
Shiva Jyothi : ఫ్యామిలీతో కలిసి యాంకర్ శివజ్యోతి వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..
బిగ్ బాస్ ఫేమ్, యాంకర్ శివజ్యోతి నేడు వినాయకచవితి సందర్భంగా తన భర్త, కూతురుతో కలిసి వినాయకుడికి పూజలు నిర్వహించి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

బిగ్ బాస్ ఫేమ్, యాంకర్ శివజ్యోతి నేడు వినాయకచవితి సందర్భంగా తన భర్త, కూతురుతో కలిసి వినాయకుడికి పూజలు నిర్వహించి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బుల్లితెర బ్యూటీలు తాజాగా షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ విశేషాలు చూద్దాం

ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో యాంకర్ శివజ్యోతి (Shiva Jyothi) కూడా తన ఫోటోలను 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Shiva Rajkumar | హిందీ జాతీయ భాష అంటూ వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన నటుడు శివరాజ్‌కుమార్

Shiva Rajkumar | హిందీ జాతీయ భాష అంటూ శివరాజ్‌కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు: నెట్టింట వ్యతిరేకత!

మాస్ మహారాజా రవితేజ, ప్రియ భవానీ శంకర్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇరుముడి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21 న రిలీజ్ అయ్యి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మాస్ మహారాజా రవితేజ (Raviteja), ప్రియ భవానీ శంకర్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇరుముడి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21 న రిలీజ్ అయ్యి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా 200 కోట్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ సక్సెస్ ని మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి మరీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సక్సెస్ మీట్ లో శివ నిర్వాణకు ఇరుముడి సీక్వెల్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. మల్లెపూల పల్లకి సాంగ్ లో రామ్ చరణ్ కనిపిస్తాడు అని రూమర్ వచ్చింది. రామ్ చరణ్ క్రమ తప్పకుండా అయ్యప్ప మాల ధరిస్తారని, అందుకే ఫ్యాన్స్ ఆయన ఇరుముడి సీక్వెల్లో నటించే అవకాశం ఉందేమో అని ఆశించడం సహజమని పాత్రికేయులు పేర్కొనగా, దానికి శివ నిర్వాణ స్పందిస్తూ.. 'అలాంటి ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుండటం చూసి నేనే షాక్ అయ్యాను. రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోతో పనిచేసే అవకాశం వస్తే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. అయితే ఇరుముడి కథ చాలా సహజంగా పుట్టుకొచ్చిన ఆలోచన. కేవలం సినిమా హిట్ అయిందనే కారణంతో వెంటనే సీక్వెల్స్ ప్లాన్ చేయలేము. ఆర్గానిక్‌గా అంతకంటే అద్భుతమైన పాయింట్ దొరికితే ఖచ్చితంగా ఆలోచిస్తాను అని పేర్కొన్నాడు. అలాగే సినిమాలో దైవత్వాన్ని చూపించిన తీరుపై మాట్లాడుతూ, కేవలం దేవుడి ఎలిమెంట్‌ను క్యాష్ చేసుకోవడానికి తాను ప్రయత్నించలేదని

‘ఇరుముడి’ సినిమాలో చూపించిన గవర్నమెంట్ స్కూల్ సన్నివేశాలు, యూనిఫామ్‌పై సోషల్ మీడియాలో కొంత చర్చ, అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో దర్శకుడు శివ నిర్వాణ ఈ వేదికపై పూర్తి స్పష్టతనిచ్చారు. మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) రూపొందించిన ‘ఇరుముడి’ (Irumudi) చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ మార్కును దాటి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం బుధవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. అయితే, ఈ సినిమాలో చూపించిన గవర్నమెంట్ స్కూల్ సన్నివేశాలు, యూనిఫామ్‌పై సోషల్ మీడియాలో కొంత చర్చ, అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో దర్శకుడు శివ నిర్వాణ ఈ వేదికపై పూర్తి స్పష్టతనిచ్చారు. ఇటీవల తిరుపతి పర్యటనలో తనకు ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను ఈ సందర్భంగా శివ నిర్వాణ గుర్తుచేసుకున్నారు. ‘‘రెండు రోజుల క్రితం నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాను. అక్కడ ఓ మహిళ పరుగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. ‘సార్.. నేను గవర్నమెంట్ టీచర్ని.. మీరు సినిమా అంతా చాలా బాగా తీశారు కానీ, ప్రభుత్వ పాఠశాల సీన్లు నన్ను కాస్త ఇబ్బంది పెట్టాయి. సేమ్ యూనిఫామ్‌లు, సేమ్ టీచర్లను అలా ఎందుకు చూపించారు?’ అని అడిగారు. అప్పుడు నేను ఆమెకు సినిమా ప్రారంభ సన్నివేశాలను గుర్తుచేశాను’’ అని తెలిపారు. ‘‘సినిమా ప్రారంభంలోనే హీరో ఊరైన పొల్లూరులో ఎలిమెంటరీ స్కూల్లో ఎంతో అంకితభావం కలిగిన ఒక మంచి ప్రభుత్వ ఉపాధ్యాయుడిని చూపించాం. ఆయన పిల్లలను ఎంత బాగా చూసుకుంటారో, ఎంత చక్కగా మాట్లాడతారో అందరూ చూశారు. సినిమా క్లైమాక్స్ ఎండ్ సీన్లో కూడా పాపను తిరిగి ఆయనే తీసుకుంటారు. ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లపై

మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. విడుదలైన కేవలం 12 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది. భావోద్వేగ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన 'ఇరుముడి', కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్కును చేరుకుంది. రవితేజ మార్క్ ఎనర్జీ, శివ నిర్వాణ శైలిలో సాగే కుటుంబ కథాంశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సినిమాకు బ్రహ్మరథం పడుతుండటంతో వసూళ్ల ప్రవాహం కొనసాగుతోంది.ఈ అరుదైన ఘనతను పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారని, 'ఇరుముడి' ఒక జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని నిర్మాతలు తమ ప్రకటనలో ఆనందం వ్యక్తం చేశారు

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. పవర్ ఫుల్ ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల డ్రామా, భక్తి రసంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర ముఖ్య పాత్రలు పోషించారు. చిన్న, పెద్ద, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తూ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్న మూవీ 'ఇరుముడి'. రీసెంట్ టైమ్స్‌లో సరైన హిట్ లేక రవితేజ ఫ్యాన్స్ నిరాశలో ఉన్న సమయంలో, డైరెక్టర్ శివ నిర్వాణ ఒక అద్భుతమైన ఎమోషనల్ అండ్ డివోషనల్ కథతో ముందుకు వచ్చారు. తండ్రీ కూతుళ్ల అనుబంధం, అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యం మిక్స్ చేసి చెప్పిన ఈ కథ ప్రేక్షకులకు హత్తుకుంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన 'ఇరుముడి', బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఎంత పెద్ద కాంపిటీషన్ ఉన్నా, కొన్ని చోట్ల థియేటర్ల సమస్యలు ఎదురైనా, ఆడియన్స్ ఆదరణ ముందు అవన్నీ తలవంచక తప్పలేదు. పిల్లలు, పెద్దలు, యూత్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ 'ఇరుముడి'ని తమ సొంత సినిమాగా భావించి థియేటర్లలో పండుగ చేసుకుంటున్నారు. ఆ ఫలితంగానే 'ఇరుముడి' మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 200 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకొని, రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. యశ్ వివాదంలో ఆర్జీవీ ఎంట్రీ: అహంకారం ఉన్నవారే అలా కామెంట్ చేస్తారు.!

సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ జైలర్ 2 రిలీజ్ పై గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ చాలా సైలెంట్ గా సాగుతుండటం, రీషూట్స్ జరుగుతున్నాయనే పుకార్లు రావడంతో పాటు దసరా రేసులో తెలుగు సినిమాలు కూడా పోటీ పడుతుండటంతో జైలర్ 2 వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ పై చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. సినిమా పోస్ట్‌పోన్ అవుతుందంటూ జరుగుతున్న అసత్య ప్రచారాలకు సన్ పిక్చర్స్ తమదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టింది. చిత్ర యూనిట్ అఫిషియల్ గా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ, సినిమాను 2026 అక్టోబర్ 15నే గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ విడుదల చేసిన లేటెస్ట్ పిక్చర్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. టైగర్ ముత్తువేల్ పాండియన్ లుక్ లో రజనీకాంత్ చేతిలో తుపాకీ పట్టుకుని చాలా మాస్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ పై మొదటి భాగంలోని సూపర్ హిట్ డైలాగ్ 'అలప్పారై సెలబ్రేషన్స్' లైన్ తో పాటు అక్టోబర్ 15 రిలీజ్ డేట్ ను స్పష్టంగా మెన్షన్ చేశారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మొదటి భాగాన్ని మించేలా పార్ట్ 2 ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ, యోగి బాబు, మిర్నా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, ఎస్. జె. సూర్య కీలక పాత్రల్లో
మాస్ మహారాజా రవితేజ , సున్నితమైన భావోద్వేగాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భావోద్వేగ భక్తిరస చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే అద్భుతమైన ప్రజాదరణను దక్కించుకుంది. రవితేజ మార్క్ ఎనర్జీకి తోడు, కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసే శివ నిర్వాణ కథా కథనాలు సినిమాను బ్లాక్‌బస్టర్ దిశగా నడిపించాయి. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటి రవితేజ కెరీర్లోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ఈ చిత్రం తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది.12 రోజుల్లోనే రూ. 200 కోట్లు ఈ అప్రతిహత విజయ యాత్రను కొనసాగిస్తూ కేవలం 12 రోజుల్లోనే 'ఇరుముడి' ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఈ ఘనతను పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, యువత నుంచి కుటుంబ ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరూ థియేటర్లలో ఈ చిత్రాన్ని ఒక ఉత్సవంలా ఆదరిస్తున్నారని మేకర్స్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో ఇది జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు.సడెన్‌గా హాస్పిటల్లో చేరిన మమితా బైజు... డాక్టర్లు ఏం చెబుతున్నారంటేనైజాంలో కాసుల వర్షంఆంధ్రా, సీడెడ్ ఏరియాలతో పాటు ఓవర్సీస్లోనూ 'ఇరుముడి' అద్భుతమైన కలెక్షన్లు రాబడుతున్నప్పటికీ నైజాం మార్కెట్లో మాత్రం ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం ఊహకందని రీతిలో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజూ అద్భుతమైన వసూళ్లను రాబడుతూ రవితేజ కెరీర్లోనే నైజాం ఏరియాలో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా దూసుకుపోతోంది. 12వ రోజైన మంగళవారం ఈ చిత్రం నైజాంలో రూ.2.51 కోట్ల గ్రాస్, రూ.1.19 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఓవరాల్‌గా చూసుకుంటే

మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద తన అసలైన స్టామినాను చూపిస్తూ రికార్డుల వేట కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన నుంచి వచ్చిన ‘ఇరుముడి’ పోస్టర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) బాక్సాఫీస్ వద్ద తన అసలైన స్టామినాను చూపిస్తూ రికార్డుల వేట కొనసాగిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌తో థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ మార్కును విజయవంతంగా దాటేసి ‘జనరేషనల్ బ్లాక్‌బస్టర్’గా నిలిచింది. రవితేజ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచి సరికొత్త మైలురాయిని అందుకుంది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం విడుదల చేసిన సరికొత్త స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణ ఫోటో ఫ్రేమ్ రూపంలో డిజైన్ చేసిన ఈ పోస్టర్లో.. మధ్యలో బేబి నక్షత్రను పులిపై కూర్చున్న శ్రీ మణికంఠుడి (బాల అయ్యప్ప) అవతారంలో చూపించారు. ఆమెకు ఇరువైపులా రవితేజ, ప్రియా భవానీ శంకర్ దంపతులుగా చిరునవ్వులు చిందిస్తూ నిలబడి ఉండటం ఆకట్టుకుంటోంది. సినిమాలోని ఫ్యామిలీ బాండింగ్, ఎమోషన్స్‌తో పాటు పోస్టర్లో మణికంఠుడి రూపం సరికొత్తగా కుదరడంతో అభిమానులు ఈ పోస్టర్‌ను తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, భావోద్వేగాలతో కూడిన కథనం సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత చేరువ చేశాయి. పోటీగా ఇతర భారీ చిత్రాలు ఉన్నప్పటికీ ఏమాత్రం తగ్గకుండా రవితేజ తన మార్క్ ఎనర్జీతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. 200 కోట్ల మార్కును దాటినప్పటికీ ఇప్పటికీ థియేటర్లలో స్ట్రాంగ్ ఆక్యుపెన్సీతో ‘ఇరుముడి’ తన

మాస్ మహారాజ రవితేజ, నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్, హరిహర సుతుడు అయ్యప్ప ల 'ఇరుముడి' 200 కోట్ల రూపాయిలు చేరుకోవడానికి రెడీ అవుతుంది. తాజాగా ఇరుముడి నుంచి సరికొత్త డివోషనల్ వీడియో సాంగ్ 'కార్తీక మాసం' విడుదలై అభిమానులని ప్రేక్షకులని ఎంతోగానో ఆకట్టుకుంటోంది. స్వామి అయ్యప్ప భక్తి పారవశ్యాన్ని, మండల దీక్షా నియమాలను ఎంతో లోతుగా ఆవిష్కరించిన ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంది. ఈ అద్భుతమైన గీతానికి దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా సాహిత్యాన్ని అందించగా, జి. వి. ప్రకాష్ కుమార్ తో కలిసి శివ నిర్వాణ ఆలపించాడు 4 నిమిషాల 5 సెకన్ల నిడివితో ఉండగా నేరుగా శబరిమల భక్తి లోకంలోకి తీసుకెళ్తుంది. "ఇది మరి కార్తీక మాసం స్వామి... తలపై చన్నీళ్ల స్నానం కాని మనసే మరింత భద్రం స్వామి" అంటూ సాగే లిరిక్స్ దీక్షా ధారుల జీవితాన్ని, శారీరక కష్టాలను దాటి పొందే ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రతిబింబిస్తాయి. భక్తులు పడే తపన, చలిలో ఉదయాన్నే చేసే స్నానాలు, కటిక నేలపై పడుకునే నిరాడంబరమైన జీవనశైలిని చాలా సహజంగా ఈ పాటలో వర్ణించారు. పాటలోని అతి ముఖ్యమైన అంతరార్థం ఏమిటంటే— "కనిపించని శత్రువు కాదు, యుద్ధం కాదీ మండల దీక్ష... నాతోటి నేనే చేసే యుద్ధమే ఈ దీక్ష". బయటి సమాజంతో లేదా శత్రువులతో చేసే పోరాటం కాదు మండల దీక్ష, మనలోని అహంకారాలు, ద్వేషాలు, కామక్రోధాలపై మనతో మనమే చేసే అంతర్యుద్ధం అనే గొప్ప సందేశాన్ని ఈ పాటకు శివ నిర్వాణ అందించారు. అలాగే "నేను అంటే నువ్వే అంటూ స్వామి పదవి ఇచ్చావు... ద్వేషాల్ని దూరం చేసి వర్ణాన్ని ఒక్కటి చేసి" అని అయ్యప్ప దీక్షలోని సమభావనను ఎత్తిచూపారు. కులమతాల భేదం లేకుండా, చిన్నపెద్ద తారతమ్యం లేకుండా నల్లటి దుస్తులు ధరించి ప్రతి ఒక్కరినీ 'స్వామి' అని పిలుచుకునే ఆచారాన్ని

Dakshinamurthy Worship : కేవలం అక్షర జ్ఞానమే కాదు, జీవితంలో ఏ రంగంలోనైనా పూర్ణ విజయాన్ని, ఉన్నత స్థాయిని సాధించాలన్నా దక్షిణామూర్తి ఆరాధన అత్యంత విశిష్టమైనది. పరమశివుని జ్ఞాన అవతారమైన దక్షిణామూర్తి సకల విద్యలకు, సమర్థతకు, సనాతన గురు పరంపరకు ఆద్యుడు. మౌన వ్యాఖ్యానంతోనే సనకాది మునుల సంశయాలను పటాపంచలు చేసి జ్ఞానోదయం కలిగించిన ఈ దివ్య స్వరూపం వెనుక ఉన్న నిగూఢ అంతరార్థం, మంత్రశాస్త్రం విశ్లేషించిన 16 దక్షిణామూర్తి స్వరూపాల ప్రాశస్త్యం నేటి సమాజానికి ఎంతో ఆవశ్యకం. మౌన వ్యాఖ్యానం... సనకాది ఋషుల బ్రహ్మజ్ఞానం బ్రహ్మదేవుని మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు నలుగురు ఋషులు బ్రహ్మజ్ఞానం కోసం ఎంతగానో తపస్సు చేశారు. తమ సందేహ నివృత్తికై పరమేశ్వరుని ఆశ్రయించగా, స్వామివారు ఒక మర్రిచెట్టు కింద యోగభంగిమలో ఆసీనులయ్యారు. ఎటువంటి శబ్దాలు, ప్రవచనాలు లేకుండా నిశ్శబ్దంగా 'మౌన వ్యాఖ్యానం' ద్వారానే ఆ నలుగురు మహర్షులకు పరిపూర్ణ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు. అనుభవ పూర్వకమైన ఆ దివ్య జ్ఞానానికి దక్షిణామూర్తి ప్రతీకగా నిలిచారు. దక్షిణామూర్తి అనగా 'దక్షిణ' అనగా సర్వ సమర్థత కలిగినవాడు అని అర్థం. దుఃఖాలకు మూలకారణమైన అజ్ఞానాన్ని నాశనం చేసే పరమ దయా దాక్షిణ్యమూర్తి ఈయన. సాంబశివుడికి ఎడమవైపు పార్వతీదేవి లేని ఏకైక జ్ఞాన స్వరూపమిది. ఒక కాలుతో అపస్మార పురుషుడిని అంటే అజ్ఞాన రాక్షసుడిని తొక్కిపట్టి, మరో కాలును మడిచి, అక్షమాల, పుస్తకం, జ్ఞానముద్ర, వీణను ధరించి దర్శనమిస్తారు. తత్వదృష్టిలో దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి ఒక్కటే అయినప్పటికీ, ఉపాసనా, వ్యవహార దృష్టిలో విభిన్న రూపాలుగా భావిస్తారు. ఇదే 'భిన్నత్వంలో ఏకత్వం'. మంత్రశాస్త్రం ... 16 దక్షిణామూర్తి స్వరూపాలు మంత్రశాస్త్రం, ఆగమ ప్రమాణాల ప్రకారం దక్షిణామూర్తి స్వామివారు 16 దివ్య రూపాల్లో ఉపాసకులకు ఫలాన్ని అందిస్తారు. శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి¸ హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి

రవితేజకి సరైన హిట్ పడితే ఎలా ఉంటుందో నిరూపించింది `ఇరుముడి` మూవీ. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ గత నెల 21న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటించగా, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, సాయికుమార్, రమేష్ ఇందిరా, స్వసిక విజయ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. అయ్యప్ప భక్తుల కథతో, తండ్రీకూతుళ్ల బాండింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. అయ్యప్ప భక్తుల కథ, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో ఈ మూవీని చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. దీంతో ఇప్పటికీ దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. `ఇరుముడి` మూవీ రవితేజకి అదిరిపోయే విజయాన్ని అందించారు. ఆయనకు సరైన హిట్ పడితే బాక్సాఫీసు వద్ద రచ్చ ఎలా ఉంటుందో ఈ మూవీ చూపిస్తోంది. ఇది ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్లింది. వీకెండ్లోనే కాదు వీక్ డేస్‌లోనూ ఊహించని వసూళ్లని రాబట్టడం విశేషం. మంగళవారం(12వ రోజు) కూడా బాక్సాఫీసు వద్ద రవితేజ దుమ్ములేపాడు. ఈ చిత్రానికి ఇండియాలో రూ.5.90కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్లో యాభై లక్షలు రాబట్టింది. మొత్తంగా 12 రోజుల్లో ఈ మూవీ రూ.186.50కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. అయితే ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద సాలిడ్‌గా రన్ కావడం మరో విశేషం. ఓ వైపు టాక్సిక్ మూవీ థియేటర్లో ఆడుతోంది. అంతో ఇంతో సందడి చేస్తోంది. ఆ పోటీని తట్టుకొని కూడా ఈ చిత్రానికి ఇంతటి భారీ వసూళ్లు రావడం విశేషంగా చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి అయిన బడ్జెట్ రూ.40కోట్లు. థియేట్రికల్‌గా అయిన బిజినెస్ రూ.20 కోట్లు. రూ.21కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన ఈ మూవీ రెండు రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. మూడో రోజుతోనే లాభాల్లోకి వెళ్లింది. నిర్మాతలకు

పర్వతారోహణ చేయాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. కానీ కెరీర్ బిజీ, కుటుంబ బాధ్యతలు, ఇది సరైన వయసు కాదేమోనన్న సందిగ్ధత.. ఇలా వివిధ కారణాల వల్ల కొంతమంది ఈ కలను నెరవేర్చుకోలేకపోతారు. నిజానికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవేవీ అడ్డు కాదంటోంది శివానీ మెహ్రోత్రా. పర్వతారోహణ చేయాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. కానీ కెరీర్ బిజీ, కుటుంబ బాధ్యతలు, ఇది సరైన వయసు కాదేమోనన్న సందిగ్ధత.. ఇలా వివిధ కారణాల వల్ల కొంతమంది ఈ కలను నెరవేర్చుకోలేకపోతారు. నిజానికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవేవీ అడ్డు కాదంటోంది శివానీ మెహ్రోత్రా. నాలుగు పదుల వయసుకి చేరువలో ఉన్నప్పుడు మౌంటెనీరింగ్‌పై ఆసక్తి పెంచుకున్న ఆమె.. ఇటీవలే తన 43 ఏళ్ల వయసులో యూరప్‌లోనే ఎత్తైన పర్వతం మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించింది. తద్వారా ‘వయసు సంఖ్య మాత్రమే’ అని నిరూపించి వార్తల్లో నిలిచింది. మరి, వృత్తిరీత్యా యోగా టీచర్ అయిన శివానీకి పర్వతాహరోణ చేయాలన్న ఆలోచన ఎలా కలిగింది? తెలుసుకుందాం రండి.. నిద్ర లేచింది మొదలు ఇంట్లో బాధ్యతలు, కెరీర్ బిజీలో పడిపోయి.. తమ అభిరుచుల్ని సైతం పక్కన పెట్టేస్తుంటారు చాలామంది మహిళలు. కానీ కొందరు మాత్రం కాస్త లేటు వయసులోనైనా వీటిపై దృష్టి పెడుతూ తమను తాము నిరూపించుకుంటారు.. ఇతరులకు స్ఫూర్తినిస్తుంటారు. శివానీ కూడా ఇదే కోవకు చెందుతుంది. ఉత్తరప్రదేశ్ సీతాపుర్‌కు చెందిన ఆమె.. వివాహం తర్వాత లక్నోలో స్థిరపడింది. పెళ్లయ్యాక గృహిణిగా, అమ్మగా బిజీగా మారిపోయింది. స్వతహాగా ఫిట్నెస్ లవర్ అయిన ఆమె.. సాహసాలు చేయడానికీ మక్కువ చూపుతుంది. ఈ ఇష్టమే తనను పర్వతారోహణ వైపు అడుగులేసేలా చేసిందంటోంది శివానీ. ‘ఓసారి స్నేహితులతో కలిసి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి ట్రెక్కింగ్‌కి వెళ్లా. అప్పుడే నాకు పర్వతారోహణ పరిచయమైంది. ఈ అనుభవాన్ని ఎంతో ఎంజాయ్ చేశా. ఇక ముందూ మౌంటెనీరింగ్ చేయాలన్న కోరిక నాలో మొదలైంది. ఈ క్రమంలోనే కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు

మాస్ మహారాజా రవితేజ ఇటీవల `ఇరుముడి` మూవీతో విజయాన్ని అందుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయనకు విజయం దక్కింది. ఆల్మోస్ట్ `ధమాఖా` తర్వాత రవితేజ హిట్ అందుకున్నాడని చెప్పొచ్చు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన `ఇరుముడి` మూవీ ఇప్పుడు బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. రెండో వారంలో కూడా దీనికి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. వీక్ డేస్‌లోనూ డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి. `టాక్సిక్` ప్రభావం ఉన్నా కూడా రవితేజ బాక్సాఫీసు వద్ద సత్తా చాటడం విశేషం. ఇక `ఇరుముడి` మూవీ సోమవారం రూ.6.60కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి రూ.179.10కోట్లు రావడం విశేషం. ఇది రెండు వందల కోట్ల దిశగా వెళ్తుంది. అంటే ఈ సినిమా ద్వారా సుమారు రూ.90కోట్ల షేర్ వచ్చింది. మూవీకి అయిన బడ్జెట్ రూ.40కోట్లు అయితే, థియేట్రికల్ బిజినెస్ రూ.20కోట్లు మాత్రమే. దీంతో ఈ మూవీ ద్వారా మేకర్స్ సుమారు రూ.70కోట్ల లాభాలను సాధించారు. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో లాభాలు పొందిన సినిమా ఇదే కావడం విశేషం. చిరంజీవి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ తర్వాత `ఇరుముడి` అత్యధిక లాభాలు పొందిన సినిమాగా నిలవడం విశేషం. అయితే `ఇరుముడి` మూవీకి రవితేజ తీసుకున్న పారితోషికం ఎంతనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకి రవితేజ తీసుకున్న పారితోషికం కేవలం రూ.8కోట్లు అని సమాచారం. సినిమా విడుదలకు ముందు ఒప్పుకున్న పారితోషికం ఇది. అయితే ఆయనకు పారితోషికం కింద నైజాం రైట్స్ ని ఇచ్చారు నిర్మాతలు. దీంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లని రాబట్టింది. నైజాంలో అదిరిపోయేలా కలెక్షన్లని రాబట్టింది. ఈ లెక్కన చూస్తే రవితేజకి ఓవరాల్‌గా రూ.50-60కోట్లు అందుకున్నారు. అంటే ఈ మూవీకి ఆయన పారితోషికం రూ.60కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇరుముడి మూవీలో నటించిన ఇతర కాస్టింగ్ పారితోషికాల వివరాలు చూస్తే, ఇందులో హీరోయిన్గా నటించిన ప్రియా భవానీ
మణుగూరు గ్యాంగ్‌వార్ హత్య కేసు ఛేదింపు.. 27 మంది నిందితులు అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మణుగూరు నేతాజీ గ్రౌండ్లో ఈ నెల 27న జరిగిన శివ హత్య కేసులో మొత్తం 27 మందిని నిందితులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రాఖీ పండుగ కోసం ఇంటికి వచ్చిన శివను, ఎం.కే గ్యాంగ్ సభ్యులు మాట్లాడాలని చెప్పి నేతాజీ గ్రౌండ్‌కు పిలిచారు. అక్కడ ఇరువర్గాల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. గ్రూప్‌లోని సభ్యులు విచక్షణారహితంగా దాడి చేయడంతో శివ ప్రాణాలు కోల్పోయాడు. నిందితులంతా మణుగూరు స్థానికులేనని, కేవలం పార్టీల పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. అయితే, నిందితులు గంజాయి వంటి మాదకద్రవ్యాలు తీసుకుంటున్నట్లు విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదని డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వార్తకు సంబంధించిన

ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కూర్మ అవతార్’. హర్షవర్ధన్ కడియాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ (Shivaraj kumar) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కూర్మ అవతార్’ (Kurma avatar). హర్షవర్ధన్ కడియాల దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, సాయికుమార్, రాజ్ తరుణ్, శివాజీ, అతిరా రాజ్, పూజిత కె. తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కె.సేవిత, పూజిత కె. నిర్మాతలు. సోమవారం హైదరాబాద్‌లో ‘కూర్మ అవతార్’ టీజర్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీజర్‌ను వీక్షించిన అనంతరం ఆయన చిత్రబృందాన్ని అభినందించారు. దర్శకుడు హర్ష తనదైన విజన్‌తో సినిమాను రూపొందించినట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. తెలుగులో బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ఇటీవల వచ్చిన ‘పెద్ది’ చిత్రాల్లో మంచి పాత్రలు దక్కాయి. దర్శకుడు హర్ష ‘కూర్మ అవతార్’ కథను చెప్పగానే ఎంతో నచ్చి ఈ సినిమా చేస్తున్నా. కథ నచ్చితే దర్శకుడు కొత్తవారా, అనుభవం ఉన్నవారా అనే విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోను. మంచి కథ అయితే తప్పకుండా చేయడానికి ముందుకొస్తా. హర్ష ఎంతో గొప్ప విజన్‌తో ‘కూర్మ అవతార్’ను తెరకెక్కించారు. ఈ సినిమా నాకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది. సాయికుమార్‌తో కలిసి గతంలో ఎన్నో సినిమాలు చేశాను. మరోసారి ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది’’ అని శివరాజ్ కుమార్ అన్నారు. సాయికుమార్ మాట్లాడుతూ 'శివరాజ్ కుమార్ కుటుంబంతో ఎంతోకాలంగా అనుబంధం ఉంది. ఆయన కుటుంబ సభ్యులు మంచి మనసున్న వారు. శివరాజ్ కుమార్‌తో కలిసి ఇప్పటికే పలు చిత్రాల్లో నటించాను. ‘కూర్మ అవతార్’లో మరోసారి కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది' అన్నారు. నన్ను కూడా మీ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్: దుల్కర్ నిర్మాత సి. కల్యాణ్ కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్లో
కూర్మ అవతార్ టీజర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ నిర్మాత దిల్ రాజు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో హర్ష వర్ధన్ కడియాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కూర్మ అవతార్'. నరేంద్ర కొండ సమర్పణలో పంచవక్త్ర పిక్చర్స్ & రుక్వీణ స్టూడియోస్ బ్యానర్స్ పై పూజిత, సేవిత నిర్మిస్తున్నారు. రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్‌కుమార్, సాయి కుమార్, శివాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టీజర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. డైరెక్టర్ హర్ష సర్ప్రైజ్ చేశాడు. ఈ సినిమా ‘నరసింహ అవతార్’, ‘ఇరుముడి’ సినిమాల్లాగే పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. విజువల్స్ చూస్తుంటే ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. అలాగే రాజ్ తరుణ్ గారు, వరలక్ష్మి శరత్‌కుమార్ గారు, టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సాయికుమార్ గారు ‘ఇరుముడి’ సినిమాలో మొన్ననే గురుస్వామిగా ఈ రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించారు. ఆ సినిమా మా అందరిలో చాలా గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. ప్రేక్షకులు అలా తండోపతండాలుగా థియేటర్స్‌కి వస్తుంటే మా అందరికీ ధైర్యం వస్తుంది. ‘ఇరుముడి’ సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఒక మంచి ఎనర్జీ ఇచ్చింది. శివ రాజ్‌కుమార్ గారు ఒక సూపర్‌స్టార్. మొన్ననే పెద్దితో సర్ప్రైజ్ చేశారు. మొన్న ఒక కథ విన్నప్పుడు, ‘ఆ కథ కోసం శివ రాజ్‌కుమార్ గారి దగ్గరికి వెళ్ళండి’ అని మా టీమ్‌కి చెప్పాను. తొందరలోనే వాళ్లు అప్రోచ్ అవుతారు. ఈ టీజర్‌లాగే రెండు గంటల సినిమా కూడా

రవితేజ హీరోగా నటించిన ఇరుముడి చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ టాలీవుడ్ పరిశ్రమ మొత్తానికి కొత్త ఊపిరి పోసిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనియాడారు. రాజ్‌తరుణ్, శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కూర్మావతార్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్లకు జనం తండోపతండాలుగా తరలివస్తుంటేనే సినిమాలు తీసే నిర్మతలకు, నటీనటులకు కొండంత ధైర్యం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సినిమాలో గురుస్వామి పాత్రలో జీవించిన సీనియర్ నటుడు సాయికుమార్ నటనపై ఆయన ప్రత్యేకంగా ప్రశంసలు గుప్పించారు. ఆగస్టు 21న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన ఇరుముడి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మైండ్ బ్లాకింగ్ కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ అండ్ భక్తిరస డ్రామా ప్రేక్షకుల హృదయాలను బలంగా తాకింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో తండ్రి కూతుళ్ల అనుబంధంతో పాటు అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సినిమా తెచ్చిపెట్టిన పాజిటివ్ వైబ్ కేవలం ఒక చిత్ర బృందానికే కాకుండా మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంతో ప్లస్ అయిందని దిల్ రాజు విశ్లేషించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ రేసులో ఇరుముడి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీంతో ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ సినిమా భారతదేశంలో నెట్ వసూళ్ల రూపంలో ఏకంగా రూ. 129.55 కోట్లు సాధించింది. ఇదిలా ఉండగా ఇండియా గ్రాస్ పరంగా రూ. 150 కోట్ల మార్కును చాలా సులువుగా దాటేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. వరల్డ్‌వైడ్‌గా చూస్తే ఈ చిత్రం రూ. 170 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను సాధించి రవితేజ కెరీర్లోనే మైలురాయిగా నిలిచింది. ఈ విజయం ఒకవైపు జోరుగా కొనసాగుతుండగా మరోవైపు
కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘కూర్మావతార్’. హర్షవర్ధన్ కడియాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, వరలక్ష్మి శరత్‌కుమార్, రాజ్‌తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నరేంద్ర కొండ సమర్పణలో పంచవక్త్ర పిక్చర్స్–రుక్వీణ స్టూడియోస్‌పై పూజిత, సేవిత నిర్మిస్తున్నారు. సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత ‘దిల్’ రాజు . ‘కూర్మావతార్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు 'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు) AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే.. సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..! కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

‘ఇరుముడి’ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ చేసే సినిమాకు సంబంధించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన తదుపరి చిత్రంలో హీరో ఎవరనే విషయం పై రకరకాలుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది.. అదే మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ (Irumudi). శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. వరుస ప్లాప్‌లతో కాస్త వీక్‌గా ఉన్న రవితేజకు ఈ సినిమా ఊపిరి పోయడమే కాదు, ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల రూపాయల షేర్ మార్కును దాటేసింది. ఇక ఓవర్సీస్, ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూస్తే రూ. 180 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఉన్న హోల్డ్ చూస్తుంటే మరో నాలుగైదు రోజుల్లో ఈజీగా రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇతర పెద్ద సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ, ‘ఇరుముడి’ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ రేంజ్ బ్లాక్‌బస్టర్ హిట్ పడటంతో దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు చిత్రసీమలో ఒక డైరెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో గ్రాండ్ హిట్ కొడితే చాలు.. నిర్మాతలు, హీరోల మేనేజర్లు వారి చుట్టూ తిరగడం సహజమే. ఇప్పుడు శివ నిర్వాణ విషయంలోనూ ఇదే జరుగుతోందట. పలువురు ప్రముఖ నిర్మాతలు ఆయనతో ఎలాగైనా సినిమా చేయాలని చెక్కులు పట్టుకుని తిరుగుతున్నారట. ఇప్పుడు కాకపోయినా పర్లేదు.. భవిష్యత్తులో మీతో సినిమా చేస్తాం, అడ్వాన్స్ తీసుకోండి అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారనే పుకార్లు

అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం, పంచదార్ల కొండపై మైనింగ్‌కు అనుమతులు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం, గనులశాఖ అధికారులకు హైకోర్టు ఆదేశం 2.153 హెక్టార్ల పరిధిలో నో మైనింగ్ జోన్‌గా జీవో జారీ: ఎస్‌జీపీ ఒక మైనింగ్ లీజు మాత్రమే రద్దు చేశారన్న పిటిషనర్ అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం, పంచదార్ల కొండపై మైనింగ్‌కు అనుమతులు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం, గునులశాఖ అధికారులను ధర్మాసనం ఆదేశించింది. విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పంచదార్ల కొండ వద్ద మైనింగ్ లీజు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ అప్పారాయుడుపాలేనికి చెందిన ఉప్పులూరి నాయుడు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విజయ్ కుమార్ నాయుడు, రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ లక్ష్మీ నరసింహ మినరల్స్ సంస్థలకు కేటాయించిన మైనింగ్ లీజులను రద్దు చేయాలని కోరారు. ఈ పిల్ సోమవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘పంచదార్ల కొండపై పురాతన శివాలయం ఉంది. ఆ ప్రాంతాన్ని రక్షిత జోన్‌గా ప్రకటించారు. కిలోమీటర్ పరిధిలో మైనింగ్ కార్యకలాపాలకు అనుమతించడానికి వీల్లేదు’ అని వివరించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) ఎస్.ప్రణతి వాదనలు వినిపిస్తూ... పంచదార్ల కొండ ప్రాంతంలో 2.153 హెక్టార్ల పరిధిలో మైనింగ్ కార్యకలాపాలు నిలిపివేశామన్నారు. ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని కోర్టుకు తెలిపారు. పొన్నవోలు స్పందిస్తూ.. ఆ ప్రాంతంలో మొత్తం మూడు మైనింగ్ లీజులు మంజూరు చేశారని, ఒకటి సిట్టింగ్ ఎంపీ పేరు మీద, మరొకటి

మాస్ మహారాజా రవితేజ గత కొంతకాలంగా కెరీర్లో వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిని.. నెటిజన్లు, విమర్శకుల నుంచి తీవ్రస్థాయి ట్రోలింగ్‌ను ఎదుర్కొంటూ వస్తున్న విషయం తెల్సిందే. మాస్ మహారాజా రవితేజ (Raviteja) గత కొంతకాలంగా కెరీర్లో వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిని.. నెటిజన్లు, విమర్శకుల నుంచి తీవ్రస్థాయి ట్రోలింగ్‌ను ఎదుర్కొంటూ వస్తున్న విషయం తెల్సిందే. వయసు పెరుగుతున్నా ఇంకా రొటీన్ మాస్ మసాలా ఫార్ములాలు, యంగ్ హీరోయిన్లతో డ్యూయెట్లు, లాజిక్ లేని ఫైట్లు చేయడం వల్ల ప్రేక్షకులు ఆయన సినిమాలను తిరస్కరిస్తూ వచ్చారు. గత నాలుగేళ్లలో రవితేజ తీసిన సినిమాలు ఏవి కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేదు. అయితే, ఈ ప్రతికూలతలన్నింటికీ చెక్ పెడుతూ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి(Irumudi) చిత్రంతో రవితేజ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి, బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాడు. ఈ విజయం సినీ వర్గాలకు, నటులకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ప్రేక్షకులు ఎప్పుడూ నటుడి వయస్సును, ఇమేజ్ను మాత్రమే చూడరని, బలవంతంగా రుద్దే మాస్ అంశాల కంటే బలమైన కంటెంట్, ఎమోషన్ ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారని ఇరుముడి రుజువు చేసింది. ఈ సినిమాలో రవితేజ తన రెగ్యులర్ మేనరిజమ్స్, బిగ్గరగా అరిచే డైలాగులను, క్రింజ్ కామెడీని పక్కనపెట్టి, అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్న ఒక తండ్రిగా తన వయస్సుకు తగిన పరిణతి చెందిన పాత్రను పోషించాడు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్‌ను ఆయన పండించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మలయాళం చిత్రాల్లో కనిపించే తరహా సహజసిద్ధమైన కథాంశాన్ని ఎంచుకుని, దేవతా విశ్వాసాలు, క్రైమ్, రివెంజ్ ఎలిమెంట్స్‌ను సరిగ్గా మిక్స్ చేసి తెరకెక్కించడంతో ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. తారాగణం ఎంత పెద్దదైనా కథలో దమ్ముండాలనే సత్యాన్ని రవితేజ గ్రహించి చేసిన ఈ ప్రయత్నం ఫలితాన్నిచ్చింది. ఇప్పటికైనా రవితేజ లాంటి అగ్ర కథానాయకులు తమ ఇమేజ్ చట్రం నుండి బయటపడి, వయస్సుకు

రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన 'ఇరుముడి' నిన్ననే థియేటర్లకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. అయ్యప్పస్వామి భక్తుడిగా రవితేజ కనిపించడం .. ఈ సినిమా నుంచి సాంగ్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడం బాగా కలిసొచ్చింది. దాంతో ఈ మధ్య కాలంలో థియేటర్స్ దగ్గర ఎప్పుడూ కనిపించని సందడి ఈ వారం కనిపించింది. ఆన్ లైన్ లో చకచకా టికెట్స్ అమ్ముడయ్యాయి. నిజానికి రవితేజ మినహా మిగతా ఆర్టిస్టులంతా ఓ మాదిరి క్రేజ్ ఉన్నవారే. ఇక రవితేజతో పాటు తెరపై పూర్తి స్థాయిలో కనిపించిన పాప 'నక్షత్ర' కూడా ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం లేదు. అయినా విడుదలకు ముందు నుంచి ఈ సినిమా మంచి బజ్ ను సంపాదించుకుంది. రవితేజ క్రేజ్ .. 'ఇరుముడి' అనే టైటిల్ .. ట్రైలర్ .. సాంగ్స్ అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అలాంటి ఈ సినిమా, విడుదలైన తొలిరోజునే ప్రపంచవ్యాప్తంగా 24 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసినట్టుగా తెలుస్తోంది.అయ్యప్పస్వామి వైపు నుంచి ఉన్న డివోషనల్ టచ్. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి కథానాయకుడు కావడం .. కూతురుపై అతనికి గల ప్రేమ .. తాను ఉన్నానంటూ కూతురుకు అండగా నిలిచే తీరు .. ఆడపిల్లల్లో భయాన్ని కాదు, ధైర్యాన్ని నింపాలి అనే సందేశం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. కథాకథనాలు ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. లొకేషన్స్ ను కవర్ చేసిన విధానం .. హుషారెత్తించే పాటలు

రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రెండో రోజు కూడా బలమైన జోరు కొనసాగిస్తోంది. ఆగస్టు 22 ఉదయం 10:30 గంటల సమయంలో బుక్‌మైషోలో గంటకు 30 వేలకుపైగా టికెట్లు అమ్ముడవుతున్నట్లు సూచిస్తున్నాయి. కొన్ని రిపోర్టుల ప్రకారం ఈ సంఖ్య గంటకు 34–35 వేల వరకు చేరినట్లు తెలుస్తోంది. మొదటి రోజు భారీ టికెట్ అమ్మకాలు నమోదు చేసిన తర్వాత కూడా ఇరుముడి డిమాండ్ తగ్గకపోవడం చిత్రానికి కీలకంగా మారింది. శనివారం కావడంతో రోజు మొత్తం ఇదే స్థాయి కొనసాగుతుందా అనే ఆసక్తి ఇప్పుడు బాక్సాఫీస్ వర్గాల్లో నెలకొంది. ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చిన ఇరుముడి మొదటి రోజే బలమైన ఓపెనింగ్ నమోదు చేసింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం భారత్‌లో తొలి రోజు సుమారు ₹14.8 కోట్ల నెట్, ₹17.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వసూళ్లు సుమారు ₹24 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లు ఈ వసూళ్లలో ప్రధాన పాత్ర పోషించాయి. రవితేజకు కొవిడ్ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ అనంతరం ఇది రెండో అత్యున్నత ఓపెనింగ్గా నిలిచింది. పలు సెంటర్లలో హౌస్‌ఫుల్ షోలు, అధిక ఆక్యుపెన్సీ కనిపించడంతో రెండో రోజుపై అంచనాలు మరింత పెరిగాయి. ఇరుముడి మొదటి రోజు బుక్‌మైషోలో ఒక దశలో గంటకు 32.25 వేలకుపైగా టికెట్ల అమ్మకాలు నమోదు చేసినట్లు సమాచారం. దీంతో రెండో రోజు కూడా గంటకు 30 వేల స్థాయిని దాటుతున్న టికెట్ అమ్మకాలు ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉండగా, కొన్ని అప్డేట్స్లో గంటకు 34–35 వేల టికెట్లు కూడా అమ్ముడైనట్లు పేర్కొంటున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన కేంద్రాల్లో బలమైన ఆక్యుపెన్సీ కొనసాగుతున్నట్లు సమాచారం. అదనపు షోలు, థియేటర్లు జోడించినా ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన కొనసాగుతోందని అందుబాటులో ఉన్న వివరాలు సూచిస్తున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఇరుముడి

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రారంభాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారు 20 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ నివేదికలు చెబుతున్నాయి. ఆగస్టు 21న విడుదలైన సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 24.20 కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. ఈ లెక్కల ప్రకారం బ్రేక్ ఈవెన్‌కు అవసరమైన వసూళ్లలో మొదటి రోజే గణనీయమైన భాగాన్ని అందుకుంది. శనివారం వసూళ్లు ఇదే స్థాయిలో కొనసాగితే బ్రేక్ ఈవెన్ మరింత వేగంగా సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘ఇరుముడి’కి ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 నుంచి 45 కోట్ల గ్రాస్ వస్తే బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుందని ట్రేడ్ అంచనాలు పేర్కొంటున్నాయి. తొలి రోజు భారత్‌లో సుమారు 14.80 కోట్ల నెట్, 17.20 కోట్ల గ్రాస్ నమోదైనట్లు సమాచారం. ఓవర్సీస్ నుంచి మరో 6 నుంచి 7 కోట్ల వరకు వచ్చినట్లు ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. భారత్‌లో వచ్చిన వసూళ్లలో తెలుగు వెర్షన్ ప్రధాన వాటా సాధించినట్లు అందుబాటులో ఉన్న సమాచారం సూచిస్తోంది. ప్రీమియర్లు, ముందస్తు బుకింగ్స్ నుంచి కనిపించిన స్పందన మొదటి రోజు వసూళ్లలోనూ కొనసాగింది. దీంతో ‘ఇరుముడి’ తొలి రోజే బ్రేక్ ఈవెన్ లక్ష్యంలో 60 శాతానికి పైగా రికవరీ సాధించినట్లు కొన్ని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రాక్టాలీవుడ్ వంటి ట్రేడ్ సోర్సులు బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని సుమారు 40 కోట్ల గ్రాస్‌గా అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా, మరికొన్ని అంచనాల్లో ఈ లక్ష్యం 45 కోట్ల వరకు ఉండొచ్చని పేర్కొంటున్నారు. ఈ రెండు అంచనాల్లో ఏది తీసుకున్నా తొలి రోజు 24.20 కోట్ల గ్రాస్ సినిమా వసూళ్లకు బలమైన పునాది వేసినట్లే కనిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం వరకు ఇదే జోరు కొనసాగితే లక్ష్యానికి మరింత చేరువయ్యే అవకాశం ఉంది. ఫలితంగా రవితేజకు ఇటీవలి చిత్రాల తర్వాత ‘ఇరుముడి’

రవితేజకి `ధమాఖా` తర్వాత హిట్ లేదు. ఆ తర్వాత చేసిన ఆరేడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతూనే ఉన్నాయి. తన మార్క్ కమర్షియల్, ఎంటర్టైనర్స్ థియేటర్లో సేల్ కావడం లేదు. దీంతో రూట్ మార్చాడు రవితేజ. తన జోనర్ మార్చాడు. భక్తిరస చిత్రాల వైపు టర్న్ తీసుకున్నారు. అయ్యప్పస్వామి భక్తులకు సంబంధించిన ఆధ్యాత్మిక కథతో వచ్చారు. తండ్రీ కూతురు సెంటిమెంట్‌ని, ఎమోషన్స్ ని, యాక్షన్ థ్రిల్లర్ అంశాలను మేళవించి రూపొందించిన `ఇరుముడి` చిత్రంతో ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తున్నాడు. దీనికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, ఇది శుక్రవారం విడుదలైంది. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించగా, సాయికుమార్, అజయ్ ఘోష్, స్వసిక విజయ్, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిరా వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. `ఇరుముడి` మూవీకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఆ ప్రభావం బాక్సాఫీసుపై కనిపిస్తుంది. సినిమా మంచి వసూళ్ల దిశగా వెళ్తోందని ట్రేడ్ సైట్లు చెబుతున్నాయి. ఇక ఫస్ట్ డే ఈ చిత్రానికి అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. రవితేజ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రావడం విశేషం. రవితేజ కెరీర్లో సోలో హీరోగా వచ్చిన చిత్రాల్లో `ధమాఖా`, `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాలు మాత్రమే ఎనిమిది కోట్లతో టాప్ లో ఉన్నాయి. కానీ `ఇరుముడి` మూవీ మాత్రం వాటి రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాదు అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ ఏడాది వచ్చిన చిరంజీవి `మన శంకరవర ప్రసాద్ గారు` మూవీ రికార్డుని కూడా బ్రేక్ చేసింది. దానికి రూ.31.6వేల టికెట్స్ బుక్ అయితే `ఇరుముడి`కి రూ.32.25వేల టికెట్స్ అడ్వాన్స్ గా అమ్ముడు పోవడం విశేషం. `ఇరుముడి` చిత్రానికి మొదటి రోజు ఏకంగా రూ.24.20కోట్లు రావడం విశేషం. రవితేజ గత చిత్రాలతో పోల్చితే మూడు రెట్లు అధికంగా వచ్చాయి. ఇది ఇండస్ట్రీకి, ట్రేడ్ వర్గాలకే

ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అంటూ మాస్ మాహారాజా ఫ్యాన్స్ పాటలు పాడేసుకుంటున్నారు. దాదాపు నాలుగేళ్లుగా రవితేజకు సరైన హిట్ లేదు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అంటూ మాస్ మాహారాజా ఫ్యాన్స్ పాటలు పాడేసుకుంటున్నారు. దాదాపు నాలుగేళ్లుగా రవితేజ (Raviteja)కు సరైన హిట్ లేదు. ఎట్టకేలకు నేడు రిలీజైన ఇరుముడి( Irumudi)థియేటర్లలో విడుదలై సర్వత్రా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటుంది.శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించగా.. బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటించింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా చాలా కాలం తర్వాత రవితేజ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఘనస్వాగతం అందేలా చేసింది. ఇక ఈ సినిమాలో ప్రధానంగా మల్లెపూల పల్లకి పాట వినిపిస్తున్నప్పుడు థియేటర్లలో ప్రేక్షకుల స్పందన మైండ్ బ్లాకింగ్ అని చెప్పాలి. ఇంకా అయ్యప్ప మాల సీజన్ ప్రారంభం కానప్పటికీ, ఏళ్ల తరబడి దీక్ష తీసుకుంటున్న భక్తులు, యూత్ ఈ పాటకు తీవ్రంగా కనెక్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని విమల్, సంధ్య థియేటర్ల నుంచి కరీంనగర్, కర్నూలు వరకు అన్ని ప్రాంతాల్లోనూ ప్రేక్షకులు సీట్లలో నుంచి లేచి పూలు చల్లుతూ డ్యాన్సులు చేస్తున్నారు. అంతేకాకుండా, కొందరు అయితే ఆ సాంగ్ వచ్చినప్పుడు హారతులు ఇస్తున్నారు. ఈ పాట తర్వాత వచ్చే ఛేజింగ్ సీన్లో కూడా ఇదే సాంగ్ బిట్‌ను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా వాడటం క్యారెక్టర్ ఎలివేషన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. మల్లెపూల పల్లకి సాంగ్ ఈ చిత్రంలో ఉంది అన్నప్పటి నుంచి ప్రేక్షకులు థియేటర్లను గుడులుగా మారుస్తారు అని చెప్పుకోస్తూనే ఉన్నారు. ఆ తరువాత మల్లెపూల పల్లకి సాంగ్ రిలీజ్ అయ్యినప్పుడు రీమిక్స్ లేదు.. కొత్తగా ఉంది.. ఊపు లేదు అంటూ పెదవి విరిచారు. కానీ, థియేటర్ లో మాత్రం ఆ సాంగ్ ని ఫ్యాన్స్ ఏ

ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం కావడం అంత తేలికైన విషయం కాదు. ముందుగా నిర్మాతను .. ఆ తరువాత హీరోను .. హీరోయిన్ ను .. చివరికి ఆడియన్స్ ను ఒప్పించడం అంత ఆషామాషీ విషయమేం కాదు. ఇక మొదటి సినిమాతో హిట్ కొట్టడటం కూడా అందరి విషయంలో జరిగేది కాదు .. దాదాపుగా అది ఒక అద్భుతం లాంటిదేనని చెప్పాలి. అలాంటి అద్భుతాన్ని అవలీలగా సాధించిన దర్శకుడిగా శివ నిర్వాణ కనిపిస్తాడు. 'నిన్ను కోరి'.. 'మజిలీ' వంటి ఫీల్ గుడ్ మూవీస్ ను తెరకెక్కించిన శివ నిర్వాణ, రవితేజ హీరోగా 'ఇరుముడి' సినిమాను రూపొందించాడు. ఈ రోజునే ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "అప్పట్లో నేను సీరియల్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవాడిని. ఆ సమయంలోనే నేను 'రక్తచరిత్ర' సినిమా షూటింగుకి వెళ్లాను. ఎందుకంటే నాకు రాముగారు అంటే పిచ్చి. ఆ రోజున కూలర్ బాయ్ రాలేదు. నాకేం డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పి నేను కూలర్ బాయ్ గా మారాను" అని అన్నారు. "వర్మగారి దగ్గరగా ఉండటం కోసం, కూలర్ బాయ్ తో మాట్లాడుకుని ఆ పనిని నేనే చేస్తూ వెళ్లాను. వర్మగారు డైరెక్షన్ చేసే తీరును దగ్గరగా చూస్తూ వెళ్లాను. ఆయన మేకింగ్ స్టైల్ చూసి నేను షాక్ అయ్యేవాడిని. ఆయన షాట్స్ ను నేను ఎప్పటికప్పుడు రాసుకునేవాడిని. అవి ఆ తరువాత కాలంలో నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. దాదాపు ఒక

మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండే పాజిటివ్ బజ్ తెచుకున్న ఈ సినిమా మంచి అంచనాల మధ్య ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టింది. ఓవర్సీస్ నుండి వస్తున్న టాక్ ఎలా ఉందంటే.. ఫస్టాఫ్ చాలా నేచురల్‌గా, క్లీన్‌గా సాగుతుంది. భావోద్వేగాలు చక్కగా పండాయి. ఇంటర్వెల్ వైపు వెళ్తున్న కొద్దీ కథలో కాస్త టెంపో, ఇంటెన్సిటీతో పాటు థ్రిల్లర్ సన్నివేశాల్లో కొన్ని లాజిక్ లోపాలు అనిపించినప్పటికీ, సినిమా మాత్రం ప్రేక్షకుడిని ఆద్యంతం ఎంజాయ్ చేసేలా ఆకట్టుకుంటుంది. రవితేజ ఎక్కడ ఓవర్ ది బోర్డు వెళ్లకుండా త్రినాథ్ పాత్రలో సూపర్బ్ పర్ఫామెన్స్ చేసాడు. సెకండాఫ్ ఎమోషనల్ డ్రామాను మరియు ట్విస్ట్‌ను డీల్ చేయడంలో దర్శకుడు శివ నిర్వాణ సక్సెస్ అయ్యాడు. అయితే, ట్విస్ట్ వెల్లడైన తర్వాత వచ్చే ఎపిసోడ్ ఇంకాస్త మెరుగ్గా తీయచ్చు అనిపించినా కానీ దర్శకుడు సినిమాను చాలా ఎమోషనల్ క్లైమాక్స్‌తో కథకు తగ్గట్టుగా మలిచాడు. ఇక ‘మల్లెపూల పల్లకి’ పాటతో కూడిన యాక్షన్ ఎపిసోడ్, ప్రేక్షకుల కోలాహలంతో థియేటర్‌ను హోరెత్తించింది. ఇటీవలి కాలంలో ఒక స్టార్ హీరో తన కమర్షియల్ ఇమేజ్ను పక్కనపెట్టి కథకు మాత్రమే నమ్మి చేసిన సినిమా ఇది. ఎక్కడా కమర్షియల్ హంగులు లేకుండా కథకు తగ్గట్టుగా కథనం సాగుతుంది. థ్రిల్లర్ పోర్షన్స్, ఎమోషనల్ పాయింట్ చాలా బలంగా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. ఒక స్టార్ ఇమేజ్ను పక్కన పెట్టి కథను నమ్మి నటించిన మాస్ మహారాజా రవితేజకు, అంతే నిజాయితీతో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ మరియు మైత్రీ మూవీ మేకర్స్‌కు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ

‘ఇరుముడి’ సినిమా భక్తి భావన, భావోద్వేగాల అద్భుతమైన కలయికగా నిలిచిందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రశంసించారు. ‘ఇరుముడి’ (Irumudi) సినిమా భక్తి భావన, భావోద్వేగాల అద్భుతమైన కలయికగా నిలిచిందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ప్రశంసించారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని వీక్షించిన సందీప్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. మాస్ మహారాజా రవితేజ, బేబీ నక్షత్ర, దర్శకుడు శివ నిర్వాణ ప్రేక్షకులను మరిచిపోలేని భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ తరం ప్రేక్షకులకు ‘ఇరుముడి’ ఒక ప్రత్యేకమైన చిత్రమని, సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆ భావోద్వేగం మనసులో నిలిచిపోతుందని అన్నారు. ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలని ప్రేక్షకులను కోరిన సందీప్ రెడ్డి వంగా.. సినిమా సూపర్‌హిట్ కావడం పట్ల చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో రవితేజ అయ్యప్ప మాలధారణలో కనిపించే సన్నివేశాలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన భక్తి భావనను కలిగిస్తున్నాయి. అయ్యప్ప స్వామికి సంబంధించిన సన్నివేశాలు తెరపై కనిపించిన సమయంలో అభిమానులు స్క్రీన్లకు హారతులు ఇస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. మరికొందరు థియేటర్లోనే భజనలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.‘మల్లెపూల పల్లకి’ పాట మొదలైన సమయంలో థియేటర్లలో వాతావరణం మరింత ఉత్సాహంగా మారుతోంది. పాటకు అభిమానులు స్క్రీన్ ముందుకు వెళ్లి డ్యాన్స్‌లు చేస్తూ సందడి చేస్తున్నారు

Irumudi Movie Review: రవితేజ విశ్వరూపం.. బొమ్మ దద్దరిల్లింది! Irumudi Movie Review: వరస ప్లాపులతో కాస్త వెనుకబడ్డ మాస్ మహారాజ్ రవితేజ, ఈసారి తన రొటీన్ మాస్ ఆరాటాన్ని పక్కన పెట్టి, ఒక బలమైన ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆడియన్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేసిన 'ఇరుముడి' సినిమా థియేటర్లలో ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికొస్తే.. సీలేరు ప్రాంతంలోని ఒక చిన్న పల్లెటూర్లో అరటిపళ్ల వ్యాపారం చేసుకునే త్రినాథ్ అనే సగటు కుటుంబ పెద్దగా రవితేజ కనిపిస్తారు. ఆయనకు భార్య కావేరి, కూతురు మణికంఠ అంటే ఎనలేని ప్రాణం. తన వ్యాపారం చేసుకుంటూనే ప్రతి సంవత్సరం నియమంగా అయ్యప్ప మాల వేసుకుంటాడు త్రినాథ్. అంతా ప్రశాంతంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి అనుకోకుండా ఒక పెద్ద సమస్య వచ్చిపడుతుంది. ఊరిలో అనుమానాస్పదంగా కొందరు అమ్మాయిలు వరసగా చనిపోతుంటారు. ప్రతీ అమ్మాయిలో తన కూతురినే చూసుకునే హీరో, ఈ మరణాల వెనుక ఉన్న అసలు మిస్టరీని ఛేదించాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఎదురైన నిజాలు ఏంటి? ఈ మిస్టరీని హీరో ఎలా ఛేదించాడు అనేది మిగతా కథ. మంచి స్క్రిప్ట్ ఉంటే రవితేజ ఏ రేంజ్ లో రేచ్చిపోతాడో ఈ సినిమాతో మరోసారి చూపించాడు.రవితేజ ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ నటనతో సినిమాను తన భుజాలపై మోశారు. చిన్న పాప నటన ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేర బాగానే చేశారు. దర్శకుడు శివ నిర్వాణ రాసుకున్న కథ ఆకట్టుకునే విధంగా ఉంది. ఓ ఊరులో జరిగే సాధారణ కథను తెర మీద అద్భుతంగా చూపించారు. ఇక జీవీ ప్రకాష్ తన నేపథ్య సంగీతంతో ఈ సినిమాకు ప్రాణం పోశారనే చెప్పాలి. దర్శకుడు అనుకున్న పాయింట్‌ను చాలా బలంగా చెప్పగలిగారు. ముఖ్యంగా ద్వితీయార్థాన్ని నడిపించిన తీరు బాగుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కథ మూడ్‌కి తగ్గట్టుగా కుదిరాయి

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద రికార్డు బుకింగ్స్‌తో దూసుకుపోతోంది. బుక్‌మైషోలో గంటకి ఏకంగా 27 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతూ ట్రెండింగ్‌లో నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రవితేజ నటన, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, ఎమోషనల్ కథాంశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ టైమ్‌లో ఒక పవర్ ఫుల్ ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాకి ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం చూడలేదు. అసలు గంటకి 27.64K+ టికెట్స్ బుక్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇది కేవలం ఒక బుకింగ్ నంబర్ మాత్రమే కాదు, ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న నమ్మకం, క్రేజ్. మొదటి షో సమయానికే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉంది, పైగా సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీనిని బట్టి చుస్తే, 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. అసలు ఈ సినిమాకి ఇంతటి భారీ హైప్ రావడానికి పలు కారణాలు ఉన్నాయి. మొదటిది, మన మాస్ మహారాజా రవితేజ యాక్టింగ్. ఎక్కువగా మాస్ సినిమాలతో అలరించే రవితేజ, ఈసారి రూట్ మార్చారు. 'నిన్ను కోరి', 'మజిలీ' లాంటి ఎమోషనల్ బ్లాక్‌బస్టర్స్ అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్షన్ అనగానే అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి మొదలైంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. రవితేజను ఒక విభిన్నమైన, మనసుకి హత్తుకునే రోల్లో చూపించడంలో శివ నిర్వాణ వంద శాతం సక్సెస్ అయ్యారని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. రెండోది, సినిమాలోని ఎమోషనల్ కంటెంట్, పెరెంటింగ్ కాన్సెప్ట్. తండ్రీకూతుళ్ల అనుబంధం, భక్తి, సొసైటీకి అవసరమైన ఒక పవర్ ఫుల్ మెసేజ్‌ని చాలా ఎంగేజింగ్‌గా చూపెట్టారు. త్రినాథ్ గా రవితేజ నటన, చిన్నారి బేబీ నక్షత్ర యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో
స్టార్ హీరో రవితేజ , సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన డివోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ ' ఇరుముడి '. టీజర్, ట్రైలర్లతోనే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం నేడు (ఆగస్టు 21) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.* ఒక ఆడదాని చుట్టూ 40 మంది మగాళ్లు... ఐటెమ్ సాంగ్స్‌తో ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం - సిద్ధార్ధ్సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఒక భావోద్వేగ ప్రయాణాన్ని అనుభవిస్తున్నారు. ముఖ్యంగా థియేటర్ల వద్ద అభిమానుల సంబరాలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. వెండితెరపై రవితేజ అయ్యప్ప స్వామి మాలధారణలో కనిపించే సన్నివేశాలు రాగానే థియేటర్లు 'స్వామియే శరణం అయ్యప్ప' అనే నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. భక్తి పారవశ్యంతో అభిమానులు స్క్రీన్ల వద్దకు వెళ్లి నేరుగా కర్పూర హారతులు పడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం పూజలతోనే ఆగకుండా, సినిమాలో ఎంతో ప్రాధాన్యత కలిగిన 'మల్లెపూల పల్లకి' పాట, దాని వెనుక వచ్చే యాక్షన్ బ్లాక్ సమయంలో థియేటర్లలో ప్రేక్షకులు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ స్క్రీన్ల ముందే డ్యాన్సులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.* రవితేజ ‘ఇరుముడి’ ట్విట్టర్ రివ్యూ... మాస్ మహరాజా ఈసారి గట్టిగా కొట్టాడా?కథ విషయానికి వస్తే.. మద్యపాన వ్యసనంలో కూరుకుపోయిన ఒక సాధారణ తండ్రి, తన ప్రాణ సమానమైన కూతురి ప్రేమ, నమ్మకాన్ని తిరిగి దక్కించుకోవడం కోసం పవిత్రమైన అయ్యప్ప దీక్షను స్వీకరిస్తాడు. అయితే దీక్షా సమయంలోనే ఊరిలోని అమాయక ఆడపిల్లల రక్షణ కోసం ఆ తండ్రి ఎదుర్కొన్న సవాళ్లు, చేసిన పోరాటం చుట్టూ కథ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. తన రెగ్యులర్ మాస్ చిత్రాల

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన మూవీ `ఇరుముడి`. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించింది. సాయికుమార్, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిరా, స్వసికా విజయ్, మీసాలా లక్ష్మణ్, అజయ్ ఘోష్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(ఆగస్ట్ 21) న విడుదలైంది. వరుస పరాజయాల్లో ఉన్న రవితేజకి హిట్ పడిందా? సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. పొల్లూరు విలేజ్‌లో త్రినాథ్(రవితేజ), తన భార్య కావేరి(ప్రియా భవానీ శంకర్), కూతురు మణియమ్మ(బేబీ నక్షత్ర)తో హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తుంటాడు. ఆయనకు ఆటో ఉంటుంది. అరటితోటని నిర్వహిస్తున్నారు. త్రినాథ్ ప్రతిఏడాది అయ్యప్ప మాల వేస్తుంటాడు. ఆ సమయంలో నిబద్ధతతో ఉంటాడు. మందుకు దూరంగా ఉంటాడు. కానీ మాల అయిపోయిందంటే వరుసగా తాగుతూనే ఉంటాడు. తనకు కూతురు అంటే ప్రాణం. ఆ దేవుడే కూతురు రూపంలో వచ్చాడని భావిస్తాడు. గారాభంగా పెంచుతాడు. తను ఊర్లో ఏం జరిగినా చూసింది చూసినట్టు చెబుతుంది. ఆ ఊరికి బస్ లేకపోవడంతో ఎమ్మెల్యే(రమేష్ ఇందిరా).. గురుస్వామి(సాయికుమార్) రిక్వెస్ట్ మేరకు బస్ వేయిస్తాడు. దీంతో ఊర్లో అమ్మాయిలు వేరే ఊరికి వెళ్లి హైస్కూల్ చదువుకుంటారు. అయితే సడెన్‌గా ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ తర్వాత బస్‌లో అమ్మాయిలను కొందరు కుర్రాళ్ల వేధించడంతో మణియమ్మ చెబుతుంది. వారిని చితకబాదుతాడు త్రినాథ్. గురుస్వామి కూతురు గాయత్రి పదో క్లాస్ చదువుతుంది. ఆమెకి మెరిట్ స్టూడెంట్ అని టీచర్ స్పెషల్ క్లాస్‌లు చెబుతుంది. అంతకు ముందే ఆ టీచర్ ఒక అమ్మాయిని చితకబాదినందుకు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె మళ్లీ రావడంతో స్టూడెంట్స్ భయపడుతుంటారు. గాయత్రి కూడా భయపడుతుంది. ఎక్స్ ట్రా క్లాస్ లు అని గాయత్రిని ఇంటికి పిలిపించుకుంటుంది. మరి ఇంటికి పిలిపించి ఆ టీచర్ ఏం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నిందితుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు దిగింది. కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నిందితుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు దిగింది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సహా దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 10 ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలు అలాస్కాలో కుప్పకూలిన చార్టర్ విమానం.. 8మంది మృతి

రవితేజ 'ఇరుముడి' ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం 'ఇరుముడి' ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా అమెరికా ప్రీమియర్ల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం అత్యంత సానుకూల స్పందనను సొంతం చేసుకుంటోంది. భారీ అంచనాలు మరియు ముందస్తు బుకింగ్స్ఆధ్యాత్మిక అంశాలు మరియు ఫ్యామిలీ డ్రామా కలబోతగా వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ మరియు ట్రైలర్లలో రవితేజ అయ్యప్ప స్వామి మాలలో కనిపించడంతో ప్రేక్షకుల్లో విశేష ఆసక్తి నెలకొంది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అత్యధిక స్థాయిలో నమోదయ్యాయి. కథలోని లోతు మరియు పేరెంటింగ్ సందేశంకేవలం డివోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా కథలో మరింత లోతైన సామాజిక కోణాన్ని దర్శకుడు జోడించారు. ముఖ్యంగా ఆడపిల్లల పెంపకం మరియు పేరెంటింగ్ శైలిపై ప్రతి ఒక్కరినీ తీవ్రంగా ఆలోచింపజేసేలా సన్నివేశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తండ్రీ కూతుళ్ల అనుబంధంతో పాటు తండ్రీ కొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్ సెంటిమెంట్ కూడా తొలి భాగంలో బాగా ఆకట్టుకుంటోంది. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు మరియు సంగీతంప్రథమార్ధంలో ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ సన్నివేశాలను శివ నిర్వాణ సమర్థవంతంగా మేళవించారు. ఇంటర్వెల్ బ్లాక్ మరియు కథలోని కీలక మలుపు ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా మారగా, 'మల్లెపూల పల్లకి' పాట వచ్చే సన్నివేశం థియేటర్లలో మంచి స్పందన పొందుతోంది. ఈ నేపథ్యంలో రొటీన్ కమర్షియల్ ముగింపు కాకుండా ఎమోషనల్ క్లైమాక్స్‌ను ఎంచుకోవడం సినిమా స్థాయిని పెంచింది. రవితేజ కెరీర్లో సరికొత్త మైలురాయిఓవర్సీస్ నుంచి వస్తున్న టాక్ ప్రకారం రవితేజ తన రొటీన్ మాస్ శైలిని పక్కనపెట్టి ఇంటెన్స్ నటనను కనబరిచారు. దీంతో ఆయన నటనపై మరియు ఎంచుకున్న పాత్రపై సర్వత్రా ప్రశంసలు

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో ప్రతిభావంతుడైన దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్ర దర్శకుడితో NSR స్పెషల్ ఇంటర్వ్యూ. మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) ప్రధాన పాత్రలో ప్రతిభావంతుడైన దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ‘NSR’ స్పెషల్ ఇంటర్వ్యూ (NSR Special Interview)లో శివ నిర్వాణ (Shiva Nirvana) పాల్గొని సినిమా విశేషాలు, తెరవెనుక అనుభవాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో విడుదలైన ‘మల్లెపూల పల్లకి’ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కార్తీక మాసంలో అయ్యప్ప భక్తుల భజనలలో శాశ్వతంగా నిలిచిపోయేలా జీవీ ప్రకాష్ కుమార్‌తో కలిసి ప్రత్యేక శ్రద్ధతో పాటలను డిజైన్ చేశామని శివ తెలిపారు. ఈ సినిమా కథ పుట్టుక గురించి చెబుతూ.. ‘‘41 రోజుల పాటు అయ్యప్ప స్వామి మాలలో ఉండే ఒక వ్యసనపరుడైన వ్యక్తి జీవితంలో జరిగే పరిస్థితులు, సంఘర్షణలే ఈ కథకు మూలం. ఇది కేవలం భక్తి చిత్రం మాత్రమే కాదు, ఒక విలన్ లేకుండా పరిస్థితుల చుట్టూ తిరిగే అత్యంత ఇంటెన్స్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. రవితేజ ఇప్పటివరకు చేయని విధంగా చాలా సహజమైన, సెటిల్డ్ నటనతో త్రినాధ్ అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు’’ అని వివరించారు. సీలేరు వంటి మారుమూల అటవీ ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ కూడా లేని వాతావరణంలో చిత్రయూనిట్ మొత్తం ఎంతో సహజంగా కలిసిపోయి షూటింగ్ పూర్తి చేసుకున్నామని గుర్తుచేసుకున్నారు. పాప నక్షత్ర పాత్ర సినిమాకు ప్రాణమని, ప్రియా భవానీ శంకర్, శ్వాసిక, సాయికుమార్ తదితరుల పాత్రలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని శివ నిర్వాణ ధీమా వ్యక్తం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే తెలుగుతో పాటు
మాస్ మహారాజా రవితేజ , విలక్షణ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన సరికొత్త చిత్రం 'ఇరుముడి'. భక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్ అంశాల మేళవింపుతో వచ్చిన ఈ సినిమాపై తొలి నుంచే పరిశ్రమ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రవితేజను సరికొత్త ఆధ్యాత్మిక, కుటుంబ నేపథ్యంలో చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, ఇప్పటికే విదేశీ ప్రీమియర్లను పూర్తి చేసుకుని పాజిటివ్ బజ్‌తో దూసుకుపోతోంది.ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. మద్యం వ్యసనానికి బానిసై తన జీవితాన్ని నాశనం చేసుకునే ఒక సాధారణ గ్రామీణ తండ్రి చుట్టూ తిరుగుతుంది. తన కన్నకూతురి ప్రేమ, కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం అతడు పవిత్రమైన 41 రోజుల అయ్యప్ప స్వామి దీక్షను చేపడతాడు. అయితే అదే సమయంలో ఆ గ్రామానికి, అమాయకపు ఆడపిల్లలకు ఎదురయ్యే ఊహించని ప్రమాదం నుంచి దీక్షా నియమాలను పాటిస్తూనే అతడు తన కుటుంబాన్ని, ఊరిని ఎలా కాపాడాడనే అంశాన్ని దర్శకుడు క్రైమ్ థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామాగా మలిచారు.ఆకట్టుకునే తండ్రీ కూతుళ్ల బంధంయూఎస్ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ స్పందనను పంచుకుంటున్నారు. ఫస్టాఫ్ ఎక్కడా హడావుడి లేకుండా ఎంతో నిజాయితీగా, మలయాళ చిత్రాల తరహా సహజత్వంతో సాగుతుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం, పాఠశాల నేపథ్యంలో మొదలయ్యే సన్నివేశాలు, కథలోని అంతర్లీన ఉత్కంఠ ఫస్టాఫ్‌ను ఆసక్తికరంగా నడిపించాయి. అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినప్పటికీ, ఇంటర్వెల్ సమయానికి వచ్చే సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచేశాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.సెకండాఫ్‌లో ఊహించని ట్విస్టులుఇక సెకండాఫ్‌లో కథలోని ఎమోషన్స్ పీక్స్‌కి చేరుకుంటాయని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఊహించని ట్విస్టులు, దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. 'మల్లెపూల పల్లకి' భక్తి గీతం నేపథ్యంలో వచ్చే మాస్ యాక్షన్ ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయిస్తూ గూస్బంప్స్ తెప్పిస్తుందని ప్రశంసిస్తున్నారు. ట్విస్ట్

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో బలమైన స్పందన నమోదు చేస్తోంది. ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ వేదికల్లో టికెట్ల అమ్మకాలు వేగంగా సాగుతున్నాయి. ట్రేడ్ వర్గాలు, నిర్మాతల పోస్టుల ప్రకారం రెండు వేదికల్లో కలిపి 1.20 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు నిజాం, ఆంధ్రా ప్రాంతాల్లో ఇరుముడి అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకోవడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ప్రారంభ దశలో బుక్‌మైషోలో 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం బయటకు వచ్చింది. ఆ తర్వాత బుకింగ్స్ వేగం పెరగడంతో బుక్‌మైషోలో 72 వేలకు పైగా టికెట్ల అమ్మకాలను సూచించాయి. డిస్ట్రిక్ట్‌లో మరో 38 వేలకు పైగా టికెట్లు అమ్ముడై మొత్తం సంఖ్య 1.10 లక్షలు దాటినట్లు పేర్కొన్నాయి. తాజా అంచనాల్లో ఇరుముడి అడ్వాన్స్ బుకింగ్స్ 1.20 లక్షల మార్కును కూడా దాటినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో పలు షోలు వేగంగా నిండుతుండగా, కొన్ని చోట్ల పూర్తిస్థాయి బుకింగ్స్ కనిపిస్తున్నట్లు సమాచారం. దీంతో రవితేజ ఇటీవలి సినిమాలతో పోలిస్తే ‘ఇరుముడి’కి విడుదలకు ముందే మెరుగైన స్పందన కనిపిస్తోందనే అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రంలో తండ్రి, కూతురు అనుబంధాన్ని అయ్యప్ప దీక్ష నేపథ్యంతో మిళితం చేశారు. మద్యం అలవాటు, హింసాత్మక గతం ఉన్న తండ్రి తన కూతురు కోరికతో అయ్యప్ప దీక్ష చేపట్టడం కథలో ప్రధాన అంశం. ఇదిలా ఉండగా కుటుంబ భావోద్వేగాలతో పాటు యాక్షన్, ఉత్కంఠ అంశాలు కూడా ఉండటం వివిధ వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ట్రైలర్, పాటలకు వచ్చిన స్పందన కూడా ఇరుముడి అడ్వాన్స్ బుకింగ్స్‌కు ఊతమిచ్చినట్లు కనిపిస్తోంది. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటించగా, బేబీ నక్షత్ర రవితేజ కూతురి పాత్రలో కనిపించనుంది. సాయి కుమార్‌తో పాటు పలువురు కీలక పాత్రల్లో నటించగా, జీవీ

విజయ్ దేవరకొండ హీరోగా రూపుదిద్దుకున్న 'కింగ్డమ్'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు మలయాళ నటుడు వెంకటేశ్ వి.పి.. ఇప్పుడు అతనికి తెలుగులో హీరోగా నటించే అవకాశం లభించింది. 'కె ర్యాంప్' వంటి సక్సెస్ ఫుల్ మూవీని నిర్మించిన బొమ్మక్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుద్రాంశ్ సెల్యులాయిడ్ నిర్మాణంలో ధీరజ్ న్యాతి ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సురేశ్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి 'డి.జి.పి.' అనే వర్కింగ్ టైటిల్ ను పెట్టుకున్నారు. వెంకటేశ్. వి.పి. మలయాళ టీవీ, చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. 'సుడా సుడా ఇడ్లీ' అనే రెస్టారెంట్ స్టార్టప్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నారు. 'కింగ్డమ్' చిత్రంలో వెంకటేశ్ పోషించిన మురుగన్ పాత్ర నటుడిగా అతనికి మచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు డి.జి.పి. వర్కింగ్ టైటిల్ తో వస్తున్న చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆగస్ట్ 20 హీరో వెంకటేశ్. వి.పి. బర్త్ డే సందర్భంగా ఆయనకు మేకర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ సినిమాలోకి వెల్ కమ్ చెప్పారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాకు జ్ఞానీ సంగీతం అందిస్తున్నారు

దక్షిణ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ మెకేదాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ కేవలం కర్ణాటక రాష్ట్రానికే కాకుండా తమిళనాడు మరియు పుదుచ్చేరి రైతులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు. మహాబలిపురంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ దక్షిణ జోనల్ కౌన్సిల్ భేటీలో ఈ అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సలహాను ఉదహరిస్తూ, కావేరి నీటి వివాదాన్ని ఇరు రాష్ట్రాలు సహకారంతో పరిష్కరించుకోవాలని శివకుమార్ పిలుపునిచ్చారు. కావేరి నదిపై రామనగర జిల్లా కనకపుర సమీపంలో రూ 9000 కోట్ల నుంచి రూ 14000 కోట్ల అంచనా వ్యయంతో ఈ మెకేదాటు ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. సుమారు 67 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించే ఈ రిజర్వాయర్ ద్వారా బెంగళూరు నగరం తాగునీటి అవసరాలకు 4.75 టీఎంసీల నీటిని కేటాయించనున్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ ద్వారా 400 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని కర్ణాటక ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నీటిని వ్యవసాయ నీటిపారుదలకు ఉపయోగించబోమని, 2027 ఆగస్టు నాటికి ప్రాజెక్ట్‌కు పునాది రాయి వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీంతో దిగువ ప్రాంతాలకు నీటి ప్రవాహం తగ్గి తమ రైతుల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదిలా ఉండగా కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే అటవీ భూమి మరియు చెట్ల నరికివేత వంటి కీలక వివరాలతో కూడిన రివైజ్డ్ డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం సమర్పించింది. సుప్రీంకోర్టు గతంలో కొన్ని సవాళ్లను అకాలంగా తోసిపుచ్చినప్పటికీ, నీటి విడుదల మరియు మార్గదర్శకాలపై రెండు రాష్ట్రాల మధ్య చట్టపరమైన వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కావేరి నీటి నిర్వహణ అథారిటీ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని సుప్రీంకోర్టు ఇటీవల కర్ణాటకకు

తమిళనాడులోని మహాబలిపురం వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తుకు సరికొత్త దిశానిర్దేశం చేసింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక సీఎం డీకే శివ కుమార్, కేరళ సీఎం సతీషన్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు ఈ కీలక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్పించిన సమగ్ర అభివృద్ధి ప్రణాళిక సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ప్రాంతీయ సహకారం, మౌలిక వసతుల విస్తరణ, నదీ జలాల సమర్థ నిర్వహణపై చంద్రబాబు విజన్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు ఇతర రాష్ట్రాల ప్రతినిధులు ప్రశంసలతో ముంచెత్తారు. ఒక సీనియర్ రాజకీయ వేత్తగా కేవలం సొంత రాష్ట్రానికే పరిమితం కాకుండా, మొత్తం దక్షిణాది ప్రాంతాన్నంతా ఒక ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే ప్రతిపాదనలను ఆయన సదస్సు ముందుంచారు.అమరావతి-బెంగళూరు-చెన్నై బుల్లెట్ కారిడార్!దక్షిణాదిలో రవాణా రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానిస్తూ ప్రత్యేక బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. ముఖ్యంగా అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానిస్తూ కుప్పం మీదుగా ఈ హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మించాలని సూచించారు.దీంతో పాటు దక్షిణాది వ్యాప్తంగా సమర్థవంతమైన లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రై పోర్టుల ఏర్పాటు, విద్యుత్ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో మరింత పటిష్టంగా అనుసంధానించాలని స్పష్టం చేశారు. విపత్తుల సమయంలో రాష్ట్రాలు ఒకదానికొకటి తక్షణమే సహకరించుకునేలా మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటుతో పాటు, తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్ధామ్ వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని కోరారు.దక్షిణాది సీఎంల దండయాత్ర.. అమిత్ షా ముందు జల జగడం! 2047 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తి!దేశ జీడీపీలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల వాటా

తమిళనాడులోని కోవళంలో ఇవాళ నిర్వహించిన దక్షిణాది ప్రాంతీయ మండలి (Southern Zonal Council Meet) సమావేశంలో ఆతిధ్య రాష్ట ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ (vijay) తన వాదన గట్టిగా వినిపించారు. మిగతా దక్షిణాది సీఎంలు అక్కడే ఉన్నా, అందులో చాలా వరకూ కాంగ్రెస్ నేతలే ఉన్నా విజయ్ మాత్రం తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. ఇందులో కర్నాటక-తమిళనాడు మధ్య చిచ్చు రేపుతున్న కావేరీ అంశంతో పాటు జాతీయ స్ధాయిలో నీట్ పరీక్ష రద్దు వంటి అంశాలున్నాయి.UGC కుల వివక్ష నిరోధక రూల్స్ పై కేంద్రం యూటర్న్ ? అగ్రకులాల వ్యతిరేకత వేళ..!కర్నాటకతో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను విజయ్.. ఈ భేటీలో నేరుగా ప్రస్తావించారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను అన్ని రాష్ట్రాలూ తప్పనిసరిగా గౌరవించాల్సిందేనని విజయ్ కర్నాటక సీఎం డీకే శివకుమార్ ను ఉద్దేశించి స్పష్టం చేశారు. కావేరి నదీ పరివాహక ప్రాంత నిర్వహణ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని పట్టుబట్టారు. విజయ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో పక్కనే కూర్చున్న డీకే శివకుమార్ ముఖం ఒక్కసారిగా తీవ్ర అసహనంతో మారిపోయింది. అలాగే కేరళ ముఖ్యమంత్రి సతీశన్ సమక్షంలో ముల్లపెరియార్ డ్యామ్ నీటిమట్టాన్ని 152 అడుగులకు పెంచాలని విజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రాల మధ్య ఉండే తాత్కాలిక విభేదాలు పొరుగు సంబంధాలను దెబ్బతీయకూడదని ఆయన హితవు పలికారు. మహిళా ఉద్యోగులకు విజయ్ బంపర్ ఆఫర్..! ఇక ఏడాది సెలవులు..!మరోవైపు తమిళనాడుకు సంబంధించిన మరికొన్ని కీలక ప్రతిపాదనలను కూడా సీఎం విజయ్ ఈ భేటీలో కేంద్రానికి సమర్పించారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష నుంచి రాష్ట్రానికి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇంటర్ లేదా ప్లస్-టూ మార్కుల ఆధారంగానే వైద్య సీట్ల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే బెంగళూరు మెట్రో రైలు మార్గాన్ని తమిళనాడులోని హోసూర్ వరకు విస్తరించాలని కోరారు. దీంతో
మాస్ మహారాజా రవితేజ , విలక్షణ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమా నేపథ్యం, కథాంశం, అలాగే కథలోని విలనిజం గురించి చెప్పిన ఆసక్తకరమైన సంగతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.* అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఇరుముడి’ జోరు.... రవన్న ఈసారి గట్టిగా కొడుతున్నాడ్రోయ్‘ఇరుముడి’ కథకు అయ్యప్ప స్వామి భక్తి, 41 రోజుల మండల దీక్ష ప్రధాన మూలస్తంభాలని శివ నిర్వాణ తెలిపారు. చిన్నప్పటి నుంచే తనకు అయ్యప్ప స్వామిపై అమితమైన భక్తి, ప్రత్యేక అనుబంధం ఉండేవని, ఆ ఆలోచనలే ఈ కథారచనకు ప్రేరణగా నిలిచాయని వెల్లడించారు. 41 రోజుల పాటు అత్యంత నిష్ఠతో పాటించే నియమాలు ఒక సాధారణ వ్యక్తి అంతరంగాన్ని, అతని ఆలోచనా ధోరణిని ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాన్ని భావోద్వేగభరితంగా తెరపైకి తెచ్చినట్లు చెప్పారు. ఈ చిత్రంలో హీరో పాత్ర చాలా సహజంగా, నేటి సమాజానికి దగ్గరగా ఉంటుందని దర్శకుడు వివరించారు. హీరోకి మద్యపానం అలవాటు ఉంటుంది. అయితే కొన్ని పరిస్థితుల వల్ల అతను అయ్యప్ప స్వామి మాల ధరించాల్సి వస్తుంది. దీక్షా నియమాల ప్రకారం మండల కాలం పాటు పూర్తిగా మద్యానికి దూరంగా ఉండాలి. ఈ 41 రోజులు ఆ వ్యసనం నుంచి బయటపడటానికి అతను చేసే అంతర్మథనం ఏమిటి?, ఈ క్రమంలో అతని బలం, బలహీనతలు ఏమిటి?, తన ప్రాణమైన కూతురితో అతనికి ఉన్న అనుబంధంలో వచ్చిన మార్పులేంటి? అన్న భావోద్వేగ కోణంలో సినిమా సాగుతుంది’ అని శివ నిర్వాణ తెలిపారు.సాధారణంగా ఫ్యామిలీ సినిమాల్లో నిదానంగా సాగే కథనాలు ఉంటాయి. కానీ ‘ఇరుముడి’లో ఆ 41 రోజుల

ముంబైలో జరిగిన జెన్ జీ ఆందోళనల్లో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన మోడల్ రియా అహిర్, ఇప్పుడు పోలీసులను ఒక విజ్ఞప్తి చేసి వార్తల్లో నిలిచింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, సోషల్ మీడియాలో తనకు వస్తున్న బెదిరింపులు, నీచమైన కామెంట్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ముంబై పోలీసులను కోరింది. జూలై 22న దాదర్‌లోని శివాజీ పార్క్‌లో వర్షంలో జరిగిన నిరసన మహారాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఆ సమయంలో అరెస్ట్ చేసిన నిరసనకారులను తీసుకెళ్తున్న పోలీస్ వ్యాన్ ముందుకు వచ్చి, గ్రే కలర్ హూడీతో గట్టిగా నిలబడిన రియా అహిర్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దాంతో ఆమె ఒక్కసారిగా ఈ జెన్ జీ ప్రొటెస్ట్‌కు ముఖచిత్రంగా మారింది. ఈ వివాదంపై ముంబై యూత్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) మనోజ్ శర్మను కలిసి మాట్లాడింది. రియా అహిర్‌పై వేసిన ఎఫ్ఐఆర్, ఆమె ఎదుర్కొంటున్న ఆన్లైన్ వేధింపులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రతినిధి బృందంలో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి హర్గున్ సింగ్, ముంబై యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు జీనత్ శబ్రీన్ ఉన్నారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారని, మరి ఈ ఎఫ్ఐఆర్ల ఉపసంహరణలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని హర్గున్ సింగ్ ప్రశ్నించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, రియాపై ఉన్న ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకునే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని జాయింట్ సీపీ మనోజ్ శర్మ వారికి హామీ ఇచ్చారు. అలాగే, రియాకు సోషల్ మీడియా లో బెదిరింపు మెసేజ్‌లు పంపుతున్న అకౌంట్లపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. జాయింట్ సీపీతో సమావేశం తర్వాత రియా అహిర్ మాట్లాడుతూ.. తన నిరసన వీడియో వైరల్ అయినప్పటి నుండి ఆన్లైన్ వేధింపులు

మాస్ మహారాజా రవితేజ రేపు ఉదయం ఎనిమిది గంటల ఆట నుంచి ఇరుముడితో వరల్డ్ సెల్యులాయిడ్ పై సందడి చేయనున్నాడు. సాంగ్స్ తో పాటు ప్రచార చిత్రాలు పాజిటివ్ గా ఉండటంతో అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఇరుముడి వీక్షించడానికీ థియేటర్స్ దగ్గర బారులు తీరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే తన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి U/A 16+ సర్టిఫికెట్ లభించగా, రన్‌టైమ్ 2 గంటల 25 నిమిషాలు. సెన్సార్ సభ్యులు మరియు ఇండస్ట్రీ వర్గాల నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ రివ్యూ టాక్ ప్రకారం, రవితేజ కెరీర్లోనే ఒక అద్భుతమైన ఎమోషనల్ అండ్ పవర్ ప్యాక్డ్ కంబ్యాక్ మూవీగా నిలవబోతోంది. ఈ కథలో రవితేజ "త్రినాథ్" అనే ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. మొదట్లో మద్యానికి విపరీతంగా బానిసైన నెగెటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా రవితేజ నటన మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుంది. తన భార్య (ప్రియా భవానీ శంకర్), ముద్దుల కూతురు మణెమ్మ (బేబీ నక్షత్ర)లతో సాధారణ జీవితం గడుపుతున్న క్రమంలో, కూతురి కోరిక మేరకు ఆయన అయ్యప్ప మాల ధరిస్తారు. మద్యానికి బానిసైన ఒక తండ్రి అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వచ్చాయి, నిష్టగా మాల ఎలా కొనసాగించాడు అనేది సినిమాకు ప్రధాన హైలైట్‌గా మారనుంది. అంతేకాకుండా, ఊరిలో ఆడపిల్లలకు ముప్పు తలపెడుతున్న ఒక క్రైమ్ సస్పెన్స్ డ్రామాను దర్శకుడు శివ నిర్వాణ ఈ తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌కు అద్భుతంగా ముడిపెట్టారు. తన కూతురితో పాటు గ్రామంలోని మహిళల రక్షణ కోసం అయ్యప్ప దీక్షలో ఉన్న త్రినాథ్ ఏ విధంగా పోరాడాడు అనే అంశం ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయం. మాస్ యాక్షన్‌కి తోడుగా భక్తి రసం, తండ్రీ కూతుళ్ల మధ్యన సాగే ఎమోషనల్

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ఇరుముడి రేపు అంటే ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గత చిత్రాలకు భిన్నంగా 'ఇరుముడి'గతంలో రవితేజ అంటేనే ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ సినిమాలను ప్రేక్షకులు ఆశిస్తారు. అయితే, ఈసారి దర్శకుడు శివ నిర్వాణ ఆయనను పూర్తి భిన్నమైన, ఎమోషనల్ పాత్రలో చూపించబోతున్నారు. గతేడాది డిసెంబర్లో షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రం, కేవలం 45 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయ్యప్ప దీక్షా నేపథ్యంలో భావోద్వేగ కథఈ చిత్రంలో రవితేజ ఆటో డ్రైవర్‌గా, తాగుడుకు బానిసైన తండ్రి పాత్రలో కనిపిస్తారు. తన కూతురి కోరిక మేరకు ఆయన అయ్యప్ప దీక్ష పూనడం, ఆ తర్వాత ఆయన జీవితంలో వచ్చే మార్పులే కథాంశం. దీంతో, ఈ చిత్రం తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని కళ్లకు కట్టినట్లు చూపే ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందింది. చివరి 40 నిమిషాలు కీలకంసినిమాలోని చివరి 40 నిమిషాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయని దర్శకుడు శివ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, రవితేజ నటనలో కొత్త కోణాన్ని చూస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ఈ భావోద్వేగ సన్నివేశాలకు ప్రాణం పోసిందని సమాచారం. భారీగా బుకింగ్స్అల్లు సినిమాస్ ద్వారా బుక్ మై షోలో ఇప్పటికే టికెట్ల బుకింగ్స్ ఊపందుకున్నాయి. 'ది మాస్ ఈజ్ బ్యాక్' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటించగా, సాయికుమార్ కీలక పాత్రలో మెరవనున్నారు. సినిమాపై అంచనాలుసాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సాగే ఈ సీరియస్ డ్రామా తెలుగు