
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Nagabandham Public Talk Review: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెదకాపు’ చిత్రంతో పరిచయమైన విరాట్ కర్ణ ముఖ్యపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నాగబంధం’. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మన పురాణ ఇతిహాసాలు, అందులో దాగున్న నిగూఢ రహస్యాల నేపథ్యంలో ‘నాగబంధం’ సినిమా తెరకెక్కింది. ఈ రోజు విడుదలైన ఈ సినిమాను ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మైథాలాజికల్ అడ్వెంచర్ త్రిల్లర్ ప్రేక్షకులను సమ్మోహన పరిచిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
ఈ సినిమా 1756 నుంచి 1962 మధ్యలో జరిగే కథ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. 1962లో పురావస్తు శాస్త్రవేత్త ప్రభాకర్ (జగపతిబాబు)తో పాటు అతని అసిస్టెంట్స్ ఇద్దరు కలిసి హిమాలయాల్లో నాగబంధం విముక్తికి సంబంధించిన ఓ పుస్తకాన్ని కనుక్కుంటారు. ఈ క్రమంలో రంగనాథ స్వామి ఆలయంలో సాక్షాత్తు స్వామి వారి వద్ద ఉన్న బ్రహ్మ కమయాలన్ని ఎవరో దొంగతనం చేస్తారు. మరోవైపు చెల్లి పెళ్లిలో ఊహించని విషాదం రుద్ర (విరాట్ కర్ణ) ఫ్యామిలికి కలుగుతుంది. ఇక రంగనాథ స్వామి ఆలయంలో బ్రహ్మ కమలాన్ని చేజక్కించుకొని ప్రపంచాన్ని శాసించాలనుకుంటాడు దుష్టుడైన అలీ (రిషబ్ సహాని). మరోవైపు అదే బ్రహ్మ కమలం కోసం శాపం కారణంగా ఓ చెట్టులో ఇరుక్కుపోయిన బైరాగి (గరుడ రామ్) కూడా ఆ బ్రహ్మకమలం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు.
ఆ బ్రహ్మ కమలం కోసమే రుద్ర ఫ్యామిలీని అలీ అంతం చేస్తాడు. ఇంతటీ విషాదం నుంచి తేరుకొని రుద్ర బ్రహ్మ కమలయాన్ని దుష్టుల పాలు కాకుండా ఏం చేశాడు..? ఇక విలన్ కుట్రలను ఎలా చేధించాడు. ఇందులో రుద్ర ప్రేయసి పార్వతి పాత్ర ఏమిటి..? అసలు అనంత పద్మనాభ స్వామి గుడికి బ్రహ్మ కమలానికి ఉన్న లింక్ ఏమిటనేదే ‘నాగబంధం’ సినిమా స్టోరీ.
దర్శకుడు అభిషేక్ నామా.. ‘నాగబంధం’ అనే టైటిల్‌తో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాడు. తాను రాసుకున్న కథ బాగానే ఉన్నా.. దాన్ని ఇంకాస్త మెరుగ్గా తెరకెక్కిస్తే బాగుండేది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సనాతన హైందవ ధర్మం నేపథ్యంలో వచ్చిన చిత్రాలు విజయం సాధించడంతో దాని చుట్టే ఈ కథను అల్లుకున్నాడు. దాదాపు మైథాలాజికల్ థ్రిల్లర్ మూవీస్ తరహాలోనే ఈ సినిమా స్టోరీని అల్లుకున్నాడు. శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన గుడిలో బ్రహ్మ కమలం చోరికి గురవుతుంది. దాన్ని చేజిక్కించుకుంటే ప్రపంచాన్ని శాసించాలనుకునే దుష్టుడు. దానిపై మరో విలన్ కన్ను పడటం. ఆ బ్రహ్మ కమయాలన్ని దుష్టులకు చిక్కకుండా హీరో రుద్ర ఎలాంటి సాహాసాలు చేసాడనే కాన్సెప్ట్ రొటీన్‌గా ఉండటం. ప్రేక్షకులు ఒక సీన్ తర్వాత మరో సీన్ ఊహించుకునే విధంగా ఉండటం ఈ సినిమాకు మైనస్. కానీ అదే సమయంలో ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో వంక పెట్టడానికి వీలు లేకుండా చేశాడు. కొన్ని సన్నివేశాలను తెరపై చూస్తే గూస్ బంప్స్ ఖాయం. గ్రాఫిక్స్ విషయంలో పెట్టిన శ్రద్ధ.. కథపై ఇంకాస్త పెట్టి ఉంటే బాగుండేది. కొత్త వాడైన విరాట్ కర్ణతో అభిషేక్ నామా చేసిన ఈ ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా ఉండలేము. నభా నటేష్‌కు నటకు స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. ఇందులో కొన్ని సన్నివేశాలు బాగానే ఉన్నాయి. కొన్ని కృతకంగా అనిపిస్తాయి. విలన్ గ్యాంగ్ హీరో ఫ్యామిలీని చంపే సీన్లో వయెలెన్స్ ఎక్కువైంది. హీరో విలన్ పైగా పగ తీర్చుకోవడమే కాకుండా.. సనాతన హైందవ సంప్రదాయాన్ని కాపాడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసేడనే కాన్సెప్ట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
నాగబంధం మూవీకి మ్యూజిక్ పెద్ద ఎస్సెట్. అభిషిక్త్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సౌందర్ రాజన్ కెమెరా వర్క్ గురించి చెప్పుకోవాలి. ప్రతి విజువల్‌ను ప్రేక్షకులకు గ్రాండియర్‌గా అందించడంలో సక్సెస్ అయ్యాడు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, నిర్మాణ విలువలకు వంక పెట్టాల్సిన పనిలేదు. దర్శకుడిగా అభిషేక్ నామా ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే. కథ చివర్లో పార్ట్ 2 ఉంటుందని చెప్పి ఎండ్ కార్డ్ వేశాడు.
రుద్ర పాత్రలో విరాట్ కర్ణ ఒదిగిపోయి విధానం బాగుంది. మాములు యువకుడిగా.. సాధవుగా రెండో సినిమాలో మెచ్యుర్డ్ నటన ప్రదర్శించడాన్ని మెచ్చుకోవాల్సిందే. యాక్షన్ సీన్స్‌లో రాణించాడు. నభా నటేష్‌కు నటనకు స్కోప్ ఉన్న పాత్రలో మెప్పించింది. ఆర్కియాలిజిస్ట్గా జగపతిబాబు, బైరాగి క్యారెక్టర్లో గరుడ రామ్, విలన్‌గా రిషబ్ సహాని మంచి నటన కనబరిచారు. మిగిలిన పాత్రల్లో నటించిన మురళీ శర్మ, అనసూయ, ఐశ్వర్య మీనన్ తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. ‘నాగబంధం’..ఆకట్టుకునే మైథాలాజికల్ యాక్షన్ థ్రిల్లర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.