
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు.
అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
AP Government:రాష్ట్ర మంత్రిమండలి గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులను విడుదల చేసింది. కొత్త నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా పరిగణిస్తారు. అంటే ఈ తేదీ నుంచి రిటైర్మెంట్కు సంబంధించిన మార్పులు వర్తిస్తాయి.
60 ఏళ్ల వయసులో ఇప్పటికే పదవీ విరమణ చేసిన అర్హత ఉన్న ఉద్యోగులకు తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. అయితే ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తేదీ నుంచి తిరిగి విధుల్లో చేరే వరకు ఉన్న గ్యాప్ కాలానికి ఎలాంటి జీతం చెల్లించబోదని స్పష్టం చేసింది. అలాగే ఆ గ్యాప్ కాలాన్ని సీనియారిటీ లేదా పదోన్నతుల కోసం కూడా లెక్కలోకి తీసుకోరని తెలిపింది.
ఇప్పటికే కోర్టు ఆదేశాల ప్రకారం 62 ఏళ్ల వరకు పనిచేసిన ఉద్యోగులకు పూర్తి స్థాయి సర్వీస్ ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వారికి ఉద్యోగ కాలానికి సంబంధించిన అన్ని నిబంధనల ప్రకారం లాభాలు అందనున్నాయి.
అయితే 60 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ తీసుకుని మళ్లీ ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి చూపని వారికి పాత నిబంధనల ప్రకారమే పదవీ విరమణ కొనసాగుతుంది. వారికి ఇప్పటికే అమలులో ఉన్న రిటైర్మెంట్ నిబంధనలే వర్తిస్తాయి. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి అవసరమైన సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు సూచించింది. అలాగే ప్రతి సంస్థ తమ ఆర్థిక పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
రాష్ట్రంలోని అన్ని శాఖలు తమ పరిధిలో ఉన్న పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సొసైటీలకు ఈ ఉత్తర్వులను వెంటనే పంపించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించిన కొత్త నిబంధనలు త్వరలోనే పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి.
ఈ నిర్ణయం ఉద్యోగులకు మరో రెండు సంవత్సరాల పాటు ఉద్యోగ భద్రతను కల్పించడంతో పాటు వారి ఆదాయం, సర్వీస్ బెనిఫిట్స్‌పై కూడా సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.