
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరం విరాళాల కుంభకోణం వ్యవహారంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై విరుచుకుపడ్డారు.
Jul 2 2026 7:04 AM | Updated on Jul 2 2026 7:04 AM
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరం విరాళాల కుంభకోణం వ్యవహారంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. రామాలయం ప్రారంభమై రెండున్నరేళ్లు గడుస్తున్నా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక్కసారి కూడా స్వామివారిని ఎందుకు దర్శించుకోలేదని ఆయన నిలదీశారు. ఓట్ల కోసం ప్రసంగాల్లో రాముడి పేరు పదేపదే జపించిన నేతలకు గుడికి వెళ్లే తీరిక లేకపోవడం విచిత్రంగా ఉందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
బుధవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విరాళాల అవకతవకలు, సిట్ విచారణ తీరుపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్.. రామ మందిరం ప్రాణప్రతిష్ట జరిగి కచ్చితంగా 891 రోజులు గడిచిందని, ఈ కాలంలో అమిత్ షా ఒక్కసారి కూడా అయోధ్య వెళ్లలేదని కేజ్రీవాల్ గణాంకాలతో సహా వివరించారు. అమిత్ షా తన ప్రసంగాలు, ఇంటర్వ్యూలలో 42 సార్లకు పైగా రామ మందిరం గురించి మాట్లాడారని గుర్తుచేశారు. దేవుడి పేరుతో ఓట్లు అడిగేందుకు సమయం ఉంటుంది కానీ గుడికి వెళ్లి దేవుని దర్శనం చేసుకునే తీరికలేదా ? అని ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ : శిల్ప కళా వైభవం.. చెక్కుచెదరని కట్టడం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
ప్రేమలో పడిన యంగ్ హీరోయిన్.. ప్రియుడు ఇతడే (ఫొటోలు)
సత్యదేవ్ ‘రావు బహదూర్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. (ఫోటోలు)
అక్కినేని అఖిల్ ‘లెనిన్’ మూవీ HD స్టిల్స్
మూడేళ్ల ముందే జగన్ ఎలక్షన్ అజెండా.. MAVIGUN Vs అమరావతి
ఎవర్ని మోసం చేయడానికి బాబు మళ్లీ భూమి పూజ చేస్తున్నాడు?
బెల్జియాన్ని వణికించిన భారీ అగ్నిప్రమాదం!