ప్రతిరోజూ డీప్ బ్రీతింగ్, బాక్స్ బ్రీతింగ్ వంటి శ్వాస వ్యాయామాలు చేయండి. ఆలోచనల పరంపర ఎక్కువగా ఉన్నప్పుడు డీప్ బ్రీత్ తీసుకోండి. దీంతో మీ నాడీ వ్యవస్థ కూల్ అవుతుంది. ఆలోచనలు తగ్గుతాయి.
ఫోన్ ఎక్కువ సేపు చూడటం వల్ల ఆలోచనల ఉదృతి పెరుగుతుంది. ఫోన్ నుంచి నిరంతరాయంగా వచ్చే నోటిఫికేషన్లు ఒత్తిడిని పెంచుతాయి. కాబట్టి ఫోన్కు దూరంగా ఉండండి.
మీకు వచ్చే ఆలోచనలను ఒక చోట రాసుకోండి. మైండ్లో వచ్చే ఆలోచనలను పేపర్ మీద పెడితే మరోసారి ఆ ఆలోచన రాదు.
కాఫీకి దూరంగా ఉండండి. కాఫీ బదులుగా హెర్బల్ టీ తాగండి. చామంతి టీ, గ్రీన్ టీ, పుదీనా టీ తాగడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
రోజులో కాసేపు ప్రకృతితో సమయం గడపండి. పచ్చని ప్రకృతిని చూస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఆలోచనలు అదుపులోకి వస్తాయి.
చల్లని నీటితో ముఖాన్ని వాష్ చేసుకోండి. దీని వల్ల మనసు రీఫ్రెష్ అవుతుంది. ఆలోచనలను కంట్రోల్ అవుతాయి.
ఆరోమాథెరఫీ ఫాలో అవ్వడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. నాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. ఆలోచనల ఉధృతి తగ్గుతుంది.
మీకు నచ్చిన వారితో ఎక్కువ సమయం గడపండి. దీని వల్ల ఎండార్పిన్లు రిలీజ్అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. ఆలోచనలు కంట్రోల్ అవుతాయి.
మీరు మీ జీవితంలో సాధించిన 3 ముఖ్యమైన విజయాలను ఒక చోట రాయండి. దీని వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.