
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద రికార్డు బుకింగ్స్‌తో దూసుకుపోతోంది. బుక్‌మైషోలో గంటకి ఏకంగా 27 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతూ ట్రెండింగ్‌లో నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రవితేజ నటన, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, ఎమోషనల్ కథాంశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
రీసెంట్ టైమ్‌లో ఒక పవర్ ఫుల్ ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాకి ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం చూడలేదు. అసలు గంటకి 27.64K+ టికెట్స్ బుక్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇది కేవలం ఒక బుకింగ్ నంబర్ మాత్రమే కాదు, ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న నమ్మకం, క్రేజ్. మొదటి షో సమయానికే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉంది, పైగా సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీనిని బట్టి చుస్తే, 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది.
అసలు ఈ సినిమాకి ఇంతటి భారీ హైప్ రావడానికి పలు కారణాలు ఉన్నాయి. మొదటిది, మన మాస్ మహారాజా రవితేజ యాక్టింగ్. ఎక్కువగా మాస్ సినిమాలతో అలరించే రవితేజ, ఈసారి రూట్ మార్చారు. 'నిన్ను కోరి', 'మజిలీ' లాంటి ఎమోషనల్ బ్లాక్‌బస్టర్స్ అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్షన్ అనగానే అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి మొదలైంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. రవితేజను ఒక విభిన్నమైన, మనసుకి హత్తుకునే రోల్లో చూపించడంలో శివ నిర్వాణ వంద శాతం సక్సెస్ అయ్యారని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు.
రెండోది, సినిమాలోని ఎమోషనల్ కంటెంట్, పెరెంటింగ్ కాన్సెప్ట్. తండ్రీకూతుళ్ల అనుబంధం, భక్తి, సొసైటీకి అవసరమైన ఒక పవర్ ఫుల్ మెసేజ్‌ని చాలా ఎంగేజింగ్‌గా చూపెట్టారు. త్రినాథ్ గా రవితేజ నటన, చిన్నారి బేబీ నక్షత్ర యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఆడపిల్ల తండ్రి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
మూడోది, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్. 'మల్లెపూల పల్లకి' పాట మొదలుకొని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వరకు సినిమా ఎమోషన్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్లాయి. అంతేకాకుండా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్‌గా ఉన్నాయి.
ఒకవైపు ఫ్యామిలీ ఆడియన్స్, ఇంకోవైపు మాస్ ఆడియన్స్.. ఇద్దరినీ థియేటర్లకు రప్పించడంలో 'ఇరుముడి' సక్సెస్ అయింది. ఫస్ట్ షోలు, సెకండ్ షోలు, మార్నింగ్ షోలు అనే తేడా లేకుండా బుక్‌మైషోలో ఓ రేంజ్ లో బుకింగ్స్ కనిపిస్తున్నాయి. ఈ రేంజ్ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ వద్ద రవితేజ కెరీర్లోనే ఇది ఒక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలవబోతోంది.
సరైన కంటెంట్ పడితే రవితేజ బాక్సాఫీస్ పవర్ ఎలా ఉంటుందో 'ఇరుముడి' మరోసారి నిరూపిస్తోంది.
Irumudi Movie, Bookings, Ravi Teja, Shiva Nirvana
దీపిక సీక్రెట్ లీక్: అందుకే 'స్పిరిట్' నుంచి తీసేశారా.. బాబోయ్ ఇంత పని చేసిందా.!
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com
Disclaimer : All content on this website, including text, images, videos, graphics, and audio, is the intellectual property of ObjectOne Information Systems Ltd. and/or its affiliates. Any unauthorized reproduction, distribution, modification, or publication of this material, in whole or in part, is strictly prohibited without prior written consent from ObjectOne Information Systems Ltd.





