
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Doctors Life In ICU: ఆసుపత్రిలో ఐసీయూ(ICU) అనే మాట వినబడితేనే సాధారణంగా రోగుల బంధువుల గుండెల్లో గుబులు ప్రారంభమవుతుంది.. అక్కడికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి వస్తే.. అది ఒక పెద్ద అద్భుతంగా భావిస్తుంటారు. కానీ, ఆ మూసి ఉన్న తలుపుల వెనుక.. యమ ధర్మరాజుతో పోరాడి.. రోగులకు పునర్జన్మ ప్రసాదించే ప్రత్యక్ష దైవాలు మన వైద్యులు.. ప్రతి సెకను క్షణకాలంలా వెళ్లిపోయే, ఆ గదిలో డాక్టర్ల జీవితం ఎలా ఉంటుంది? జాతీయ వైద్యుల దినోత్సవం (Doctors Day 2026) సందర్భంగా ఐసీయూ లోపల వైద్యులు ఎదుర్కొనే సవాళ్లు, వారి అనుభవాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వార్త కథనం ద్వారా తెలుసుకుందాం..
ప్రతి సెకనూ పోరాటమే.. ఐసీయూ గదిలో పగలు, రాత్రి అనే తేడా ఉండదు.. అక్కడ ప్రతి నిమిషం అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. ఏ క్షణంలో ఏ రోగి పరిస్థితి విషమిస్తుందో ఊహించడం కష్టం.. ఎటువంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వైద్యులు గుండె నిబ్బరం కోల్పోకుండా.. సమయస్ఫూర్తితో తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.. ముఖ్యంగా ఒకవైపు రోగి ప్రాణాలు కాపాడే ఒత్తిడి.. మరోవైపు బయట కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూసే కుటుంబ సభ్యులకు మేమున్నాం, ధైర్యంగా ఉండండి.. అని భరోసా ఇవ్వడం వైద్యుల జీవితంలో ఒక భాగమైంది..
ఎప్పటికీ విశ్రాంతి లేని గది.. ముంబైకి చెందిన ప్రముఖ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ పంకజ్ అగర్వాల్ ఐసీయూ లోపలి విశేషాలను వైద్యుల దినోత్సవం సందర్భంగా పంచుకున్నారు.. న్యూరో ఐసీయూలో పనిచేయడం అంత సులువు కాదని.. బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలైన వారు ఇక్కడికి వస్తుంటారని. ఇక్కడ వైద్యులతో పాటు నర్సులు, థెరపిస్ట్‌లు అందరూ కలిసి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతారని... కోమాలోకి వెళ్లిన రోగి ఒక్కసారిగా కళ్లు తెరిచినా లేదా చేతులు, కాళ్లు కదిలించినా వారికి కలిగే ఆనందం చెప్పుకోలేనిదని.. దానిని డబ్బుతో కొలవలేరని తెలిపారు.
క్షణాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు.. మరో సీనియర్ గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రాయ్ పటంకర్ ఇలా మాట్లాడుతూ.. ఐసీయూ డాక్టర్‌కు పెద్ద బాధ్యతలు ఉంటాయని.. కడుపులో విపరీతమైన బ్లీడింగ్ కావడంతో పాటు లివర్ ఫెయిల్ అవ్వడం వంటి అత్యంత ప్రమాదకరమైన కేసులు వచ్చినప్పుడు క్షణాల వ్యవధిలో స్పందించి చికిత్స అందించాలని.. గంటల తరబడి డ్యూటీలు, భావోద్వేగ క్షణాలు ఎన్ని ఉన్నా.. రోగి కోలుకుని మళ్లీ తన సాధారణ జీవితాన్ని గడపాలన్నదే వారి ఏకైక సంకల్పమని ఈ సంద్భరంగా వివరించారు.
వైద్యులకు లభించే అసలైన బహుమతి ఇదే.. అత్యంత ఒత్తిడి, అలసటతో కూడిన ఈ వృత్తిలో వైద్యులకు లభించే అసలైన అవార్డు లేదా బహుమతి ఏంటో తెలుసా? చావు అంచుల్లోకి వెళ్లి వచ్చిన ప్రతి రోగి పూర్తిగా కోలుకుని.. ముఖంలో చిరునవ్వుతో వైద్యులకు చేతులెత్తి నమస్కరిస్తూ.. ఇంటికి వెళ్లే ఆ క్షణమే.. ఆ ఒక్క దృశ్యం వారు పడిన కష్టాన్ని.. అలసటను చిటికెలో మాయం చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.