
Test Cricket : టెస్ట్ క్రికెట్లో బ్యాటింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, జట్టుకు కెప్టెన్‌గా ఉంటూ ఒత్తిడిని తట్టుకుని పరుగుల వరద పారించడం మరొక ఎత్తు.
క్రికెట్ చరిత్రలో కొందరు కెప్టెన్లు తమ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును ముందుండి నడిపించడమే కాకుండా, ఒకే టెస్ట్ సిరీస్‌లో కొండంత స్కోరు చేసి రికార్డులకెక్కారు. ఒకే సిరీస్‌లో కెప్టెన్ హోదాలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆస్ట్రేలియా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మాన్ నెలకొల్పిన రికార్డు ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆయనతో పాటు ఆధునిక క్రికెట్లో టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ గ్రాహం గూచ్ వంటి లీడర్లు సృష్టించిన అరుదైన రికార్డుల వివరాలు తెలుసుకుందాం.
నాటి బ్రాడ్‌మాన్ ఆల్-టైమ్ వరల్డ్ రికార్డ్
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మాన్ 1936-1937లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించిన సమయంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఆ సిరీస్ బ్రాడ్‌మాన్ కెప్టెన్సీకి, బ్యాటింగ్‌కు ఒక పెద్ద పరీక్షగా నిలిచింది. ఆ ఐదు మ్యాచుల సిరీస్‌లో ఆయన ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 9 ఇన్నింగ్స్‌ల్లో 90.00 అద్భుత సగటుతో ఏకంగా 810 పరుగులు సాధించారు. ఈ పరుగుల ప్రవాహంలో 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 270 పరుగులు కాగా, 65.48 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ 62 ఫోర్లు బాదారు. ఈ సిరీస్‌లో ఆయన రెండు సార్లు డకౌట్ అయినప్పటికీ, కెప్టెన్‌గా ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. ఈ రికార్డు నేటికీ చెక్కుచెదరకుండా ఉంది.
ఇంగ్లాండ్ గడ్డపై కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఊచకోత
ఆధునిక క్రికెట్లో డాన్ బ్రాడ్‌మాన్ రికార్డుకు అత్యంత చేరువగా వచ్చిన ఘనత టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్‌కు దక్కింది. 2025లో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు ఇరు జట్ల మధ్య ప్రతిష్టాత్మక ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ జరిగింది. ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గిల్.. ఇంగ్లాండ్ పేస్ పిచ్‌లపై ఇంగ్లీష్ బౌలర్లను చీల్చి చెండాడుతూ 5 మ్యాచుల 10 ఇన్నింగ్స్‌ల్లో 754 పరుగులు సాధించాడు. 75.40 సగటు, 65.56 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన గిల్.. ఈ సిరీస్‌లో ఏకంగా 4 అద్భుత సెంచరీలు సాధించాడు. ఇందులో అతని బెస్ట్ స్కోరు 269 పరుగులు. ఈ సిరీస్ మొత్తంలో ఒక్కసారి కూడా డకౌట్ కాకపోవడం విశేషం. గిల్ తన బ్యాట్ నుంచి 85 ఫోర్లు, 12 సిక్సర్లు బాది ఆధునిక క్రికెట్లో కెప్టెన్సీ ఇన్నింగ్స్‌కు కొత్త నిర్వచనం ఇచ్చాడు.
లార్డ్స్ మైదానంలో గ్రాహం గూచ్ ట్రిపుల్ సెంచరీ
భారత బౌలర్లకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ గ్రాహం గూచ్. 1990లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు కేవలం 3 మ్యాచుల సిరీస్ మాత్రమే జరిగింది. కానీ గూచ్ మాత్రం ఒకే సిరీస్‌లో ఒక ల్యాండ్‌మార్క్ సెట్ చేశాడు. కేవలం 6 ఇన్నింగ్స్‌ల్లోనే బ్యాటింగ్ చేసిన ఆయన 125.33 సగటుతో 752 పరుగులు రాబట్టాడు. ఈ సిరీస్‌లో క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో గూచ్ 333 పరుగుల చారిత్రాత్మక ట్రిపుల్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. 62.09 స్ట్రైక్ రేట్‌తో ఆడిన ఆయన ఖాతాలో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత బౌలింగ్‌ను చెండాడుతూ ఆయన బాదిన 89 ఫోర్లు, 7 సిక్సర్లు ఇప్పటికీ క్రికెట్ అభిమానుల మదిలో నిలిచే ఉన్నాయి.
యాషెస్ సిరీస్‌లో డేవిడ్ గోవర్ క్లాస్ బ్యాటింగ్
కంగారూ బౌలర్లకు వారి సొంత గడ్డపైనే చుక్కలు చూపించిన క్లాసిక్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఇంగ్లాండ్ కెప్టెన్ డేవిడ్ గోవర్. 1985లో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను లీడ్ చేసిన గోవర్.. ఆస్ట్రేలియా బౌలింగ్ లైన్అప్ను పూర్తిగా ధ్వంసం చేశాడు. 6 మ్యాచుల 9 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన ఆయన 81.33 సగటుతో 732 పరుగులు చేశాడు. 61.20 స్ట్రైక్ రేట్‌తో ఆడిన గోవర్ అత్యధిక స్కోరు 215 పరుగులు. ఈ సిరీస్‌లో 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సాధించిన గోవర్.. తన అద్భుతమైన టైమింగ్‌తో 89 క్లాసిక్ ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. ఈ కెప్టెన్సీ ఇన్నింగ్స్ కారణంగానే ఇంగ్లాండ్ జట్టు యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించగలిగింది.
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ల గుండెల్లో నిద్రపోయిన సునీల్ గవాస్కర్
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లను హెల్మెట్ కూడా లేకుండా ఎదుర్కొని రికార్డులు సృష్టించిన ఘనత లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్‌కే దక్కుతుంది. 1978-79 మధ్య కాలంలో వెస్టిండీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఆ సమయంలో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న గవాస్కర్.. విండీస్ పేసర్ల సవాల్‌ను స్వీకరించి 6 మ్యాచుల 9 ఇన్నింగ్స్‌ల్లో ఒకసారి నాటౌట్‌గా నిలిచి 732 పరుగులు సాధించాడు. 91.50 ల భారీ యావరేజ్‌తో 4 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ బాదిన గవాస్కర్ అత్యధిక స్కోరు 205 పరుగులు. ఆ సిరీస్‌లో విండీస్ బౌలర్లను విసిగిస్తూ సుమారు 476 కి పైగా బంతులను ఎదుర్కొని 65 కి పైగా ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. గవాస్కర్ చూపిన ఈ పట్టుదల క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప లీడర్షిప్ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..