
ఆగస్టులో శ్రీలంకలో పర్యటించనున్న భారత్ ఆతిథ్య లంకతో రెండు టెస్టులు ఆడనున్న టీమ్ఇండియా షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ IND vs SL : ఆగస్టులో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి 19 వరకు తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు గాలే అంతర్జాతీయ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఆగస్టు 23 నుంచి 27 వరకు రెండో టెస్టు మ్యాచ్ కొలంబోలోని ఎస్ఎస్సీ (సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్) మైదానంలో జరగనుంది. Sanju Samson : ఆ మూడు ఇన్నింగ్స్‌లతో ఇంకెన్నాళ్లు సంజూ శాంసన్.. ఇక చాలు.. Mark your calendars 🗓️ Presenting #TeamIndia's schedule for the two-match Test series against Sri Lanka, starting August 15 🙌#SLvIND — BCCI (@BCCI) July 2, 2026 ఈ రెండు టెస్టు మ్యాచ్‌లు కూడా భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. భారత్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (2025–27)లో భాగంగా జరగనుండడంతో భారత్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ 2025-27 పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఇప్పటివరకు తొమ్మిది టెస్టులు ఆడిన భారత్ నాలుగు విజయాలు, నాలుగు పరాజయాలు నమోదు చేయగా, ఒక మ్యాచ్ ను డ్రాగా ముగిసింది. టాప్-2లో ఉండే జట్లు మాత్రమే ఫైనల్ ఆడతాయి అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ టాప్-2లో నిలవాలంటే ప్రతి మ్యాచ్ కూడా ఎంతో కీలకంగా మారింది. ఈ క్రమంలో లంక సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరచుకోవాలని భారత్ భావిస్తోంది.