
Konda Surekha : తెలంగాణ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఫస్ట్ టైమ్ పేపర్‌లెస్ విధానంలో కేబినెట్ భేటీ ప్రారంభమైంది.
ఈ సమావేశంలో ప్రభుత్వం డిజిటల్ పాలన దిశగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, సీఎస్ సంజయ్ జాజు, సీఎం సలహాదారు కే. రామకృష్ణా రావు తదితరులు హాజరయ్యారు.
అయితే, ఈ కీలక భేటీలో దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ మాత్రం గైర్హజరు అయ్యారు. ఈ కేబినెట్ భేటీకి ఆమె (Konda Surekha) హాజరుకాకపోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె అనారోగ్య సమస్యల కారణంగానే కేబినెట్ సమావేశానికి రాలేదని ఆమె ఆఫీసు నుంచి సీఎం ఆఫీసుకు సమాచారం పంపినట్లు తెలిసింది.
Read Also : Lakshmibai : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి ఆకస్మిక బదిలీ.. హౌసింగ్ ఫెడరేషన్ ఎండీగా నియామకం
అయితే, కేబినెట్‌కు మంత్రి కొండ సురేఖ గైర్హాజరుపై అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్య కారణాలతోనే ఆమె కేబినెట్ భేటీకి దూరంగా ఉందని అనుచరులు చెబుతున్నారు. మరోవైపు.. యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుపై అసంతృప్తితో మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టారని కొద్దిమంది కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు.
ప్రభుత్వం వైపు నుంచి సాధారణ గైర్హాజరేనని, అనారోగ్య కారణాల వల్లనే మంత్రి సురేఖ కేబినెట్ సమావేశానికి రాలేకపోయినట్టు చెబుతున్నారు. తొలి పేపర్‌లెస్ కేబినెట్ భేటీ వంటి ప్రతిష్టాత్మక సమావేశానికి కీలక మంత్రి గైర్హాజరు కావడం చర్చలకు దారితీసింది. మొత్తం మీద, డిజిటల్ పాలన ప్రారంభానికి సంకేతంగా నిలిచిన ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ గైర్హాజరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.