
US BIRTHRIGHT CITIZENSHIP | ఇంటర్నెట్ డెస్క్: విదేశీ వలసదారుల పిల్లల పౌరసత్వాన్ని పరిరక్షిస్తూ అమెరికా సుప్రీం కోర్టు వెలువరించింన తీర్పుపై భారతీయ అమెరికన్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
విదేశీయుల పిల్లలకు పౌరసత్వం నిరాకరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారులు, తాత్కాలిక వీసాలు కలిగిన వారి పిల్లలు అమెరికాలో జన్మిస్తే.. వారిని అమెరికన్లగానే పరిగణించాలని కోర్టు తీర్పునిచ్చింది.
దీనిపై ఇండో అమెరికన్లు హర్షం చేస్తున్నారు. ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చింతన్ పటేల్ మాట్లాడుతూ.. ఈ తీర్పు అమెరికాలోని వలస కుటుంబాలకు గొప్ప భరోసా కల్పించిందన్నారు. ట్రంప్ జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో ప్రత్యక్షంగా ప్రభావితం అయ్యేది భారత్, దక్షిణాసియా వలస కుటుంబాలేనన్నారు. అమెరికాలో శాశ్వత హోదా ఎప్పుడు వస్తుందో తెలియక ముందే వారికి పిల్లలు పుట్టడం సాధారణమేనని పేర్కొన్నారు. అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పు ‘చరిత్రాత్మక విజయం’ అని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ లీడర్ అజయ్ జైన్ బుటోరియా అభివర్ణించారు. దాదాపు 52 లక్షల మంది ఇండో అమెరికన్లలో 12 లక్షల మందికి పైగా ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని ఎఫ్ఐఐడీఎస్ అధ్యక్షుడు ఖండేరావ్ కంద్ తెలిపారు. అమెరికాలో ప్రస్తుతం 6 నుంచి 7 లక్షల మంది హెచ్1బీ వీసాదారులు ఉన్నట్లు తాజా అంచనాలు పేర్కొంటున్నాయి. వారిలో 70 శాతానికి పైగా భారతీయులే ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో హెచ్1బీ వీసాదారులకు ఊరట లభించనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
సముద్ర గర్భంలో సరికొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది.