
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
AP EAPCET Results Released: లక్షలాది మంది ఏపీ విద్యార్థులు ఈ AP EAPCET ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు అధికారికంగా ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. మే 12 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించిన AP EAPCET పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ AP EAPCET పరీక్షల ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదలయ్యాయి. ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (X) ద్వారా ఈ ఫలితాలు విడుదలైనట్లు అధికారికంగా తెలియజేశారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ హాల్ టికెట్ నంబర్‌తో నేరుగా ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థుల కోసం ఈ ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. గతంలో జూన్ 30న ఈ ఫలితాలను విడుదల చేయాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. జూలై 2వ తేదీన ఫలితాలు విడుదల చేస్తామని కూడా అధికారికంగా తెలిపారు. కానీ ఈరోజు జూలై 1వ తేదీనే ఫలితాలను విడుదల చేశారు.
మంత్రి లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 1,82,317 మంది, అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాల్లో 63,546 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. విజయం సాధించిన వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తంగా ఫలితాల్లో 71.65 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
READ ALSO: నేడే ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు.. మధ్యాహ్నం 3 గంటలకు డైరెక్ట్ లింక్ ఓపెన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.