
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Redmi K90 Ultra Launch News: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ రెడ్మి (Redmi) మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని చైనాలో అత్యంత శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది మార్కెట్లోకి రెడ్మి K90 అల్ట్రా (Redmi K90 Ultra) పేరుతో లాంచ్ అయ్యింది. అయితే, కంపెనీ దీనిని మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. గత ఏడాది వచ్చిన రెడ్మి K80 అల్ట్రా మోడల్‌కు అప్‌గ్రేడ్‌గా ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే ఇది బడ్జెట్ ధరలో అందుబాటులోకి రావడం విశేషం. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రాసెసర్ వివరాలు.. ఈ రెడ్మి K90 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో కళ్లు చెదిరే పర్ఫార్మెన్స్ కోసం సరికొత్త ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (Snapdragon 8 Elite) ప్రాసెసర్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. దీనికి తోడుగా గ్రాఫిక్స్, అద్భుతమైన గేమింగ్ ఎక్స్పీరియన్స్ అందించడానికి కంపెనీ చాలా ప్రత్యేకమైన D2 AI గేమింగ్ గ్రాఫిక్స్ చిప్ సెట్‌ను కూడా వినియోగించిన్నట్లు కంపెనీ క్లైమ్ చేస్తోంది.. ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో చాలా ప్రత్యేకమైన యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకు రావడం విశేషం..
ఆకట్టుకునే డిస్ప్లే, అల్ట్రా బ్రైట్నెస్.. రెడ్మి K90 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ 6.83 అంగుళాల అమోలెడ్ (AMOLED) 1.5K డిస్ప్లేను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇది 165Hz హై రిఫ్రెష్ రేట్‌తో పాటు 480Hz టచ్ సాంప్లింగ్ రేట్, ఏకంగా 3,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్‌తో అందుబాటులోకి రావడం విశేషం.. దీనివల్ల ఎండలో కూడా డిస్ప్లే చాలా స్పష్టంగా కనిపిస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది..
8,550mAh మెగా బ్యాటరీ.. ఈ రెడ్మి K90 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద హైలైట్ దీని శక్తివంతమైన బ్యాటరీగా భావింవచ్చు. ఇందులో కంపెనీ ఏకంగా 8,550mAh భారీ బ్యాటరీని అందించింది.. స్మార్ట్‌ఫోన్ రంగంలోనే ఇది అత్యంత పెద్ద బ్యాటరీలలో ఒకటిగా కంపెనీ చెబుతోంది.. దీనితో పాటు 100W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు 22.5W వైర్డ్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా చార్జ్ అవుతుందని కంపెనీ తెలుపుతోంది..
కెమెరా ఫీచర్స్.. ఫోన్ వెనుక భాగంలో డ్యుయల్ కెమెరా సెటప్ కూడా అందుబాటులో ఉంది.. ఇందులో 50 మెగాపిక్సెల్ లైట్ హంటర్ 800 (Light Hunter 800) ప్రధాన కెమెరాతో పాటు అదనంగా చాలా ప్రత్యేకమైన 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ భాగంలో 20 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు.
కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు.. ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ 5G, Wi-Fi, బ్లూటూత్, GPSతో పాటు BeiDou, NavIC వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తూ వస్తోంది.. అంతేకాకుండా ఇది చాలా తక్కువ బరువు దాదాపు 227 గ్రాములతోనే అందుబాటులోకి రావడం విశేషం.. ఇది ఇప్పుడు బ్లూ, సిల్వర్‌తో పాటు బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పలు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.. దీని బేస్ వేరియంట్ ధర రూ.39,000 నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా హైఎండ్ వేరియంట్ ధర రూ.48,800తో లభించనుంది. అయితే, ఇది త్వరలో చైనా మార్కెట్లలో లభించబోతోంది. అలాగే త్వరలోనే ఈ పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.