
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి చేశారు. పశ్చిమ బెంగాల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ దుకాణం వద్ద ఆమెపై కోడిగుడ్లతో ఆందోళనకారులు దాడి చేశారు.
ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించారు. భాజపా కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఇది బెంగాల్ పోలీసుల ఫెయిల్యూర్ అని పేర్కొన్నారు. మహువా మొయిత్రా ఆరోపణలపై భాజపా ఇంకా స్పందించలేదు. మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి |