
ఫోరెన్సిక్ విజ్ఞాన రంగంలో భారతదేశం ఒక కీలక మైలురాయిని చేరుకుంది. నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న 'లక్షర్ ఎవిడెన్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్', ఫోరెన్సిక్ టెస్టింగ్ కోసం ప్రతిష్ఠాత్మక 'నేషనల్...
ఫోరెన్సిక్ విజ్ఞాన రంగంలో భారతదేశం ఒక కీలక మైలురాయిని చేరుకుంది. నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న 'లక్షర్ ఎవిడెన్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్', ఫోరెన్సిక్ టెస్టింగ్ కోసం ప్రతిష్ఠాత్మక 'నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (ఎన్ఏబీఎల్ )' నుంచి గుర్తింపు పొందినట్లు ప్రకటించింది. ఒకేసారి పలు కీలకమైన ఫోరెన్సిక్ విభాగాల్లో ఈ అక్రిడిటేషన్ సాధించిన భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ ప్రయోగశాల తమదేనని సంస్థ వెల్లడించింది.ఈ అక్రిడిటేషన్ డిజిటల్ ఫోరెన్సిక్స్, ఫిజికల్ ఫోరెన్సిక్స్, క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ వంటి కీలక విభాగాలకు వర్తిస్తుందని లక్షర్ ల్యాబ్స్ తెలిపింది. అంతర్జాతీయంగా ఆమోదించబడిన ప్రమాణాలకు అనుగుణంగా ల్యాబొరేటరీలోని పరీక్షా పద్ధతులు, నాణ్యతా నిర్వహణ వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు, పరికరాల క్యాలిబ్రేషన్, సిబ్బంది శాస్త్రీయ నైపుణ్యం వంటి అంశాలను క్షుణ్ణంగా అంచనా వేసిన తర్వాత ఎన్ఏబీఎల్ ఈ గుర్తింపును మంజూరు చేసింది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఫోరెన్సిక్ టెస్టింగ్ కోసం ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్ పొందిన మొట్టమొదటి ల్యాబొరేటరీ కూడా తమదేనని కంపెనీ గర్వంగా ప్రకటించింది.ఈ సందర్భంగా లక్షర్ ఎవిడెన్స్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ సర్వీసెస్ డైరెక్టర్ ఇంద్రజీత్ రాయ్ మాట్లాడుతూ.. "ఇది కేవలం మా సంస్థకు మాత్రమే లభించిన మైలురాయి కాదు, సైన్స్ ద్వారా న్యాయం కోరుకునే ప్రతి పౌరుడికి దక్కిన విజయం. ఇప్పటివరకు ప్రభుత్వ ఏజెన్సీలకే పరిమితమైన అక్రిడిటేషన్ పొందిన ఫోరెన్సిక్ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా ప్రధాన లక్ష్యం. నేటి నుంచి ప్రతి వ్యక్తి, న్యాయవాది, వ్యాపారవేత్త, సంస్థలు.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన