
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘హైలెస్సొ’ సినిమా నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. నటుడు శివాజీ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది
చిత్ర బృందం. సినిమాలో ఆయన పాత్ర పేరును కూడా వెల్లడించింది.ఈ చిత్రంలో శివాజీ ‘లైలం బాబు’ అనే శక్తిమంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. ‘ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అత్యంత పవర్ఫుల్ పాత్రలో త్వరలో పెద్ద తెరపై కనిపిస్తారు’ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ వజ్ర వారాహి సినిమాస్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇటీవల ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న శివాజీ, ఈ సినిమాలోనూ మరోసారి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.దర్శకుడు ప్రసన్న కుమార్ కోటకు ఇది తొలి చిత్రం. గతేడాది సెప్టెంబర్‌లో సంప్రదాయ పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది సుడిగాలి సుధీర్‌కు హీరోగా ఐదో సినిమా. ఇప్పటికే హీరోయిన్ నక్షా శరణ్ పోషిస్తున్న ‘జెస్సీ’ పాత్రను కూడా చిత్రబృందం పరిచయం చేసింది. నటాషా సింగ్, నక్షా శరణ్ కథానాయికలుగా నటిస్తుండగా, కన్నడ నటి అక్షర గౌడ కీలక పాత్ర పోషిస్తున్నారు. మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను, బేవర దుహిత శరణ్య కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.వ్యవసాయ కుటుంబాల్లో తరచూ వినిపించే స్థానిక పలుకుబడి నుంచే ‘హైలెస్సొ’ అనే టైటిల్‌ను తీసుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. గతంలో విడుదల చేసిన టైటిల్ పోస్టర్లో గ్రామీణ సంప్రదాయాలు, ఆచారాలు, త్యాగం,