
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
OnePlus N6 Launched In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ OnePlus భారతీయ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్తను అందించింది.. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లను కోరుకునే వినియోగదారులను టార్గెట్ చేస్తూ.. సరికొత్త స్మార్ట్‌ఫోన్ వన్‌ఫ్లస్ N6 (OnePlus N6) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది.. రూ.25,000 లోపు బడ్జెట్లోనే ఏకంగా భారీ 8,000mAh బ్యాటరీతో మొట్టమొదటి OnePlus ఫోన్ ఇదే కావడం విశేషం. మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి అనేక రకాల కొత్త కొత్త హంగులతో ఈ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ధరలు వివరాలు.. భారత మార్కెట్లో వన్‌ప్లస్ N6 రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ అసలు ధర రూ.22,999 కాగా.. బ్యాంక్ ఆఫర్లతో పాటు ప్రైమ్ డే డిస్కౌంట్లతో కలిపి ఎఫెక్టివ్ ధరతో కేవలం రూ.19,999లోపే సొంతం చేసుకోవచ్చు. ఇక రెండవ వేరియంట్ 6GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని అసలు ధర రూ.24,999 కాగా.. ఆఫర్స్ వినియోగించి దీనిని కొనుగోలు చేసేవారికి ఇది కేవలం రూ.21,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రెష్ మింట్ (Light Green)తో పాటు మిడ్నైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తోంది.. జూలై 4వ తేదీ రాత్రి 12:00 గంటల నుంచి అమెజాన్ ఇండియా, ఒన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్లలో దీని ఓపెన్ సేల్ మొదలు కాబోతున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది..
3 రోజుల వరకు బ్యాటరీ లైఫ్.. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ 8,000mAh బ్యాటరీగా కంపెనీ భావిస్తోంది.. ఒకే ఒక్క పూర్తి ఛార్జ్‌తో సాధారణ వినియోగదారులు ఏకంగా మూడు రోజుల పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ను వాడుకోవచ్చని కంపెనీ అధికారంగా ప్రకటించింది. దీనికి తోడు 45W సూపర్‌వూక్ (SuperVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉండడం విశేషం.. ఇది కేవలం 47 నిమిషాల్లోనే 1 శాతం నుంచి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది.. అంతేకాకుండా, గరిష్టంగా 7 సంవత్సరాల పాటు బ్యాటరీ హెల్త్ 80 శాతం పైనే ఉండేలా 1,600 ఛార్జింగ్ సైకిల్స్ లైఫ్‌తో దీనిని డిజైన్ చేసిన్నట్లు సమాచారం. గేమింగ్ ప్రియుల కోసం నేరుగా పవర్ సోర్స్ నుంచి విద్యుత్ అందించే బై-పాస్ ఛార్జింగ్‌తో పాటు 5W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్లను కూడా అందుబాటులో ఉంచడం విశేషం..
డిస్ప్లేతో పాటు అద్భుతమైన ఫీచర్లు.. వన్‌ప్లస్ N6 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. 6.75-ఇంచుల HD+ LCD డిస్ల్పేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1,200 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ను సపోర్ట్‌తో అందుబాటులోకి రావడం విశేషం.. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ ఎంతో అద్భుతంగా పని చేస్తుంది.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వేడిని సులభంగా తగ్గించేందుకు ఇందులో 5,300mm కలిగిన సెగ్మెంట్స్ లార్జెస్ట్ వేపర్ ఛాంబర్ (VC) కూలింగ్ సిస్టమ్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.. మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ (MediaTek Dimensity 6360 Apex) ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్, లేటెస్ట్ ఆక్సిజన్ ఓఎస్ 16 (OxygenOS 16) ఆధారిత ఆండ్రాయిడ్ 16 పై రన్ అవుతుందని కంపెనీ తెలిపింది.. దీనికి 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందిస్తూ వస్తోంది..
AI ఎన్హాన్స్డ్ కెమెరా.. అద్భుతమైన ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాను కూడా అందించింది.. ఇది 60 FPS వేగంతో వీడియో రికార్డింగ్ చేస్తుందని కంపెనీ తెలిపింది.. అలాగే ఫ్రంట్ భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా లభిస్తోంది.. అంతేకాకుండా పెర్ఫెక్ట్ షాట్, అన్‌బ్లర్, ఏఐ ఎరేజర్‌తో పాటు రిఫ్లెక్షన్ ఎరేజర్ వంటి అద్భుతమైన ఏఐ (AI) ఫీచర్లు ఇందులో లభించడం విశేషం.. ఇక ప్రొటెక్షన్ విషయానికి వస్తే.. ఇందులో మిలిటరీ గ్రేడ్ (MIL-STD-810) డ్యూరబిలిటీతో పాటు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్ కూడా అందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.