
Shiva Jyothi : ఫ్యామిలీతో కలిసి యాంకర్ శివజ్యోతి వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..
బిగ్ బాస్ ఫేమ్, యాంకర్ శివజ్యోతి నేడు వినాయకచవితి సందర్భంగా తన భర్త, కూతురుతో కలిసి వినాయకుడికి పూజలు నిర్వహించి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

బిగ్ బాస్ ఫేమ్, యాంకర్ శివజ్యోతి నేడు వినాయకచవితి సందర్భంగా తన భర్త, కూతురుతో కలిసి వినాయకుడికి పూజలు నిర్వహించి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బుల్లితెర బ్యూటీలు తాజాగా షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ విశేషాలు చూద్దాం

ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో యాంకర్ శివజ్యోతి (Shiva Jyothi) కూడా తన ఫోటోలను 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సై ఫై థ్రిల్లర్ 'కిల్లర్' సినిమా విజయదశమి కానుకగా అక్టోబర్ 17న విడుదల అవుతోంది. జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ 'కిల్లర్'. ఇందులో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను విజయదశమి పర్వదినం సందర్భంగా అక్టోబర్ 17న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. 'కిల్లర్' సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా విడుదలయ్యే అక్టోబర్ 17న మన దేశపు గొప్ప సైంటిస్ట్ డా.పూర్వజ్ ను ఏలియన్స్ కాంటాక్ట్ అవుతారు. ఒక స్పేస్ షిప్ ను భూమికి పంపిస్తున్నట్లు తెలియజేస్తారు. ఈ విషయాన్ని మిగతా వారికీ చెప్పమని, తాము మానవులను రక్షించాలని అనుకుంటున్నట్లు ఆ ఏలియన్ డా.పూర్వజ్ కు చెబుతుంది. మన భవిష్యత్, ఆ ఏలియన్ కు గతం. ఇలా మరో కాలం నుంచి వస్తున్న ఆ ఏలియన్ డా.పూర్వజ్ ను ఎందుకు కాంటాక్ట్ అయ్యింది ? స్పేస్ షిప్ ను భూమికి ఎందుకు పంపించాలనుకుంది ? మానవాళికి ఏర్పడిన ముప్పు ఏంటి ? ఆ ఏలియన్ చేయాలనుకున్న సాయం ఏంటి ? వంటి ప్రశ్నలతో రిలీజ్ డేట్ గ్లింప్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. 'కిల్లర్' మూవీని ఓఎంజి పిక్చర్స్ సంస్థ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. దీనిని అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యా వంటి దేశాల్లో విడుదల చేయబోతోంది. ఇదిలా

Singareni: దేశ ఇంధన భద్రతకు బొగ్గుతో పాటు పునరుత్పాదక విద్యుత్ లో కూడా సింగరేణి కృషి సింగరేణి: రాష్ట్ర దేశ ఇంధన భద్రతకు సింగరేణి సంస్థ తగినంత బొగ్గును అందించడంతో పాటు పునరుత్పాతక విద్యుత్తు రంగంలో కూడా తన వంతు కృషి చేస్తుందని సింగరేణి సంస్థ ఛైర్మన్ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి తెలిపారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఇండియన్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్ పో కార్యక్రమంలో భాగంగా బుధవారం జరిగిన భారత ఇంధన భద్రత విద్యుత్ ఉత్పత్తి అనే గోష్టిలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ దశాబ్దాల కాలంగా దేశ ఇంధన అవసరాలకు తనవంతుగా బొగ్గు అందిస్తూ వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడానికి రాష్ట్ర జెన్ కో మరియు ట్రాన్స్ కో కలిసి సమష్టిగా కృషి చేస్తుందన్నారు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ మరియు క్రిటికల్ మినరల్ రంగంలోకి కూడా ప్రవేశించిందని, అయినప్పటికీ దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్పత్తికి మరో నాలుగు దశాబ్దాల పాటు డిమాండ్ ఉండే అవకాశం ఉందన్నారు. కనుక సింగరేణి సంస్థ రానున్న కాలంలో బొగ్గు ఉత్పత్తి పెంచడానికి కృషి చేస్తుందని అలాగే పునరుత్పాతక ఇంధన రంగంలో కూడా తన వంతు బాధ్యత నిర్వహిస్తుందని తెలిపారు. ఈ చర్చ గోష్టికి ప్రొఫెసర్ పవన్ కుమార్ పరనంది సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈ ఎనర్జీ సమ్మిట్ కు తెలంగాణ ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ నవీన్ మిట్టల్ హాజరుకాగా... ప్యానెల్ డిస్కషన్ లో సింగరేణి ఛైర్మన్ తో పాటు తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ సీఎండీ డాక్టర్ ఎస్. హరీష్, రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన నిగం లిమిటెడ్ సీఎండీ శ్రీ దేవేంద్ర శృంగి, ఎన్టీపీసీ సౌత్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్

‘‘వయస్సు మళ్లిన.. ఎముకలు కుళ్లిన..’’ అంటూ మహా ప్రస్థానంలో శ్రీశ్రీ వర్ణించిన దృశ్యం ఒకప్పుడు వృద్ధాప్యానికి ప్రతీక.. కానీ ఇప్పుడు కాలం మారింది!. ఆ పరిస్థితి నేడు అరవై, డెభై ఏళ్ల వయస్సులో కాదు.. నలభై ఏళ్లకే కనిపిస్తోంది. హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): ‘‘వయస్సు మళ్లిన.. ఎముకలు కుళ్లిన..’’ అంటూ మహా ప్రస్థానంలో శ్రీశ్రీ వర్ణించిన దృశ్యం ఒకప్పుడు వృద్ధాప్యానికి ప్రతీక.. కానీ ఇప్పుడు కాలం మారింది!. ఆ పరిస్థితి నేడు అరవై, డెభై ఏళ్ల వయస్సులో కాదు.. నలభై ఏళ్లకే కనిపిస్తోంది. కండరాల బలం తగ్గిపోవడం, నడక మందగించడం, చిన్నపాటి శ్రమకే అలసట, రోజూ చేసే పనులు కూడా చేయలేక పోవడం ఇలా పలు సమస్యలకు పని ఎక్కువైంది.. నిద్ర తగ్గింది.. అంటూ కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. కానీ అసలు నిజం మాత్రం ‘సార్కోపీనియా’ అనే కండరాలను కరిగించే వ్యాధి కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సార్కోపీనియా అంటే కండరాల పరిమాణం తగ్గిపోవడం, బలం, శారీరక సామర్థ్యం క్రమంగా క్షీణించడం. ఒకప్పుడు వృద్ధాప్య లక్షణంగా భావించిన ఈ కండరాల క్షీణత.. మారుతున్న జీవనశైలితో 40 ఏళ్ల వయస్సులో ఉన్న వారిపై దాడి చేస్తోంది. గంటల తరబడి కూర్చునే ఉద్యోగాలు వ్యాయామం లేకపోవడం, పోషకాహార లోపం, ఒత్తిడి పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయని భారత జిరియాట్రిక్ సొసైటీ హెచ్చరిస్తోంది. వయసు పెరిగే కొద్ది కండరాలు సాధారణంగానే క్షీణిస్తాయి. కానీ, ప్రారంభ దశలోనే కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. తరచూ అలసటగా అనిపించడం, మెట్లు ఎక్కడం కష్టంగా మారడం, నడక వేగం తగ్గిపోవడం, సమతుల్యత కోల్పోయి పడిపోవడం లేదా ఎముకలు విరిగే ప్రమాదాన్ని పెంచడం వల్ల జీవన నాణ్యతపై ప్రభావం చూపిస్తాయి. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోతే కండరాల నిర్మాణం మరింత వేగంగా దెబ్బ తింటుంది. శరీరానికి తగినంత ప్రోటీన్ అందకపోవడం, వయసు పెరిగే కొద్దీ కండరాల పెరుగుదలకు సహాయపడే హార్మోన్లు తగ్గడం వల్ల

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి జ్యోతిక మునిరత్నం. ఇప్పుడిప్పుడే స్మాల్ స్క్రీన్ పై మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అద్భుతమైన నటనతో, ముఖ్యంగా విలన్ పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. తక్కువ సమయంలోనే నటిగా అందరి హృదయాలు గెలుచుకుంది. 'గుండెనిండా గుడిగంటలు' సీరియల్లోని 'రోహిణి' పాత్రతో ఆమె చేసిన నటనా మాయాజాలం తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే సీరియల్లో పద్దతిగా ఉండే రోహిణి.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలతో నెట్టింట మెంటలెక్కిస్తుంది. జ్యోతిక కన్నడ బుల్లితెర పరిశ్రమ ద్వారా తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించారు. కన్నడలో అనుభవం సంపాదించుకున్న తర్వాత, ఆమె తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు.'కళ్యాణి' సీరియల్లో కీలక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం 'గుండెనిండా గుడిగంటలు' సీరియల్లో ఆమె పోషిస్తున్న 'రోహిణి' నెగటివ్ పాత్ర కథకు ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ పాత్రలో ఆమె చేసే ప్లాన్స్, విలనిజం ప్రేక్షకులకు కోపం తెప్పించినా, నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. జ్యోతిక కర్ణాటకకు చెందిన అమ్మాయి. బెంగళూరులో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని, నటనపై ఉన్న మక్కువతో గ్లామర్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టారు. సీరియల్స్‌లో ఎప్పుడూ చీరకట్టుతో, పద్ధతిగా కనిపించే జ్యోతిక, నిజ జీవితంలో మాత్రం చాలా మోడ్రన్‌గా ఉంటారు. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే వెస్ట్రన్ ఫొటోషూట్స్ చూస్తుంటే, 'ఈమె నిజంగానే రోహిణీనా?' అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ తన స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తుంటారు. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై క్రేజ్ ఉన్న విలన్ పాత్రధారుల్లో జ్యోతిక ఒకరు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఆమె తన పాత్రల డిమాండ్‌ను బట్టి రోజుకు సుమారు రూ. 15,000 నుండి రూ. 25,000 వరకు పారితోషికం అందుకుంటున్నట్లు అంచనా. కేవలం సీరియల్స్‌కే పరిమితం కాకుండా, భవిష్యత్తులో వెండితెరపై కూడా మంచి పాత్రలు చేయాలని