
భారీబ్యాటరీతో కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Redmi K90 Ultra Launch News: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ రెడ్మి (Redmi) మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని చైనాలో అత్యంత శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది మార్కెట్లోకి రెడ్మి K90 అల్ట్రా (Redmi K90 Ultra) పేరుతో లాంచ్ అయ్యింది. అయితే, కంపెనీ దీనిని మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. గత ఏడాది వచ్చిన రెడ్మి K80 అల్ట్రా మోడల్‌కు అప్‌గ్రేడ్‌గా ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే ఇది బడ్జెట్ ధరలో అందుబాటులోకి రావడం విశేషం. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రాసెసర్ వివరాలు.. ఈ రెడ్మి K90 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో కళ్లు చెదిరే పర్ఫార్మెన్స్ కోసం సరికొత్త ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (Snapdragon 8 Elite) ప్రాసెసర్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. దీనికి తోడుగా గ్రాఫిక్స్, అద్భుతమైన గేమింగ్ ఎక్స్పీరియన్స్ అందించడానికి కంపెనీ చాలా ప్రత్యేకమైన D2 AI గేమింగ్ గ్రాఫిక్స్ చిప్ సెట్‌ను కూడా వినియోగించిన్నట్లు కంపెనీ క్లైమ్ చేస్తోంది.. ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో చాలా ప్రత్యేకమైన యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.. ఆకట్టుకునే డిస్ప్లే, అల్ట్రా బ్రైట్నెస్.. రెడ్మి K90 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ 6.83 అంగుళాల అమోలెడ్ (AMOLED) 1.5K డిస్ప్లేను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇది 165Hz హై రిఫ్రెష్ రేట్‌తో పాటు 480Hz టచ్ సాంప్లింగ్ రేట్, ఏకంగా 3,500

