అంటున్నావా? అని చింతామణి అంటుంది. పాముల్ని మొక్కుతారు.. మీరు వానపామలు.. నట రాజ నాట్య నిలయంలోకి అడ్డ గాడిదలు వస్తున్నాయి.. అది గుర్తించడం లేదు.. ఏదో ఒక రోజు మిమ్మల్ని తన్నేసి పోతాయి.. అని చింతామణి, ప్రభావతికి కౌంటర్లు వేస్తుంది మీనా. నన్ను అంత మాట అంటావా? నీకు ఎంత పొగరు.. అని చింతామణి అంటుంది. నువ్వు ఆఫ్ట్రాల్ ఇంటిఇంటికి తిరిగి పోలు అమ్మేదానికి.. నీకు అదే ఎక్కువ.. నీకు ఆమెతో పోటీ ఏంటి? అని మీనాని అంటుంది ప్రభావతి.చింతామణికి మీనా వార్నింగ్.. ఆవిడ మా అత్త గారు కాబట్టి.. నేను కాస్త అణిగిమణిగి ఉంటాను.. లేదంటే ఆవిడ్ని కూడా నిన్ను పరిగెత్తించినట్టు పరిగెత్తిస్తాను.. నన్ను దించడానికి మీ ఇద్దరూ జట్టు కట్టినా నాకేం కాదు.. నాకు నా భర్త అండగా ఉంటాడు.. ఇంట్లోనే శత్రువు ఉంటే.. నాకే మంచిది.. ఇంకా జాగ్రత్తగా ఉంటాను.. మీ ఇద్దరూ కలిసినా నన్ను ఆపలేరు.. నా ఎదుగుదలను ఆపలేరు.. నన్ను ఆపడమే పనిగా పెట్టుకుంటే.. నీ పని కూడా పోతుంది.. అయినా డ్యాన్స్ నేర్చుకో.. నిన్ను పక్క రాష్ట్రానికి తరిమిస్తే.. అక్కడ డ్యాన్స్ క్లాసులు చెబుతూ సంపాదించుకో అని చింతామణికి వార్నింగ్ ఇస్తుంది మీనా.నేను వదిలి పెట్టను.. వంటగదిలో మీనా పరధ్యానంలో ఉంటే శ్రుతి వస్తుంది. ప్రభావతి, చింతామణి కలిసిన విషయం.. చేయి నొప్పి అంటూ ఆడిన నాటకం గురించి శ్రుతికి మీనా చెబుతుంది. అలాంటి వాళ్లతో కలిసి నన్ను ఇలా చేసిందని బాధగా అనిపిస్తోందని ప్రభావతి గురించి చెబుతూ మీనా బాధపడుతుంది. ఇదంతా మా ఆయనకు చెప్తే మళ్లీ గొడవ అవుతుంది.. నా బాధను తగ్గించుకునేందుకు నీతో చెప్పా.. నువ్వు కూడా మర్చిపో అని మీనా అంటుంది. నేను మాత్రం అత్తయ్యని అంత ఈజీగా వదిలి పెట్టను అని శ్రుతి లోలోపల అనుకుంటుంది.తాళి బొట్టు కోసం.. మీనాకి తెలియకుండా బాలు ఓ చిట్టి వేస్తుంటాడు. ఏంట్రా మీనా చెల్లికి తెలియకుండా నువ్వు చిట్టి వేస్తున్నావా? అని రాజేష్ అడుగుతుంటాడు. అవును రా.. మీనాకి చెప్తే ఏదైనా అవసరం వస్తే.. ఆ డబ్బులు కూడా వాడేస్తుంటుంది.. అందుకే మీనాకి తెలియకుండా చిట్టిలు వేస్తున్నా.. ఆ డబ్బులు రాగానే.. మీనాకి ఓ బంగారు తాళి కొని మెడలో వేయాలి.. అసలే ఇప్పటికీ పసుపు తాడుతోనే సర్దుకుంటోంది.. తనకి కొనాలని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక సమస్య వస్తోంది.. డబ్బులు ఖర్చు అవుతున్నాయి.. ఈ సారి మాత్రం కొనాల్సిందే రా అని బాలు చెప్తాడు.Screenshot 2026-07-03 074828