
హైదరాబాద్: రూ.వేలకోట్ల కమీషన్ల కోసం బీఆర్ఎస్ హయాంలో హడావుడిగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలినా..
ఇవాళ వరిసాగులో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. బోరు కింద పంటలు పండినా కాళేశ్వరం మహిమ అంటూ ప్రజలను మోసం చేశారని చెప్పారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించిన సభలో రైతు భరోసా నిధుల పంపిణీని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు.
‘‘కేసీఆర్ ఒక్కసారైనా రైతు రుణమాఫీని పూర్తి చేశారా?దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా? ప్రజలకు ఏం చేశారని కేసీఆర్ మళ్లీ రావాలని అనుకుంటారు?పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఇచ్చారా? ఊరూరికి బెల్ట్ షాప్ తెచ్చి తాగుడు కల్చర్ నేర్పించారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే చేసేదేమీ ఉండదు. వరి వేస్తే ఉరే అని బెదిరించి రైతుల పంటను కొనలేదు. ఫామ్‌హౌస్‌లో కూర్చుని భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్లు విన్నారు. దొంగచాటుగా తన ఫోన్లు విన్నారని స్వయంగా కేసీఆర్ కుమార్తె చెప్పారు. పేదల ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామని మోదీ అన్నారు.. వేశారా?ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఆయన చెప్పారు.. ఇచ్చారా?పశ్చిమ బెంగాల్లో ఉడికిన పప్పులు తెలంగాణలో ఉడకవు. అక్కడ గెలిచేందుకు భాజపాకు 15 ఏళ్లు పట్టింది. తెలంగాణలోనూ ఆ పార్టీ గెలవాలంటే మరో 15 ఏళ్లు పడుతుంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చాం. మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నామని ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టారు. మహిళలతో ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయించి యజమానులుగా చేశాం. రెండేళ్లలోనే 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.
ఎల్‌నినో ప్రభావం వల్ల ఈసారి తక్కువ వర్షాలు పడ్డాయి. రైతుల వరిసాగు తగ్గించి మెట్ట పంటలు వేసుకోవాలి. వ్యవసాయం అంటే దండగ కాదు.. పండగ అనుకునేలా చేస్తున్నాం. 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.9వేల కోట్లు వేస్తాం. ఒక్కో సమస్యను చక్కబెట్టుకుంటూ సంక్షేమం కొనసాగిస్తున్నాం. సాగు పనులు మొదలయ్యే నాటికే రైతుభరోసా అందిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రాన్ని 19 మంది ముఖ్యమంత్రులు పాలించారు. వారు చేసిన అప్పు రూ.60వేల కోట్లు మాత్రమే. తెలంగాణ వచ్చాక కేసీఆర్ చేసిన అప్పు రూ.8.11లక్షల కోట్లు. అప్పుల ఊబిలో మునిగిన రాష్ట్రాన్ని నాకు అప్పగించారు. 2023లో సీఎస్ వంటి ఐఏఎస్ అధికారులకే 1న జీతాలు ఇవ్వలేని పరిస్థితి. కొన్నేళ్లుగా వాయిదాల పద్ధతిలో వస్తున్నాయని అధికారులు చెప్పారు. బడి పిల్లల తిండి బిల్లులు కూడా రూ.వేల కోట్ల బకాయిలు పెట్టారు. సర్పంచ్ల బిల్లులు రూ.వేలకోట్లు పెండింగ్ పెడితే.. వారు ఇప్పుడు ధర్నాలు చేశారు. బిల్లులు పెండింగ్ పెట్టింది కేసీఆర్.. ఆ బద్నాం మోసింది నేను. కేసీఆర్ చేసిన అప్పులతో దిల్లీలో కూడా పరువు పోయే పరిస్థితి వచ్చింది’’ అని రేవంత్ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్ రామ్‌నగర్‌కు చెందిన విష్ణు ప్రసాద్ వృత్తిపరంగా చిన్నపిల్లల వైద్యుడు.