
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
July School Holidays 2026: తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకు జూలై నెలలో ఊహించిన విధంగా సెలవులు రానున్నాయి. సాధారణంగా జూలైలో ఎలాంటి పండుగలు, ప్రభుత్వ సెలవులు ఉండవు. కేవలం ఆదివారాలు, రెండో శనివారం మాత్రమే సెలవులు ఉన్నాయి. అయితే తాజాగా జూలై నెలలో రెండో శనివారం సెలవును కూడా ఇటీవలే రద్దు చేయగా.. జూలై నెలలో అత్యధికంగా 27 రోజుల పాటు విద్యాసంస్థల పనిదినాలను ప్రభుత్వం ప్రకటించింది. అయినా తాజాగా బంద్ మరి ఇతర సెలవులు నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడనున్నాయి.
సాధారణంగా జూలై నెల వచ్చిందంటే విద్యార్థులకు ఎలాంటి పండగ హాలిడేలు దొరకవు. కానీ, తెలంగాణలో మాత్రం ఈసారి ఊహించిన విధంగా అదనపు సెలవులు రానున్నాయి. వేరువేరు డిమాండ్లతో బీసీ సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంధువులను పిలుపునివ్వడమే అందుకు కారణంగా తెలుస్తుంది.
జూలై 2న బీసీ సంఘాల రాష్ట్ర వ్యాప్త బంద్ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు రెండు రోజుల నిరసన కార్యక్రమాలు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా జూన్ 30వ తేదీన తరగతుల బహిష్కరణ, కలెక్టరేట్ల ముట్టడి, రాస్తారోకోలు నిర్వహించారు. జులై ఒకటిన విద్యా సంస్థలు ఎలాగో నడిచినప్పటికీ.. జూలై 2న అనగా గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు బంద్‌ను ప్రకటించారు.
జులై 10న వామపక్ష విద్యార్థి సంఘాల బంద్.. బీసీ సంఘాల బంధు ముగిసిన వారం రోజులకే మరో బంద్ తెరపైకి రానుంది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్న పలు సంస్థలు పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు, జులై 10న బంద్‌ను పిలుపునిచ్చాయి. హైదరాబాదులో సమావేశమైన విద్యార్థుల సంఘాల నాయకులు ఈ మేరకు కార్యచరణ రూపొందించి పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు.
జులై 10 శుక్రవారం నాడు విద్యాసంస్థలు స్వచ్చందంగా ఇబ్బందులు పాటించాలని, అవాంఛనీయ పరిస్థితులు రాకుండా యాజమాన్యాలు, తల్లిదండ్రులు సహకరించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. దీనివల్ల విద్యార్థులకు వీకెండ్ కు ముందు మరో అదనపు సెలవు దొరకనుంది.
జూలైలో మరిన్ని సెలవులు వచ్చే అవకాశం ఉందా? బందులతో పార్టీ నెలలో వర్షాల కారణంగా అదనపు సెలవులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ఊపొందుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుఫానుగా మరి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.
గత ఏడాది కూడా భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు వరుసగా అత్యవసర సెలవులు ప్రకటించింది. ఏడాది కూడా అదే పరిస్థితి రిపీట్ అయితే, జులై నెలలో విద్యార్థులకు మరిన్ని సడన్ హాలిడేస్ దొరికే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.