టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్లు ఎప్పుడూ ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలను పెంచుతుంటాయి. ఈ క్రమంలోనే మాస్ మహారాజా రవితేజ , తన విలక్షణమైన యాక్టింగ్‌తో వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు...
టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్లు ఎప్పుడూ ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలను పెంచుతుంటాయి. ఈ క్రమంలోనే మాస్ మహారాజా రవితేజ , తన విలక్షణమైన యాక్టింగ్‌తో వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు కలయికలో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం రూపుదిద్దుకోబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇద్దరు క్రేజీ ఎంటర్టైనర్స్ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే థియేటర్లలో వినోదాల జాతరే అనే చర్చ అప్పుడే మొదలైంది.* థియేటర్లలోకి మళ్లీ వస్తోన్న ఈవీవీ కల్ట్ క్లాసిక్.. ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్‌కు రెడీహసిత్ గోలి దర్శకత్వంలో క్రేజీ వెంచర్!‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ వంటి విభిన్నమైన మరియు వినోదాత్మక చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా ముద్ర వేసుకున్న హసిత్ గోలి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారని టాక్. రవితేజకు ఉండే మాస్ ఎనర్జీని, శ్రీవిష్ణు మార్క్ కామెడీ టైమింగ్‌ను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఆయన ఒక హిలేరియస్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ అగ్ర నిర్మాత దిల్ రాజు తన ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్‌పై నిర్మించనున్నారని, దీనికి ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ 2027 సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ భారీ కామెడీ ఎంటర్టైనర్పై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఈ చిత్రంలో రవితేజ, శ్రీవిష్ణు పాత్రలు కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయని వస్తోన్న వార్తలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.* హీరో అఖిల్ రాజ్‌పై పగబట్టిన డెలివరీ బాయ్... కారుపై రాళ్ల దాడి, ఆరుగురి అరెస్ట్ ఎమోషనల్ డ్రామాగా ‘ఇరుముడి’ఈలోగా రవితేజ తన భిన్నమైన నటనను చూపేందుకు ‘ఇరుముడి’ అనే చిత్రంతో సిద్ధమవుతున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, హృదయానికి హత్తుకునే కథలను తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యంతో పాటు, ఎంతో బలమైన తండ్రీ-కూతుళ్ల సెంటిమెంట్‌తో కూడిన మోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తన కూతురి భవిష్యత్తు కోసం, రక్షణ కోసం ఒక తండ్రిగా రవితేజ తన అలవాట్లను మార్చుకుని అయ్యప్ప దీక్ష తీసుకునే ఒక పవర్ఫుల్ భక్తుడి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా కీలక పాత్ర పోషిస్తోంది. సీనియర్ నటుడు సాయి కుమార్, అజయ్ ఘోష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రం, ఆగస్ట్ 21, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఒకవైపు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో, మరోవైపు ఫుల్ లెంగ్త్ కామెడీ మల్టీస్టారర్‌తో రవితేజ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సందడి సృష్టించడానికి సిద్ధమవుతున్నారు.