కాలేయానికి పునరుత్పత్తి శక్తి ఉంటుంది. ఇది తొందరగా రికవరీ అవుతుంది. ఒకవేళ మీరు ఆరు నెలల పాటు ఆల్కహాల్ తాగడం మానేస్తే కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. లివర్ హెల్తీగా మారు
తుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం పేర్కొంది.
ఆల్కహాల్లోని కేలరీలు మెటబాలిజం ప్రక్రియను మందగించేలా చేసి పొట్ట పెరిగేలా చేస్తాయి. దీంతో బరువు పెరుగుతారు. మీరు కనుక 6 నెలల పాటు ఆల్కహాల్ మానేస్తే బరువు, పొట్ట సులువుగా తగ్గుతుంది. తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు.
ఆల్కహాల్ తాగితే చాలామంది ఒత్తిడి తగ్గుతుందని అనుకుంటారు. కానీ ఆల్కహాల్ అతిగా తాగితే కార్టిసాల్ హార్మోన్ పెరిగి ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. ఒకవేళ ఆల్కహాల్ మానేస్తే కార్టిసాల్ లెవెల్స్ తగ్గి హార్మోన్ బ్యాలెన్స్ బాగుంటుంది. మంచి మూడ్ లభిస్తుంది.
ఆల్కహాల్ తాగేవారిలో నిద్రలేమి సమస్య ఉంటుంది. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. మీరు కనుల ఆరు నెలలు ఆల్కహాల్ మానేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిద్ర పడుతుంది.
ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి బీపీ పెరుగుతుంది. తద్వారా గుండెపోటు రిస్క్ పెరుగుతుంది. మీరు కనుక ఆల్కహాల్ మానేస్తే రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు అదుపులో ఉంటుంది.
ఆల్కహాల్ చర్మాన్ని తొందరగా డీహైడ్రేట్ చేస్తుంది. అందుకే ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారిలో తొందరగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ఒకవేళ మందు తాగడం మానేస్తే మీ చర్మం హెల్తీగా, అందంగా ఉంటుంది.
ఆల్కహాల్ ఎక్కువగా తాగితే రోగనిరోధక శక్తి తగ్గిపోయి అనేక రకాల ఇన్ఫెక్షన్లు తొందరగా దరిచేరతాయి. ఒకవేళ ఆల్కహాల్ మానేస్తే తెల్ల రక్తకణాల ఉత్పత్తి పెరిగి ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చు.
ఆల్కహాల్ పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. దీంతో కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, ఛాతి మంట వంటి సమస్యలు వస్తాయి. మీరు కనుక 6 నెలలు ఆల్కహాల్ మానేస్తే పేగులు ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు నివారించుకోవచ్చు.
ఆల్కహాల్ తాగేవారి దగ్గర డబ్బులు నిలవవు. వీరు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. దీంతో వచ్చే జీతం అస్సలు సరిపోదు. మీరు కనుక ఆల్కహాల్ మానేస్తే చాలా వరకు డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఆర్థిక ఎదుగుదల బాగుంటుంది.