
Irumudi Karthika Masam Song Released Tl 230467c1
మాస్ మహారాజ రవితేజ, నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్, హరిహర సుతుడు అయ్యప్ప ల 'ఇరుముడి' 200 కోట్ల రూపాయిలు చేరుకోవడానికి రెడీ అవుతుంది.
మాస్ మహారాజ రవితేజ, నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్, హరిహర సుతుడు అయ్యప్ప ల 'ఇరుముడి' 200 కోట్ల రూపాయిలు చేరుకోవడానికి రెడీ అవుతుంది. తాజాగా ఇరుముడి నుంచి సరికొత్త డివోషనల్ వీడియో సాంగ్ 'కార్తీక మాసం' విడుదలై అభిమానులని ప్రేక్షకులని ఎంతోగానో ఆకట్టుకుంటోంది. స్వామి అయ్యప్ప భక్తి పారవశ్యాన్ని, మండల దీక్షా నియమాలను ఎంతో లోతుగా ఆవిష్కరించిన ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంది. ఈ అద్భుతమైన గీతానికి దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా సాహిత్యాన్ని అందించగా, జి. వి. ప్రకాష్ కుమార్ తో కలిసి శివ నిర్వాణ ఆలపించాడు
4 నిమిషాల 5 సెకన్ల నిడివితో ఉండగా నేరుగా శబరిమల భక్తి లోకంలోకి తీసుకెళ్తుంది. "ఇది మరి కార్తీక మాసం స్వామి... తలపై చన్నీళ్ల స్నానం కాని మనసే మరింత భద్రం స్వామి" అంటూ సాగే లిరిక్స్ దీక్షా ధారుల జీవితాన్ని, శారీరక కష్టాలను దాటి పొందే ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రతిబింబిస్తాయి. భక్తులు పడే తపన, చలిలో ఉదయాన్నే చేసే స్నానాలు, కటిక నేలపై పడుకునే నిరాడంబరమైన జీవనశైలిని చాలా సహజంగా ఈ పాటలో వర్ణించారు. పాటలోని అతి ముఖ్యమైన అంతరార్థం ఏమిటంటే— "కనిపించని శత్రువు కాదు, యుద్ధం కాదీ మండల దీక్ష... నాతోటి నేనే చేసే యుద్ధమే ఈ దీక్ష". బయటి సమాజంతో లేదా శత్రువులతో చేసే పోరాటం కాదు మండల దీక్ష, మనలోని అహంకారాలు, ద్వేషాలు, కామక్రోధాలపై మనతో మనమే చేసే అంతర్యుద్ధం అనే గొప్ప సందేశాన్ని ఈ పాటకు శివ నిర్వాణ అందించారు. అలాగే "నేను అంటే నువ్వే అంటూ స్వామి పదవి ఇచ్చావు... ద్వేషాల్ని దూరం చేసి వర్ణాన్ని ఒక్కటి చేసి" అని అయ్యప్ప దీక్షలోని సమభావనను ఎత్తిచూపారు. కులమతాల భేదం లేకుండా, చిన్నపెద్ద తారతమ్యం లేకుండా నల్లటి దుస్తులు ధరించి ప్రతి ఒక్కరినీ 'స్వామి' అని పిలుచుకునే ఆచారాన్ని అత్యంత భావోద్వేగంగా పాటలో చూపించారు. రవితేజ ఈ పాటలో అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించిన తీరు, ఆయన చూపించిన హావభావాలు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి.
ఇప్పటికే విడుదలైన 'ఇరుముడి కట్టు... శబరిమల ఎక్కు', 'మల్లెపూల పల్లకీ', 'యాలాలో యాలాలో సాంగ్స్ యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుకెళ్తున్న విషయం తెలిసిందే.
[irmudi, Raviteja, Karthika Maasam Song, Shiva Nirvana, Telugu Cinema, Telugu Cinema News, Tollywood ]
అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన మమితా భైజు..ప్రాబ్లమ్ ఇదే
Panjaa Re Release: 3 గంటల్లో 150 షోలు సోల్డ్ అవుట్.. రీ రిలీజ్ బాక్సాఫీస్ షేక్!
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com
Disclaimer : All content on this website, including text, images, videos, graphics, and audio, is the intellectual property of ObjectOne Information Systems Ltd. and/or its affiliates. Any unauthorized reproduction, distribution, modification, or publication of this material, in whole or in part, is strictly prohibited without prior written consent from ObjectOne Information Systems Ltd.






