
ఇంటర్నెట్‌ డెస్క్: వివాహం అయిన తర్వాత విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న చిత్రం ‘రణబాలి’. రాహుల్‌ సాంకృత్యాన్‌ (Ranabaali Director) దర్శకత్వంలో రానున్న ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ షూటింగ్‌ పూర్తయినట్లు టీమ్‌ అధికారికంగా తెలిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా షేర్‌ చేసిన వీడియోలో.. జయమ్మ పాత్ర కోసం రష్మిక బేబీ బంప్‌తో కనిపిస్తోన్న లుక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మిక పాత్రపై దర్శకుడు రాహుల్‌ ఎమోషనల్ పోస్ట్‌ పెట్టారు. ‘‘ఈ సినిమాలోని (Ranabaali) ప్రతి పాత్రను ఎంతో భావోద్వేగంతో రాశాను. హీరోయిన్‌ క్యారెక్టర్‌కు జయమ్మ అని మా అమ్మ పేరు పెట్టాను. ఆ జయమ్మ నేటితరం మహిళలకు స్ఫూర్తినిస్తుంది. ఆమె డైలాగుల విషయంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకున్నా. రష్మిక ఈ పాత్రకు ప్రాణం పోశారు. ఆమె ఎప్పటికీ జయమ్మగా అందరికీ గుర్తుండిపోతుంది’’ అని రాహుల్‌ తన పోస్ట్‌లో రాశారు. ఆమె రణబాలి అనురాగానికి ప్రతిరూపమని నిలువెత్తు ధైర్యానికి ఆయువు పట్టు అంటూ ఆమె ( Rashmika ) పాత్ర తీరును వివరించారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ పూర్తయినట్లు తెలుపుతూ విజయ్‌ దేవరకొండ ( Vijay Deverakonda ) పోస్ట్‌ పెట్టారు. ‘‘ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందంటే నమ్మలేకపోతున్నాను. రణబాలి, జయమ్మ పాత్రలను మిస్‌ అవుతున్నా’’ అని అన్నారు. ఇదే పోస్ట్‌ను రీషేర్‌ చేసిన రష్మిక.. జయమ్మ అందరి హృదయాలను హత్తుకునే పాత్ర అని తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





