
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న తెలుగు హీరోయిన్లలో అంజలి ఒకరు. ఫొటో సినిమాతో మొదలైన ఆమె సినీ ప్రయాణం షాపింగ్ మాల్, జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో అంజలి క్రేజ్ అమాంతం...
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న తెలుగు హీరోయిన్లలో అంజలి ఒకరు. ఫొటో సినిమాతో మొదలైన ఆమె సినీ ప్రయాణం షాపింగ్ మాల్, జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో అంజలి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అలాగే గీతాంజలి, వకీల్ సాబ్, గేమ్ ఛేంజర్, మదగజరాజా సినిమాలు కూడా ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తోందీ అందాల తార. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయకపోయినా తమిళంలో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది అంజలి. అందులో విశాల్ వంటి స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో తనకు ఎదురైన లవ్ ప్రపోజల్స్ గురించి కూడా బయట పెట్టింది.
ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ 'ప్రపోజ్ చేస్తే రాఖీ ఎందుకు కట్టారు?' అని ప్రశ్నించగా, 'అది ఒక ఈగో డ్రైవ్' అని అంజలి సమాధానమిచ్చింది. 'కట్టి చూడు' అంటూ అతను నాకు ఛాలెంజ్ చేశాడు. నేనూ తగ్గకుండా నిజంగానే రాఖీ కట్టేశాను. అంతే. నేను స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే ఒక అబ్బాయి నన్ను ఇష్టపడేవాడు. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు నిరంతరం నాకు ప్రపోజ్ చేస్తూనే ఉండేవాడు. మొదట్లో పట్టించుకోకపోయినా.. చివరకు అతని పట్టుదల చూసి ఓ నిర్ణయం తీసుకున్నాను. 'పదో తరగతిలో అతనికి రాఖీ కట్టేశాను. ఇక ఆ తర్వాత నన్ను వదిలేస్తాడనుకున్నాను. కానీ అతను మాత్రం 'అన్నయ్య కాదు... కన్నయ్య' అంటూ రాఖీ తీసి పడేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతన్ని నేను మళ్లీ ఎప్పుడూ చూడలేదు' అని అప్పటి క్షణాలను గుర్తకు తెచ్చుకుంది అంజలి.
ఇక సినిమా పరిశ్రమలో వచ్చిన లవ్ ప్రపోజల్స్ గురించి మాట్లాడిన అంజలి అవన్నీ చాలా కామన్ విషయాలు అని పేర్కొంది. ' సినిమా షూటింగ్ల సమయంలో అభిమానులు, సహనటులు, పరిచయస్తుల నుంచి ఎమోషనల్గా ప్రపోజల్స్ వస్తుంటాయి. అయితే వాటిని నేను ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా జరుగుతాయి. కానీ ప్రతి ప్రపోజల్ ప్రేమగా మారదు. చాలా వరకు అభిమానుల అభిమానం మాత్రమే ఉంటుంది' అని క్లారిటీగా చెప్పింది అంజలి. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.